Chanakya Niti Money: డబ్బుకు లోకం దాసోహం అంటారు. ఈ రోజుల్లో అందరు డబ్బుకే ప్రాధాన్యం ఇస్తున్నారు. డబ్బు లేకపోతే ఇక జీవితమే లేదు అనే స్థాయికి ఎదిగారు. దీంతో డబ్బు లేకపోతే అతడికి విలువే లేదు. డబ్బు ఎలా సంపాదించినా వాడికే విలువ ఇస్తున్నారు. కానీ డబ్బు కంటే చాలా విషయాలు విలువైనవి ఉన్నాయని ఆచార్య చాణక్యుడు సూచించాడు. డబ్బు సంపాదించాలి. కానీ అడ్డదారుల్లో కాదు. న్యాయబద్ధంగానే సంపాదిస్తే మనసుకు హాయిగా ఉంటుంది. కానీ అక్రమాల ద్వారా సంపాదిస్తే భయం కలుగుతుంది.
డబ్బు మీద స్త్రీలకు అత్యాశ ఉంటుంది. డబ్బు, నగలు, ఆస్తులు సంపాదించాలనే యావ ఎక్కువగా ఉంటుంది. వారికి ఎప్పుడు డబ్బు మీదే ధ్యాస ఉంటుంది. దురాశ స్త్రీలను తప్పుడు పనులు చేయిస్తుంది ఇది వైవాహిక జీవితానికి మంచిది కాదు. అందుకే దురాశ దుఖానికి చేటు అంటారు. ఇలా స్త్రీలు తమ జీవితంలో డబ్బు కోసం ఎంతకైనా తెగిస్తారు.
పని చేసి పది మందిని సాకితే ఇగురంతోనే ఇరవై మందిని సాకాడట. తెలివితేటలు ఉన్న వ్యక్తి ఎక్కడైనా బతుకుతాడు. కష్టాల్లో ఉన్న సులభంగా బయటపడతాడు. డబ్బు సంపాదనలో కూడా ముందుంటాడు. సమాజంలో జ్ణానం ఉన్న వ్యక్తి తన మెదడుతో చురుకుగా వ్యవహరించి ముందుంటాడు. అన్నింటికి జ్ణానమే మూలం. మనిషి తన తెలివితేటలను ఉపయోగించుకుని ప్రయోజనాలు పొందవచ్చు.
మనిషి అనుభవాల ద్వారా చాలా విషయాల్లో ప్రత్యేకత చూపుతాడు. మంచి, చెడుల మధ్య వ్యత్యాసాన్ని అర్థం చేసుకుంటాడు. తగిన నిర్ణయాలు తీసుకుని ఆలోచనలు చేస్తాడు. ఎలాంటి లక్ష్యాన్ని అయినా సులభంగా చేరుకుంటాడు. కానీ మహిళలు మాత్రం తమ భర్తల కంటే తామే తెలివిగల వారమని భావిస్తూ తప్పులు చేస్తుంటారు. ఇలాంటి వారికి దూరంగా ఉండటమే మంచిది.