spot_img
Homeఆంధ్రప్రదేశ్‌AP Elections 2024: కూటమికి పాజిటివ్ వేవ్ కృత్రిమమా? వాస్తవమా?

AP Elections 2024: కూటమికి పాజిటివ్ వేవ్ కృత్రిమమా? వాస్తవమా?

AP Elections 2024: గత ఎన్నికలకు ముందు అప్పటి టిడిపి ప్రభుత్వం పై వ్యతిరేకత స్పష్టంగా కనిపించింది. తారాస్థాయికి చేరుకోవడంతో వైసీపీకి ఘన విజయం లభించింది. ఎన్నికలకు ముందే వైసీపీకి పాజిటివ్ వైబ్రేషన్స్ వచ్చాయి. అయితే ఇప్పుడు నాటి టిడిపి ప్రభుత్వం మాదిరిగానే.. వైసీపీ సర్కార్ తీవ్ర ప్రజా వ్యతిరేకతను ఎదుర్కొంటోంది. ప్రభుత్వ పథకాలు అందుకుంటున్న గ్రామీణుల్లో కొంతవరకు పాజిటివ్ కనిపిస్తోంది. కానీ మిగతా వర్గాల్లో మాత్రం ప్రభుత్వం పై తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. అటు ఎన్నికల ప్రచారంలో సైతం కూటమి ముందు వరుసలో ఉంది. మెజారిటీ సర్వేలు సైతం ఎన్డీఏకు అనుకూల ఫలితాలు ఇస్తున్నాయి.

అయితే కూటమికి పాజిటివ్ వైబ్రేషన్స్ రావడానికి ఎన్నికల వ్యూహకర్తల ప్రయత్నిస్తున్నారన్నది వైసీపీ నుంచి వస్తున్న ఆరోపణ. అటు ఎల్లో మీడియా సైతం అదే భావన కల్పిస్తోందన్నది వారి వాదన. అయితే అంతకంటే ముందే ఉద్యోగులు, ఉపాధ్యాయులు పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓట్లు వేయడం, తామంతా కూటమికే వేసామని వారు బాహాటంగా చెబుతుండడం.. కూటమి పట్ల పాజిటివ్టి పెరగడానికి ఒక కారణం. గత ఎన్నికల్లో జగన్ సిపిఎస్ రద్దు చేస్తానని హామీ ఇవ్వడంతో ఉద్యోగ ఉపాధ్యాయులు పోస్టల్ బ్యాలెట్ ఓట్లను ఏకపక్షంగా వేశారు. ఇప్పుడు కూడా జగన్ ప్రభుత్వం పై వ్యతిరేకతతో ఉద్యోగ ఉపాధ్యాయులు పోలరైజ్ అయ్యారని.. కూటమి వైపు మొగ్గు చూపడంతో.. ఒక వేవ్ వచ్చిందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. దాని ప్రభావం తప్పకుండా పోలింగ్ పై పడుతుందని చెబుతున్నారు. గతంలో ఉద్యోగులు ఓటు వేయడాన్ని చాలా లైట్ తీసుకునేవారు. కానీ ఇప్పుడు పట్టు పట్టి క్యూ లైన్ లో నిలబడి మరి ఓటు వేయడాన్ని ఉదహరిస్తున్నారు. ఇది కచ్చితంగా జగన్ సర్కార్ పై కసితో చేసిన పని అని గుర్తు చేస్తున్నారు.

