జర్మనీలో కరోనా విజృంభణ.. ఆర్థిక మంత్రి ఆత్మహత్య

ప్రస్తుతం ప్రపంచాన్ని బెంబెలెత్తిస్తున్న మహమ్మరి కరోనా(కోవిడ్-19). ఈ వైరస్ బారినపడిన ప్రజలు మృత్యువాతపడుతున్న సంఘటనలు ఇప్పటివరకు చూశాం. అయితే ఈ మహమ్మరి పరోక్షంగా ప్రజల ప్రాణాలను బలగొనడం మొదలైట్టింది. జర్మనీ దేశంలో కరోనా ధాటికి ఆర్థిక వ్యవస్థ అతలాకూతలమైంది. దీనిని తట్టుకోలేక జర్మనీలోని హెస్సీ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి థామస్ షాఫర్(54) ఆత్మహత్య చేసుకున్నారు. ఆయన ఆత్మహత్య చేసుకోవడం సంచలనంగా మారింది. చైనాలోని వూహాన్లో పుట్టిన కరోనా(కోవిడ్-19) వైరస్ క్రమంగా ప్రపంచ దేశాలకు పాకింది. కరోనా […]

  • Written By: Neelambaram
  • Published On:
జర్మనీలో కరోనా విజృంభణ.. ఆర్థిక మంత్రి ఆత్మహత్య

ప్రస్తుతం ప్రపంచాన్ని బెంబెలెత్తిస్తున్న మహమ్మరి కరోనా(కోవిడ్-19). ఈ వైరస్ బారినపడిన ప్రజలు మృత్యువాతపడుతున్న సంఘటనలు ఇప్పటివరకు చూశాం. అయితే ఈ మహమ్మరి పరోక్షంగా ప్రజల ప్రాణాలను బలగొనడం మొదలైట్టింది. జర్మనీ దేశంలో కరోనా ధాటికి ఆర్థిక వ్యవస్థ అతలాకూతలమైంది. దీనిని తట్టుకోలేక జర్మనీలోని హెస్సీ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి థామస్ షాఫర్(54) ఆత్మహత్య చేసుకున్నారు. ఆయన ఆత్మహత్య చేసుకోవడం సంచలనంగా మారింది.

చైనాలోని వూహాన్లో పుట్టిన కరోనా(కోవిడ్-19) వైరస్ క్రమంగా ప్రపంచ దేశాలకు పాకింది. కరోనా దాటికి అమెరికా, ఇటలీ, చైనా, యూకే, ఫ్రాన్స్, జర్మనీ దేశాలు అతలాకుతులం అవుతున్నాయి. ఇప్పటికే ఆయా దేశాలు లాక్డౌన్ చర్యలు చేపట్టాయి. దీంతో ఆయా దేశాల్లో రవాణా వ్యవస్థ స్తంభించిపోయింది. దీని ప్రభావంతో ఆర్థిక వ్యవస్థ కుదేలవుతోంది. కరోనా వైరస్ ప్రభావం చైనాయేతర దేశాల్లోనే ఎక్కువగా ఉంటుంది. కరోనా దాటికి ఇటలీ దేశం శవాలదిబ్బను తలపిస్తోంది. అదేవిధంగా స్పెయిన్ దేశంలో కరోనా ప్రభావం ఎక్కువగానే నమోదవుతుంది. ఇటీవలే స్పెయిన్ యువరాణి మరియా థెరిసా కరోనాతో మృతిచెందిందంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు.

యూకే లోనూ పరిస్థితి ఏమాత్రం ఆశాజనకంగా లేదు. కరోనాతో ఇక్కడి రాజకుటుంబాలు బెంబెలెత్తిపోతున్నాయి. తాజాగా బ్రిటన్ యువరాజు చార్లెస్ కరోనా సోకడంతో ప్రస్తుతం ఐసోలేషన్లో చికిత్స చేయించుకుంటున్నారు. ఇక జర్మనీలో కరోనా ప్రభావంతో ఆ దేశ ఆర్థిక వ్యవస్థ కోలుకోలేని స్థితిలోకి చేరుకుంది. ఆర్థిక మాంద్యం పరిస్థితులకు దారితీయడంతో ఆ దేశ ఆర్థిక మంత్రి బలవన్మరణానికి పాల్పడ్డాడు. శనివారం రైలు పట్టలపై నిర్జీవంగా కనిపించారు.

షాఫర్ జర్మనీలోని హెస్సీ రాష్ట్ర ఆర్థిక మంత్రి. ఆయన గత పదేళ్లుగా ఆర్థికమంత్రిగా సేవలందిస్తున్నారు. ప్రముఖ బ్యాంకుల కేంద్ర స్థానమైన హెస్సీ కరోనా దాటికి అతలాకుతలమైది. దీంతో భవిష్యత్ పరిస్థితిని అంచనా వేసిన షాఫర్ ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది.

సంబంధిత వార్తలు