Pawan Kalyan : ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ చూసిన కూడా ఎలక్షన్స్ గురించే మాట్లాడుకుంటున్నారు. ఇక ఆంధ్ర లో అయితే ఈసారి సీఎం ఎవ్వరూ అవ్వబోతున్నారు అనే దాని కంటే కూడా పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గెలవాలనే ఎక్కువ మంది కోరుకుంటున్నారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ 2019 ఎలక్షన్స్ లో రెండు చోట్ల పోటీ చేస్తే రెండు చోట్ల ఓడిపోయి తీవ్రమైన అవమానాన్ని మూట గట్టుకున్నాడు. కాబట్టి ఈసారైన పిఠాపురం నియోజకవర్గం నుంచి గెలిచి అసెంబ్లీలోకి అడుగు పెట్టాలని ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు.
ఇక అందులో భాగంగానే చాలామంది సినీ సెలబ్రిటీలు కూడా ఆయనకు మద్దతును తెలిపారు. ఇక ఇప్పుడు కృష్ణంరాజు వైఫ్ ప్రభాస్ పెద్దమ్మ అయిన శ్యామలాదేవి కూడా పవన్ కళ్యాణ్ గెలుపు ఖాయం అంటూ ఒక వీడియోని పోస్ట్ చేసింది. అయితే అందులో ఏముందంటే “పిఠాపురం నియోజకవర్గం లో పవన్ కళ్యాణ్ గెలుపు ఎప్పుడో ఖాయమైంది. ఇక ఇప్పటి వరకు ఎవ్వరికీ రానంత మెజారిటీ కూడా రాబోతుంది. ఇక వార్ వన్ సైడ్ అయిపోయింది” అంటూ ఆమె పవన్ కళ్యాణ్ గురించి చాలా గొప్పగా మాట్లాడటం అనేది నిజంగా గొప్ప విషయం అనే చెప్పాలి.
ఇక గతంలో కృష్ణంరాజు కూడా ప్రజారాజ్యం పార్టీ నుంచి ఎంపీ గా పోటీ చేశాడు. కాబట్టి మెగా ఫ్యామిలీకి, కృష్ణంరాజు గారికి మొదటి నుంచి కూడా చాలా మంచి ఫ్రెండ్షిప్ అయితే ఉంది. ఇక దానివల్లే కృష్ణంరాజు ఉంటే కూడా జనసేన పార్టీకి సపోర్ట్ చేసేవాడు. ఇప్పుడు ఆయన లేడు కాబట్టి ఆ బాధ్యతను శ్యామల దేవి తీసుకున్నట్టుగా తెలుస్తుంది. ఇక ఇదంతా చూస్తుంటే శ్యామల దేవి వెనకాల ప్రభాస్ ఉన్నట్టుగా మనకు అర్థమవుతుంది.
తను డైరెక్ట్ గా సపోర్ట్ చేయలేక వాళ్ళ పెద్దమ్మ అయిన శ్యామల దేవి చేత పవన్ కళ్యాణ్ కి సపోర్ట్ చేయిస్తున్నాడు అంటూ కొన్ని వార్తలైతే వస్తున్నాయి. ఇక ఏది ఏమైనప్పటికీ పవన్ కళ్యాణ్ భారీ మెజార్టీతో గెలవడం ఖాయమనే చెప్పాలి…
#Prabhas peddamma garu supporting @JanaSenaParty
For better future #VoteForGlass #Kalki2898AD #JanasenaOnTheRisepic.twitter.com/A3lsfUFjla
— NANI CAMERON (@Nani____4) May 11, 2024