DC Vs RR: ఐపీఎల్ 17వ సీజన్లో మరో ఆసక్తికర పోరుకు రంగం సిద్ధమైంది. మంగళవారం అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా ఢిల్లీ, రాజస్థాన్ జట్లు తలపడనున్నాయి. మొన్నటివరకు పాయింట్ల పట్టికలో రాజస్థాన్ మొదటి స్థానంలో ఉండేది. అయితే ఇటీవల హైదరాబాద్ జట్టుతో జరిగిన మ్యాచ్లో ఒక్క పరుగు తేడాతో రాజస్థాన్ ఓడిపోయింది. ఇదే తరుణంలో కోల్ కతా పంజాబ్ చేతిలో విజయాన్ని అందుకోవడంతో పాయింట్ల పట్టికలో మొదటి స్థానాన్ని దక్కించుకుంది. అనధికారికంగా ప్లే ఆఫ్ వెళ్లిపోయింది. ఇక రాజస్థాన్ జట్టు హైదరాబాద్ చేతిలో ఓడిపోయిన నేపథ్యంలో.. మంగళవారం ఢిల్లీ జట్టుతో జరిగే మ్యాచ్లో గెలవాలని భావిస్తోంది. ఈ మ్యాచ్లో గెలిస్తే ఢిల్లీ పాయింట్ల పట్టికలో మళ్లీ మొదటి స్థానానికి వస్తుంది. అప్పుడు నేరుగానే ప్లే ఆఫ్ వెళ్ళిపోతుంది. కోల్ కతా జట్టు తో సమానంగా 16 పాయింట్లు కలిగి ఉన్నప్పటికీ.. నెట్ రన్ రేట్ కారణంగా రాజస్థాన్ రెండవ స్థానానికి పరిమితమైంది.
మరోవైపు ఢిల్లీ క్యాపిటల్స్ ఇప్పటివరకు అస్థిరమైన ఆట తీరును ప్రదర్శిస్తోంది. ఇప్పటివరకు 11 మ్యాచులు ఆడి.. ఐదు విజయాలు అందుకుంది. పాయింట్ల పట్టికలో ఆరవ స్థానంలో కొనసాగుతోంది. రాజస్థాన్ జట్టుతో మంగళవారం జరిగే మ్యాచ్లో విజయాన్ని సాధించి.. ప్లే ఆఫ్ ఆశలను మెరుగుపరచుకోవాలని భావిస్తోంది. ఢిల్లీ ప్లే ఆఫ్ కి వెళ్లాలంటే వచ్చే మూడు మ్యాచ్లలో కచ్చితంగా గెలవాలి. అలా గెలిస్తేనే ఆ జట్టు 16 పాయింట్లు సాధించగలుగుతుంది. అప్పుడు ఆ జట్టుకు ప్లే ఆఫ్ వెళ్లేందుకు అవకాశాలుంటాయి. అయితే ఢిల్లీ జట్టుకు బ్యాటింగ్ ప్రధాన అవరోధంగా మారింది. రిషబ్ పంత్, పృథ్వీ షా, జేక్ ఫ్రెజర్, అభిషేక్ పోరెల్ వంటి వారు పెద్దగా రాణించడం లేదు.. ఢిల్లీ జట్టు ఈ మ్యాచ్ లో గెలవాలంటే వీరు కచ్చితంగా రాణించాల్సి ఉంది.. ఇప్పటివరకు రాజస్థాన్, ఢిల్లీ 28 సార్లు తలపడ్డాయి. రెండు జట్లు కూడా సమఉజ్జీలుగా ఉన్నాయి.
జట్ల అంచనా ఇలా
ఢిల్లీ జట్టు..
ముందుగా బౌలింగ్ చేస్తే: పృథ్వీ షా, జేక్ ఫ్రేజర్, అభిషేక పోరెల్, పోప్, రిషబ్ పంత్ (కెప్టెన్, వికెట్ కీపర్), ట్రిస్టన్ స్టబ్స్, అక్షర్ పటేల్, కులదీప్ యాదవ్, రసిఖ్ దార్, ముఖేష్ కుమార్, ఖలీల్ అహ్మద్.
ఒకవేళ బ్యాటింగ్ చేస్తే:
పృథ్వీ షా, ఫ్రేజర్, అభిషేక్ పోరెల్, హాప్, రిషబ్ పంత్ (కెప్టెన్, వికెట్ కీపర్), కుమార్ కుషా గ్రా, స్టబ్స్, అక్షర్ పటేల్, కులదీప్ యాదవ్, రసిఖ్ దార్, ముఖేష్ కుమార్.
రాజస్థాన్ ముందుగా బ్యాటింగ్ చేస్తే..
జోస్ బట్లర్, యశస్వి జైస్వాల్, సంజు శాంసన్(కెప్టెన్, వికెట్ కీపర్), రియాన్ పరాగ్, ధృవ్ జూరెల్, పావెల్, హిట్మేయర్, రవిచంద్రన్ అశ్విన్, బౌల్ట్, ఆవేష్ ఖాన్, సందీప్ శర్మ.
రాజస్థాన్ ఒకవేళ బౌలింగ్ చేస్తే
యశస్వి జైస్వాల్, సంజు శాంసన్(కెప్టెన్, వికెట్ కీపర్), రియాన్ పరాగ్, ధృవ్ జురెల్, పావెల్, హిట్మేయర్, రవిచంద్రన్ అశ్విన్, బౌల్ట్, ఆవేష్ ఖాన్, యజువేంద్ర చాహల్, సందీప్ శర్మ.