Homeఎంటర్టైన్మెంట్Allu Arjun: భార్యపై ప్రేమను చాటుకున్న అల్లు అర్జున్... స్నేహారెడ్డికి కోట్ల విలువైన గిఫ్ట్, అది...

Allu Arjun: భార్యపై ప్రేమను చాటుకున్న అల్లు అర్జున్… స్నేహారెడ్డికి కోట్ల విలువైన గిఫ్ట్, అది ఏంటంటే?

Allu Arjun: అల్లు అర్జున్ తన భార్య స్నేహ రెడ్డికి ఒక సర్ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చారట. కోట్లు విలువ చేసే ఓ అద్భుతమైన బహుమతితో ఆమె పట్ల ప్రేమ చాటుకున్నారట. ఈ మేరకు ఓ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అల్లు అర్జున్ కి భార్య స్నేహ రెడ్డి అంటే ఎనలేని ప్రేమ. వివిధ సందర్భాల్లో భార్య పై ఆయనకున్న ప్రేమ అనేక రూపాలలో వెల్లడించాడు. అల్లు అర్జున్ స్నేహ రెడ్డిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఒక కామన్ ఫ్రెండ్ పెళ్లిలో స్నేహ రెడ్డి పరిచయం కాగా, అది ప్రేమకు దారి తీసింది.

స్నేహ రెడ్డి తన హార్ట్ అని, ఆమె లేకపోతే నా జీవితమే లేదని గతంలో అల్లు అర్జున్ కామెంట్స్ చేశాడు. ‘ ఆర్య ‘ 20 ఏళ్ల వేడుకలో కూడా స్నేహ రెడ్డి ప్రస్తావన తెచ్చాడు. నా వన్ సైడ్ లవ్ ఎప్పటికీ స్నేహతోనే. నేను ప్రేమించడమే కానీ… అటువైపు నుంచి పెద్దగా రెస్పాన్స్ ఉండదంటూ చెప్పిన సంగతి తెలిసిందే. ఫన్నీగా చెప్పినా కూడా ఇండైరెక్ట్ గా భార్య పై ఆయనకు ఎంత ప్రేమ ఉందో తెలియజేశారు.

తాజాగా స్నేహను కోట్లు విలువ చేసే గిఫ్ట్ తో సర్ప్రైజ్ చేశాడట. ఆమెకు లేటెస్ట్ మోడల్ బీఎండబ్ల్యూ కారుని బహుమతిగా ఇచ్చారట. ఇటీవల బన్నీ కారు బుక్ చేయగా అది ఇంటికి వచ్చిందట. కారు బుక్ చేసిన ఫోటోలు, కారు ఇంటికి వచ్చిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే కారు విలువ రెండున్నర కోట్లు అని తెలుస్తుంది. సదరు కారు ధర చూసి నోరెళ్లబెడుతున్నారు.

ఈ వార్తలో నిజమెంతుందో తెలియదు కానీ నెట్టింట బాగా వైరల్ అవుతుంది. అల్లు అర్జున్ సినిమాల విషయానికొస్తే .. పుష్ప 2 మూవీ చిత్రీకరణ దశలో ఉంది. పుష్ప 2 గ్లిమ్స్, టీజర్, టైటిల్ సాంగ్ మరింత హైప్ పెంచేస్తున్నాయి. 2024 ఆగస్టు 15న గ్రాండ్ గా విడుదల చేయబోతున్నారు. ఇక పుష్ప 2 అనంతరం అట్లీ డైరెక్షన్ లో ఓ సినిమా చేయబోతున్నాడు అల్లు అర్జున్. అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

RELATED ARTICLES

Most Popular