Koratala Siva: యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం దేవర. శ్రీదేవి తనయ జాన్వీ కపూర్ హీరోయిన్ గా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అవుతుంది. ఇప్పటికే విడుదలైన దేవర గ్లిమ్స్ , పోస్టర్స్ ఎంతగానో ఆకట్టుకున్నాయి. మూవీపై అంచనాలు పెంచేస్తున్నాయి. తాజాగా దర్శకుడు కొరటాల శివ చేసిన కామెంట్స్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి కిక్ ఇచ్చే విధంగా ఉన్నాయి. జనతా గ్యారేజ్ అనంతరం ఎన్టీఆర్-కొరటాల దేవర కోసం చేతులు కలిపారు.
దేవర మాస్ యాక్షన్ డ్రామా గా తెరకెక్కుతుంది. నిజానికి దేవర ఏప్రిల్ నెలలో సమ్మర్ కానుకగా విడుదల చేయాలి అని మేకర్స్ ప్లాన్ చేశారు. షూటింగ్ పూర్తి కాకపోవడంతో అది వాయిదా పడింది. దసరా పండగ వేళ అక్టోబర్ 10 న గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నారు. జూనియర్ ఎన్టీఆర్ వార్ 2, దేవర షూటింగ్స్ ఏకకాలంలో కంప్లీట్ చేస్తున్నారు. దేవర లేటెస్ట్ షెడ్యూల్ ఏపీలోని అల్లూరి సీతారామరాజు జిల్లాలో జరుగుతున్నట్లు సమాచారం.
ఎన్టీఆర్ లేని సన్నివేశాలు చిత్రీకరిస్తున్నట్లు తెలుస్తుంది. దేవర సముద్ర తీరంలో జరిగే కథ అని గతంలో దర్శకుడు కొరటాల శివ చెప్పారు. సైఫ్ అలీ ఖాన్ ప్రధాన విలన్ పాత్ర చేస్తున్న విషయం తెలిసిందే. కాగా సైఫ్ అలీఖాన్ ఇతర ఆర్టిస్టుల కాంబినేషన్ లో ఉన్న సీన్స్ ఇప్పుడు వైజాగ్ లో చేస్తున్నారని వినికిడి.
కాగా కొరటాల శివ తాజా ఇంటర్వ్యూలో దేవర గురించి ఆసక్తికర కామెంట్స్ చేశాడు. కొరటాల శివ మాట్లాడుతూ .. ఇటీవల తారక్ కూడా దీని గురించి మాట్లాడాడు. అభిమానులంతా కాలర్ ఎగరేసుకునే సినిమా అవుతుంది అన్నారు. నేను ఇంతకు ముందు చాలా మాట్లాడా. ఇది కచ్చితంగా నాకు, అభిమానులకు చాలా స్పెషల్ మూవీగా ఉంటుంది. అంతవరకు చెప్పగలను. ఇంకా చాలా టైం ఉంది. వరసగా అప్డేట్లు వస్తాయి అని అన్నారు. దేవర చిత్రానికి అనిరుధ్ సంగీతం అందిస్తున్నారు.