Sowmya Rao: జబర్దస్త్ షో ద్వారా ఎంతోమంది ఫేమ్ దక్కించుకున్నారు. తమకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంటున్నారు. కొందరు సామాన్యులుగా వచ్చి స్టార్స్ గా ఎదిగారు. గతంలో రాత్రి 9.30 అయింది అంటే హాస్యప్రియులు టీవీలకు అతుక్కుపోయేవారు. కానీ ఇప్పుడు జబర్దస్త్ షో కి అంత క్రేజ్ లేదు. టిక్ టాక్, యూట్యూబ్ లో ఫేమస్ అయిన వాళ్ళు స్టేజ్ పై స్కిట్స్ చేస్తున్నారు. స్టార్ కమెడియన్స్, జడ్జెస్ రోజా, నాగబాబు తప్పుకోవడంతో షో లో కామెడీ తగ్గిపోయింది.
ఇక యాంకర్ అనసూయ కూడా మూవీ ఆఫర్స్ తో బిజీ అయిపోయి జబర్దస్త్ ను వీడింది. దీంతో అనసూయ ప్లేస్ లో కన్నడ బ్యూటీ సౌమ్య రావు ని పెట్టారు. సౌమ్య బానే క్లిక్ అయింది. తక్కువ సమయంలో ఆడియన్స్ కి దగ్గరైంది. కానీ అనూహ్యంగా సౌమ్య రావు జబర్దస్త్ నుంచి తప్పుకుంది. ఆమె మానేసిందా ..లేకపోతే తీసేశారా అనే కారణాలు మాత్రం తెలియలేదు. అయితే తాజాగా సౌమ్య రావు జబర్దస్త్ ఎందుకు వీడాల్సి వచ్చిందో వెల్లడించింది.
తన యాంకరింగ్ అందరికీ నచ్చేది కాదని, తెలుగు రాకపోవడంతో తన యాంకరింగ్ పై విమర్శలు వచ్చాయని తెలిపింది. పైగా స్కిట్స్ లో కొన్ని డైలాగులు అర్థం అయ్యేవి కాదని .. యాంకరింగ్ లో పెద్దగా అనుభవం లేదని సౌమ్య అన్నది. నా తెలుగు దరిద్రంగా ఉందని కొందరు అన్నారు. నాకు డాన్స్ రాదు. అందుకు క్లాసులకు కూడా వెళ్ళాను. డాన్స్ ప్రాక్టీస్ చేస్తుంటే ఇంకా సన్నగా అయిపోతున్నాను.
దీంతో డైరెక్టర్ మీరు డాన్స్ ప్రాక్టీస్ చేయకండి. సన్నగా అయితే బాగుండరు .. తిని కాస్త ఒళ్ళు చేయండి. డాన్స్ ఏదోలాగా మేనేజ్ చేయండి. దానికోసం ఎక్కువ కష్టపడవద్దు అన్నారు. నేను పాత యాంకర్స్ లాగే ఎంటర్టైన్ చేయాలని చాలా ప్రయత్నం చేశాను .. కానీ నాకు ఎక్సపీరియెన్స్ లేదు కదా అంటూ సౌమ్య రావు చెప్పుకొచ్చింది.