బిజెపి అగ్ర నాయకత్వం నుంచి కూటమికి సంపూర్ణ సహకారం లభిస్తోంది. సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా దేశవ్యాప్తంగా ఏడు విడతల్లో పోలింగ్ జరగనుంది. ఉత్తరాది రాష్ట్రాల్లో తొలి మూడు విడత ఎన్నికలు జరిగాయి. దీంతో అక్కడ బిజెపి నాయకత్వం దృష్టిసారించింది. కూటమిలో భాగంగా ఏపీలో పోటీ చేస్తున్నా.. పెద్దగా స్పందించటం లేదని వైసిపి ప్రచారం చేసింది. మరోవైపు కీలక అధికారుల బదిలీ విషయంలో సైతం టిడిపికి సహకారం అందడం లేదని టాక్ నడిచింది. అయితే ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్ షా, బిజెపి అగ్ర నేతలు ఏపీకి క్యూ కడుతున్నారు. వైసీపీ సర్కార్ పై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. మరోవైపు వివాదాస్పద అధికారులపై బదిలీ వేటు పడుతోంది. దీంతో ఈ పరిణామాలన్నీ కూటమికి పాజిటివ్ రావడానికి కారణాలుగా మారుతున్నాయి. మరోవైపు సర్వేలు సైతం అనుకూలంగా వస్తుండడంతో అధికార వైసిపి కలవరపాటుకు గురవుతోంది. కూటమికి పాజిటివ్ వేవ్ రాజకీయ వ్యూహకర్తల పనేనని.. అందులో ఎంత మాత్రం నిజం లేదని వైసీపీ సోషల్ మీడియా ప్రచారం చేస్తోంది. మొత్తానికి అయితే గత ఎన్నికలకు ముందు వైసీపీ మాదిరిగానే.. ఇప్పుడు టిడిపి కూటమికి పరిస్థితులు కలిసి వస్తున్నాయి. అయితే అవి ఎన్నికల ఫలితాలను ఎంతవరకు ప్రభావితం చేస్తాయో చూడాలి.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

Related News

Most Popular

Wrong Mobile Recharge : తప్పుడు నెంబర్కు రీఛార్జ్ చేశారా.. ఇలా చేస్తే మనీ రిఫండ్..

Wrong Mobile Recharge : మొబైల్ ఉన్న ప్రతి ఒక్కరూ ఇప్పుడు ఎవరికి వారే రీఛార్జ్ చేసుకుంటూ ఉంటున్నారు. అయితే ఈ క్రమంలో ఒక్కోసారి తప్పుడు నెంబర్ పై రీఛార్జ్ అయ్యే అవకాశం...

IBPS PO 2026 : బ్యాంకు ఉద్యోగార్థులకు గుడ్‌ న్యూస్‌.. 7,460 ఉద్యోగాలకు మరో ఛాన్స్‌!

IBPS PO 2026 : ఐబీపీఎస్‌(ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ బ్యాంకింగ్‌ పర్సనల్‌ సెలక్షన్‌) పబ్లిక్‌ సెక్టార్‌ బ్యాంకుల్లో ప్రొబేషనరీ ఆఫీసర్‌(పీవో), స్పెషలిస్ట్‌ ఆఫీసర్‌(ఎస్‌వో) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. దరఖాస్తు ý డువు...
The Odyssey 3 Day Collections

The Odyssey Box Office : ‘ది ఒడిస్సీ’ 6 రోజుల వరల్డ్ వైడ్ వసూళ్లు.. తెలుగు రాష్ట్రాల...

The Odyssey Box Office : క్రిస్టోఫర్ నోలన్ దర్శకత్వం లో తెరకెక్కిన లేటెస్ట్ చిత్రం 'ది ఒడిస్సీ' బాక్స్ ఆఫీస్ వసూళ్ల సునామీ జోరు ఏమాత్రం తగ్గలేదు. సినిమా విడుదలై 6...
Lenin 10 Days Collection

Lenin Movie : ‘లెనిన్’ 13 రోజుల వరల్డ్ వైడ్ వసూళ్లు.. కొత్త సినిమాలు వచ్చినా జోరు తగ్గలేదు..

Lenin Movie : అఖిల్ 'లెనిన్' చిత్రం బాక్స్ ఆఫీస్ జోరు ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. ఈ సినిమా విడుదలై 13 రోజులైనప్పటికీ కూడా, కొన్ని సెంటర్స్ లో నేటికీ కూడా భారీ...
Vijay Deverakonda

Vijay Deverakonda : ఆగిపోయిన విజయ్ దేవరకొండ కొత్త సినిమా.. కోట్ల రూపాయిల నష్టం..

Vijay Deverakonda : యూత్ ఆడియన్స్ లో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ని సంపాదించుకున్న హీరోల్లో ఒకరు విజయ్ దేవరకొండ. చేసిన సినిమాలు తక్కువే, అందులో డిజాస్టర్స్ ఎక్కువ , అయినప్పటికీ ఈ...
Oktelugu Epaper