పవన్ సినిమాకు అదిరిపోయే టైటిల్!

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ వరుస సినిమాలతో బీజీగా ఉన్నారు. కొన్నేళ్లగా సినిమాలకు దూరంగా ఉన్న పవన్ కల్యాణ్ ఇటీవల పింక్ రీమేక్ మూవీతో రీ ఎంట్రీ ఇచ్చారు. ప్రస్తుతం ఈ మూవీ హైదరాబాద్ పరిసరాల్లో శరవేగంగా షూటింగ్ పూర్తి చేసుకుంటుంది. తొలుత ఈ మూవీకి ‘లాయర్ సాబ్’ అనే టైటిల్ ప్రచారం జరిగింది. తాజాగా ఈ మూవీ టైటిల్ ‘వకీల్ సాబ్’ అని ఫిల్మ్ చాంబర్లో రిజిష్టర్ అయినట్లు తెలుస్తోంది. ఈ మూవీని దిల్ రాజు […]

  • Written By: Neelambaram
  • Published On:
పవన్ సినిమాకు అదిరిపోయే టైటిల్!

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ వరుస సినిమాలతో బీజీగా ఉన్నారు. కొన్నేళ్లగా సినిమాలకు దూరంగా ఉన్న పవన్ కల్యాణ్ ఇటీవల పింక్ రీమేక్ మూవీతో రీ ఎంట్రీ ఇచ్చారు. ప్రస్తుతం ఈ మూవీ హైదరాబాద్ పరిసరాల్లో శరవేగంగా షూటింగ్ పూర్తి చేసుకుంటుంది. తొలుత ఈ మూవీకి ‘లాయర్ సాబ్’ అనే టైటిల్ ప్రచారం జరిగింది. తాజాగా ఈ మూవీ టైటిల్ ‘వకీల్ సాబ్’ అని ఫిల్మ్ చాంబర్లో రిజిష్టర్ అయినట్లు తెలుస్తోంది. ఈ మూవీని దిల్ రాజు ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నాడు. ఈ మూవీపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి.

పవన్ కల్యాణ్ దర్శకుడు క్రిష్ తో ఓ మూవీకి కమిట్ అయ్యాడు. ఈ మూవీలో పిరియాడికల్ డ్రామాగా ఉంటుందని తెలుస్తోంది. మొగల్ సామ్రాజ్యం కథాంశంతో ఉంటుందని, పవన్ ఇందులో బందిపోటుగా నటిస్తారని ప్రచారం జరిగింది. తాజాగా పవన్-క్రిష్ కాంబోలో వచ్చే మూవీ ఓ తెలంగాణ యోధుడి కథాంశంతో తెరకెక్కనుందని తెలుస్తోంది. ‘పండుగ సాయన్న’ అనే యోధుడి జీవిత గాథను క్రిష్ తెరకెక్కించేందుకు సన్నహాలు చేస్తున్నాడని ఫిల్మ్ నగర్లో టాక్. పండుగ సాయన్న అనే యోధుడు రాబిన్ హుడ్ తరహాలో ఉన్నోళ్ల సంపదను దోచుకొని పేదవాళ్లకు పంచిపెట్టాడని తెలుస్తోంది. కొన్ని కోటలపై యుద్ధాలు చేసినట్లు చేశారని తెలుస్తోంది. ఈ కథాంశంతో పవన్ కల్యాణ్ సినిమా చేయనున్నట్లు ప్రచారం జరుగుతుంది. ఈ మూవీకి ‘విరూపాక్షి’ అనే టైటిల్ ఖరారైనట్లు తెలుస్తోంది. అయితే దీనిని చిత్రబృందం ఎలాంటి అధికారిక ప్రకటన విడుదల చేయలేదు.

అలాగే హరీష్ శంకర్ దర్శకత్వంలో గబ్బర్ సింగ్ తరహాలో ఓ మూవీకి పవన్ కమిట్ అయ్యాడు. వీరద్దరి కాంబినేషన్లో వచ్చిన గబ్బర్ సింగ్ భారీ విజయం సాధించింది. ప్రస్తుతం వేణు శ్రీరామ్, హరీష్ శంకర్ దర్శకత్వంలో పని చేస్తున్న పవన్ కల్యాన్ తర్వాత మూవీ క్రిష్ దర్శకత్వంలో ఉండబోతుందని తెలుస్తోంది. ఏదిఏమైనా పవన్ కల్యాణ్ ఓ పిరియాడికల్ మూవీలో కొత్తగా కనిపించబోతున్నాడు. ‘పండుగ సాయన్న’ చరిత్రపై దర్శకుడు ఇప్పటికే రిసెర్చ్ చేస్తున్నాడు. కొన్నిరోజులు పోతేగానీ ఈ మూవీపై మరింత క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

సంబంధిత వార్తలు