Guppedantha Manasu Actress: గుప్పెడంత మనసు సీరియల్ జగతి అలియాస్ జ్యోతి రాయ్ ప్రేక్షకులకు సుపరిచితమే. ఈ సీరియల్ లో రిషి తల్లిగా ఎమోషనల్ సీన్స్ లో అద్భుతంగా నటించింది. జగతి మేడంగా పాపులారిటీ దక్కించుకుంది. గుప్పెడంత మనసులో రిషి, వసుధారా పాత్రలకు ఎంత క్రేజ్ ఉందో జగతి క్యారెక్టర్ కి కూడా అదే రేంజ్ క్రేజ్ ఉంది. జ్యోతి రాయ్ కన్నడ నటి. ఆమె కన్నడలో దాదాపు 20 సీరియల్స్ లో నటించింది. పలు సినిమాల్లో కూడా నటించింది.
కన్నడ లో ఈ బ్యూటీకి భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. తెలుగులో ఒక్క సీరియల్ తోనే భారీ ఫేమ్ దక్కించుకుంది. జగతి పాత్రలో నిండైన కట్టు, బొట్టులో చాలా సాంప్రదాయంగా మనసులు దోచేసింది. ఆన్ స్క్రీన్ లో అంత పద్దతిగా ఉండే జగతి ఆంటీ .. సోషల్ మీడియాలో మాత్రం ఓ రేంజ్ లో గ్లామర్ షో చేస్తుంది. పొట్టి బట్టల్లో హాట్ ఫోటో షూట్ చేస్తూ ఇంస్టాగ్రామ్ లో పెడుతుంది. ప్రస్తుతం జ్యోతి రాయ్ సీరియల్స్ కి గుడ్ బై చెప్పేసింది.
సినిమాలు, వెబ్ సిరీస్ చేస్తూ ఫుల్ బిజీగా మారిపోయింది. తాజాగా జ్యోతి రాయ్ తన గొప్ప మనసు చాటుకుంది. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న పద్మశ్రీ అవార్డు గ్రహిత కిన్నెర మొగిలయ్య కు సహాయం చేసింది. అక్షయ తృతీయ నాడు బంగారం కొనుగోలు చేయకుండా తన వంతుగా ఆయనకు రూ. 50 వేల రూపాయలు ఇచ్చింది. దీనికి సంబంధించిన వీడియో షేర్ చేసింది. ” నేను ఇబ్బందుల్లో ఉన్నాను. కానీ నా కష్టాల కంటే మొగిలయ్య ఇబ్బందులు నన్ను కలచివేశాయి.
అందుకే ఆయనకు సహాయం చేశాను. మొగిలయ్య ప్రతిభకు నేను చేసిన సాయం పెద్దది కాదు. నేను చేయగలిగినంత చేసాను. కాబట్టి ఆయనను ఆదుకోవడానికి ఎంతో మంది ముందుకు రావాలని కోరుకుంటున్నాను’ అని జ్యోతి రాయ్ చెప్పుకొచ్చింది. అంతే కాదు ఆయన కాళ్ళకు నమస్కరించి ఆశీర్వాదం కూడా తీసుకుంది. దీంతో నెటిజన్లు జ్యోతి రాయ్ పై ప్రశంసలు కురిపిస్తున్నారు. కొన్నెర మొగిలయ్యకు తెలంగాణ గవర్నమెంట్ గౌరవ వేతనం ఆపివేయడంతో కూలి పనులకు వెళుతున్నాడు. ఆయన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.