Devara: నందమూరి చిన్నోడు గా ఇండస్ట్రీ ఎంట్రీ ఇచ్చిన ఎన్టీఆర్ చాలా తక్కువ సమయంలోనే తనకంటూ మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. ప్రస్తుతం ఆయన దేవర సినిమాతో పాన్ ఇండియాలో తన సత్తా చాటుకునే ప్రయత్నం చేస్తున్నాడు. అయితే ఇప్పటికే త్రిబుల్ ఆర్ సినిమాతో సూపర్ సక్సెస్ ను అందుకున్న ఆయన ఇప్పుడు దేవరతో మరోసారి బాలీవుడ్ ఇండస్ట్రీ పైన దండయాత్ర చేయబోతున్నాడు.
ఇక ఈ సినిమాతో కనక తను సూపర్ సక్సెస్ సాధిస్తే దాదాపు 1000 కోట్ల వరకు ఆయన మార్కెట్ పెరిగే అవకాశాలైతే ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు ఉన్న స్టార్ హీరోలందరూ వాళ్ల మార్కెట్ ని సినిమా సినిమాకి పెంచుకుంటూ పోతున్నారు. ఇక కెరియర్ లో ఇప్పటివరకు ఒక్క ఇండస్ట్రీ హిట్టు కూడా లేని ‘ఎన్టీఆర్ ‘ ఈ సినిమాతో భారీ సక్సెస్ ను తన ఖాతాలో వేసుకోవాలని చూస్తున్నాడు. ఇక ఈ సినిమాకు సంభందించిన ప్రమోషన్స్ ని కూడా మొదలు పెట్టారు. ఇంతకుముందు ఈ సినిమా నుంచి వచ్చిన గ్లింప్స్ ప్రేక్షకులను విపరీతంగా అలరించిందనే చెప్పాలి. ఇక ఇప్పుడు ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ గా ఓ సాంగ్ రాబోతుంది…
ఇక మే 20వ తేదీన ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ గా ఒక సాంగ్ ని వదిలే అవకాశాలైతే ఉన్నాయి. ఇక దానికోసమే ఇప్పటికి దర్శకుడు కొరటాల శివ సర్వం సిద్ధం చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇక అనిరుధ్ మ్యూజిక్ డైరెక్టర్ గా వ్యవహరిస్తున్న ఈ సినిమా సాంగ్స్ ప్రేక్షకుడికి ఎలాంటి జోష్ ను ఇస్తాయి అనేది కూడా తెలియాల్సి ఉంది.
ఒకవేళ సాంగ్స్ కనక సూపర్ హిట్ అయినట్టైతే సినిమా మీద మరింత క్రేజ్ పెరిగే అవకాశాలైతే ఉన్నాయి. కాబట్టి ఈ సినిమా సాంగ్స్ మీదనే ఈ మూవీ సక్సెస్ అనేది ఆధారపడి ఉంది అని మరి కొంతమంది విమర్శకులు సైతం ఈ సినిమా మీద కొన్ని కామెంట్లైతే చేస్తున్నారు…