Nur Bai: ప్రతి ఔషధానికి గడువు తేదీ ఉన్నట్టే.. ప్రతీ రాజరిక వ్యవస్థ ఎక్కడో ఒకచోట ముగిసిపోయింది.. మన దేశాన్ని 200 సంవత్సరాల పాటు పరిపాలించిన ఆంగ్లేయులు.. స్వాతంత్ర్య పోరాటం వల్ల తోక ముడిచారు. రాజరిక వ్యవస్థ రాజ్యమేలిన రోజుల్లోనూ ఏదో ఒక రూపంలో ముసలం పుట్టడం.. అది పెరిగి పెద్దది కావడం.. ఆ తర్వాత ఆ రాజ్యం అంతమవడం జరిగిపోయాయి. ఈ సువిశాల భారత నేలలో అలా అంతర్ధానమైన రాజరిక వ్యవస్థలలో మొఘలులు ఒకరు. హిందూ వ్యవస్థను, హిందూ ప్రజలను హింసించిన రాజులుగా పేరుపొందిన మొఘలులు.. తవైఫ్ ల వల్ల నాశనమయ్యారు. ఇంతకీ అది ఎలా జరిగిందంటే..
మిడతల దండు వాలిన పొలం.. మొఘలుల కన్నుపడ్డ రాజ్యం ఒక్కటే అని అప్పట్లో ఒక సామెత వినిపించేది. దాన్ని నిజం చేసే విధంగానే వారి పరిపాలన ఉండేది. కానీ చివరికి మొఘలులు తవైఫ్ ల వల్ల భూస్థాపితమయ్యారు. మొఘలులు విలాసాల కోసం ఎక్కువగా ఖర్చు చేసేవారు. అలా వారి పరిపాలన కాలంలో తవైఫ్ ల పేరుతో వేశ్య లను తమ శారీరక సుఖం కోసం ఉంచుకునేవారు. తవైఫ్ లు సంగీతం, నృత్యం వంటివి చేసి మొఘలులను సంతృప్తి పరచేవారు. తవైఫ్ లలో నూర్ బాయ్ అనే మహిళ అత్యంత అందగత్తెగా పేరుపొందింది. ఆమెతో శారీరక సుఖం పొందేందుకు మొఘలులు పరితపించే వారట. ఆమెకు విలువైన వస్తువులు, బహుమతులు ఇచ్చేందుకు పోటీపడే వారట. ఆ రోజుల్లో చక్రవర్తి మహమ్మద్ షా రంగీలా తో నూర్ బాయ్ కి అత్యంత సన్నిహితమైన సంబంధం ఉండేదట. రంగీలా అంతర్గత గదిలోకి నూర్ బాయి కి ప్రవేశం ఉండేదట. ఒకసారి రంగీలా అంతర్గత మందిరంలో ఆయన తలపాగాను నూర్ బాయి చూసింది. అందులో కోహినూర్ వజ్రాన్ని కనిపెట్టింది. ఈ వజ్రం గురించి నూర్ బాయి.. ఢిల్లీని ఆక్రమించిన నాదర్ షా కు సమాచారం అందించింది.
ఆ కోహినూర్ వజ్రాన్ని పొందేందుకు నాదర్ షా వ్యూహాత్మకంగా అడుగులు వేశాడు. శాంతి కోసం చర్చల పేరుతో రంగీలా వద్దకు వచ్చాడు. తెరపైకి తలపాగా మార్పిడి విధానాన్ని తీసుకొచ్చాడు. నూర్ బాయి సమాచారం ఇవ్వడం వల్లే నాదర్ షా ఈ ఎత్తుగడ వేసి మొఘలుల నుంచి కోహినూర్ వజ్రాన్ని దక్కించుకున్నాడు. నాదర్ షా తనతోపాటు కోహినూర్ వజ్రాన్ని తీసుకెళ్లాడు. ఆ తర్వాత అనేక పరిణామాలు జరిగి.. ఆ కోహినూర్ వజ్రం ఇంగ్లాండ్ మహారాణి కిరీటంలో చేరింది. క్వీన్ ఎలిజబెత్ మరణించేంతవరకు ఆమె ధరించిన కిరీటంలో కోహినూర్ వజ్రం ధగధగలాడుతూ మెరిసిపోయేది. ఇలా నూర్ బాయి చేసిన అంతర్గత సహాయం వల్ల నాదర్ షా మొఘలుల పై దండయాత్రకు దిగాడు. ఆ తర్వాత ఆంగ్లేయుల వల్ల తన రాజ్యాన్ని కూడా కోల్పోయాడు. ఎంతో కష్టపడి సంపాదించిన కోహినూర్ వజ్రాన్ని కూడా కోల్పోయాడు.