Double ISmart: తెలుగు సినిమా ఇండస్ట్రీలో పూరి జగన్నాథ్ లాంటి డైరెక్టర్ మరొకరు లేరని చెప్పడం లో ఎంతమాత్రం అతిశయోక్తి లేదు. ఎందుకంటే ఆయన చేసిన సినిమాలు ఇండస్ట్రీలో సూపర్ సక్సెస్ లను సాధించడమే కాకుండా తమకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను కూడా ఏర్పాటు చేసుకునే విధంగా చేశాయి. ఇక అలాంటి ఒక దర్శకుడు ప్రస్తుతం పాన్ ఇండియాలో సినిమా చేస్తూ ఇండస్ట్రీలో తనకంటూ ఒక మంచి గుర్తింపు సంపాదించుకోవడానికి అహర్నిశలు కష్టపడుతున్నాడు.
ఇక ప్రస్తుతం ఆయన చేస్తున్న డబుల్ ఇస్మార్ట్ సినిమా భారీ సక్సెస్ ని సాధిస్తుందని చెప్పడం ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. అయితే ఈ సినిమా మీద రామ్ మొదటి నుంచి కూడా మంచి కన్ఫిడెంట్ గా ఉన్నాడు. ఇక ఈ సినిమాకి డబుల్ ఇస్మార్ట్ అనే టైటిల్ లు పెట్టడానికి గల ముఖ్య కారణం ఏంటి అంటే ఇస్మార్ట్ శంకర్ సినిమాలో రామ్ బ్రెయిన్ లో ఒక చిప్ మాత్రమే పెడతారు.
ఇక ఈ సినిమాలో రెండు చిప్ లు పెట్టబోతున్నారట.అందుకే ఈ సినిమాకి “డబుల్ ఇస్మార్ట్” అనే టైటిల్ ని పెట్టినట్టుగా తెలుస్తుంది. ఇక ఇప్పటికే ఈ సినిమా నుంచి కొన్ని అప్డేట్స్ కూడా రాబోతున్నట్టుగా సమాచారం అయితే అందుతుంది. ఇక పూరి మొత్తానికైతే ఈ సినిమాను భారీ సక్సెస్ చేసి తన ఖాతాలో ఒక సూపర్ హిట్ వేసుకోవాలనే ప్రయత్నం అయితే చూస్తున్నాడు. ఇక పూరి జగన్నాథ్ కూడా ఈ సినిమాతో మరోసారి సక్సెస్ కొట్టి తను లైమ్ లైట్ లోకి రావాలని భారీగా ప్రయత్నం చేస్తున్నాడు.
ఇక దానికోసమే ఆయన కష్టపడుతున్నాడు ఈ సినిమాతో సక్సెస్ కొట్టి నెక్స్ట్ స్టార్ హీరోతో సినిమా చేయడమే తన గోల్ గా పెట్టుకున్నట్టుగా తెలుస్తోంది. ఇక అందులో భాగం గానే ఆయన ఇప్పటికే స్టార్ హీరోలందరితో సినిమాలు చేశారు. ఇక ప్రస్తుతం మరోసారి స్టార్ హీరోలతో సినిమాలు చేసి తన మార్కెట్ పెంచుకోవాలనే ప్రయత్నం అయితే చేస్తున్నాడు…