spot_img
Homeఆంధ్రప్రదేశ్‌Jawahar Reddy: ఇక మిగిలింది సిఎస్ జవహర్ రెడ్డే

Jawahar Reddy: ఇక మిగిలింది సిఎస్ జవహర్ రెడ్డే

Jawahar Reddy: గత కొద్దిరోజులుగా ఏపీలో ఎలక్షన్ కమిషన్ కఠిన చర్యలు తీసుకుంటూ వస్తోంది. కొన్నివారాల నుంచి కొరడా ఝళిపిస్తోంది. ఎన్నికల సమయంలో పరిధి దాటి వ్యవహరిస్తున్న అధికారులకు బదిలీ చేస్తోంది. ఇప్పటికే చాలామంది బదిలీ అయ్యారు. ఇందులో కొందరు ఎన్నికల నిబంధనల మేరకు బదిలీ కాగా.. మరికొందరు మాత్రం విపక్షాల ఫిర్యాదులతో చర్యలకు గురయ్యారు. అయితే ఇలా బదిలీ వేటు పడిన వారంతా ఉద్దేశపూర్వకంగా ప్రతిపక్షాలను ఇబ్బంది పెట్టిన వారే. అయితే అన్నింటికీ మించి విపక్షాలపై కేసులతో పోలీస్ శాఖ ఉక్కు పాదం మోపిందన్న విమర్శ ఉంది. దీని వెనుక డిజిపి రాజేంద్రనాథ్ రెడ్డి ఉన్నారన్నది ప్రధాన ప్రతిపక్షం ఆరోపణ. ఇప్పుడు ఆయన పైనే వేటు పడింది.

ఇక అధికారులపై చర్యలు ఉండవని అంతా భావించారు. ఏపీలో వైసీపీకి కేంద్రం ఫేవర్ చేస్తుందన్న ఆరోపణ కూడా వచ్చింది. ఇటువంటి తరుణంలో రాత్రికి రాత్రే కొత్త డిజిపి నియామకం పూర్తయింది. రాష్ట్ర ప్రభుత్వం ముగ్గురు అధికారుల పేర్లు సిఫారసు చేయగా.. 1992 బ్యాచ్కు చెందిన హరీష్ కుమార్ గుప్తా పేరును ఎలక్షన్ కమిషన్ డిజిపిగా ఖరారు చేసింది.వాస్తవానికి సీనియర్ అధికారుల జాబితాలో ఆర్టీసీ ఎండీ ద్వారకాతిరుమల పేరు ఉంది. ఈయన సైతం వైసీపీ అస్మదీయ అధికారి అన్న పేరు ఉంది. అందుకే ఆయన పేరును పరిగణలోకి తీసుకోలేదు. చివరకు హరీష్ కుమార్ గుప్తా పేరును ఖరారు చేయడంతో.. వైసిపి ఒక్కసారిగా నీరు గారి పోయింది. అదే సమయంలో సీఎం జగన్ స్వరం సైతం మారింది.

అటు రాయలసీమలో కీలకమైన అనంతపురం డిఐజి అమ్మిరెడ్డి పై కూడా ఎన్నికల సంఘం వేటువేసింది. గత కొద్ది రోజుల నుంచి ప్రతిపక్షాలు ఆయనపై ఆరోపణలు చేస్తూ వస్తున్నాయి. ఎలక్షన్ కమిషన్కు ఫిర్యాదులు కూడా వెల్లువెత్తాయి. ఈ తరుణంలోనే ఎలక్షన్ కమిషన్ కఠిన చర్యలకు దిగింది. బదిలీ వేటు వేసింది. అయితే ఎన్నికలకు రెండు వారాల ముందు ఈసీ అధికారులపై చర్యలకు దిగడం విశేషం. దాదాపు వివాదాస్పద అధికారులంతా బదిలీ అయ్యారు. ఒకే ఒక్కరు మిగిలిపోయారు. ఆయనే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి. ఆయనపై చర్యలు ఉండబోతున్నాయి అన్నది గత కొద్ది రోజులుగా జరుగుతున్న ప్రచారం. ఇప్పటికే డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి పై చర్యలకు ఉపక్రమించడంతో.. ఇక మిగిలింది సి ఎస్ అని టాక్ నడుస్తోంది. ఒకటి రెండు రోజుల్లో ఆయనపై సైతం చర్యలకు దిగే అవకాశం ఉంది. అదే జరిగితే ఏపీలో ఎన్డీఏ కూటమి మాట నెగ్గినట్టే.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

Related News

Most Popular

Godavari Pulasa

Godavari Pulasa: *‘పులస’ ఎందుకు దొరకడం లేదు.. గోదావరిలోకి ఎందుకు రావడం లేదు?*

Godavari Pulasa: చేపలందు.. ఓ చేప వేరయ్యా.. అదే మన గోదారి పులస. 'పుస్తెలమ్మి అయినా పులస తినాల్సిందే'.. అనే నానుడి గోదావరి జిల్లాలో ఉందంటే ఆ చేప ప్రత్యేకత అంతలా ఉంటుందన్నమాట....
Adani Group Airlines

Adani Group Airlines: ఎయిర్ లైన్స్ వ్యాపారంలోకి అదానీ గ్రూప్ ఎంట్రీ..

Adani Group Airlines: దేశీయ విమానయాన రంగంలో సరికొత్త పరిణామాలు చోటుచేసుకోనున్నాయి. ప్రముఖ వ్యాపారవేత్త గౌతం అదానీ నేతృత్వంలో ప్రధాని గ్రూప్ కొత్తగా విమానయాన సేవలోకి ప్రవేశించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. ఈ...
Srirastu Meaning

Srirastu Meaning: పెళ్లి పత్రికలో శ్రీరస్తు అని ఎందుకు రాస్తారు.. శ్రీ అనే అక్షరానికి ఎలాంటి ప్రాధాన్యత ఉంది..

Srirastu Meaning: సాధారణంగా లక్ష్మీదేవి పేరు రాసేటప్పుడు ముందు శ్రీ అని రాస్తారు. అలాగే వివాహ ఆహ్వాన పత్రికల్లో శ్రీరస్తు.. అని పేర్కొంటారు.. ఏదైనా శుభకార్యం చేసేటప్పుడు కూడా శ్రీ అని...
Amazon Employee Quits Job

Amazon Employee Quits Job: అమెజాన్ లో రూ.35 లక్షల వేతనం వదిలి.. మనశ్శాంతి కోసం ఈ టెకీ...

Amazon Employee Quits Job: ఆమెకు ఏడాదికి రూ. 30 లక్షల వేతనం.. ఆమె భర్తకు కూడా మంచి ఉద్యోగం.. ఇద్దరికీ కలిపి సుమారు రూ. 65 లక్షల వరకు ఆదాయం.. సాధారణంగా...
Toli Ekadashi 2026

Toli Ekadashi 2026: తొలి ఏకాదశి ఎప్పుడు? ఆరోజు ఏం చేయొద్దు.. ఏం చేయాలంటే.

Toli Ekadashi 2026: హిందూ సాంప్రదాయం ప్రకారం ప్రతి ఏడాదిలో వచ్చే ఏకాదశి తిథులకు ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది. ప్రతి నెలలో శుక్ల, కృష్ణ పక్షాల్లో ఒక్కో ఏకాదశి చొప్పున ఏడాదిలో మొత్తం...
Oktelugu Epaper