Guess The Actress: అమ్మ ఒడిలో నుండి అమాయకంగా చూస్తున్న ఈ పాప సౌత్ ఇండియాను షేక్ చేసిన స్టార్ హీరోయిన్. తన క్యూట్ యాక్టింగ్ తో కుర్రకారు మనసులు దోచేసింది. తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ తో స్టార్స్ పక్కన జతకట్టింది. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఎక్కువగా సినిమాలు చేసింది. ఈ నాటీ గర్ల్ ఎవరో కాదు.. జెనీలియా డిసౌజా. ఆమె పసిప్రాయంలో ఉన్న ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
ముంబైకి చెందిన జెనీలియా 2003లో హీరోయిన్ గా కెరీర్ మొదలు పెట్టింది. ఆమె డెబ్యూ మూవీ తుజే మేరీ కసమ్. రితేష్ దేశ్ ముఖ్ హీరోగా నటించాడు. దర్శకుడు శంకర్ తెరకెక్కించిన యూత్ఫుల్ ఎంటర్టైనర్ బాయ్స్ తో సౌత్ లో అడుగుపెటింది. సిద్ధార్థ్ హీరోగా నటించిన ఈ మూవీ సూపర్ హిట్ కొట్టింది. ఇక తెలుగులో ఇలియానా మొదటి చిత్రం సత్యం. అక్కినేని హీరో సుమంత్ నటించిన సత్యం మంచి విజయం అందుకుంది.
దాంతో సౌత్ లో జెనీలియాకు ఆఫర్స్ క్యూ కట్టాయి. ముఖ్యంగా ఆమె తెలుగులో బిజీ హీరోయిన్ అయ్యింది. జెనీలియా-సిద్దార్థ్ జంటగా నటించిన రెండో చిత్రం బొమ్మరిల్లు బ్లాక్ బస్టర్ కొట్టింది. ఈ చిత్రం జెనీలియాకు భారీ ఇమేజ్ తెచ్చి పెట్టింది. అనంతరం శ్రీను వైట్ల దర్శకత్వంలో జెనీలియా నటించిన ఢీ, రెడీ చిత్రాలు చెప్పుకోదగ్గ విజయాలు సాధించాయి. రామ్ చరణ్ కి జంటగా నటించిన ఆరంజ్ మాత్రం నిరాశపరిచింది.
తెలుగులో జెనీలియా నటించిన చివరి చిత్రం నా ఇష్టం. దగ్గుబాటి రానా హీరోగా నటించిన ఈ మూవీ డిజాస్టర్ అయ్యింది. తర్వాత ఆమె టాలీవుడ్ వైపు రాలేదు. తన మొదటి చిత్ర హీరో రితేష్ దేశముఖ్ ని జెనీలియా ప్రేమించి వివాహం చేసుకుంది. వీరికి ఇద్దరు సంతానం. ఇప్పటికి కూడా జెనీలియా ఒకప్పటి బొమ్మరిల్లు హాసిని లాగానే ఉంది. ఆమెలో పెద్దగా మార్పు వచ్చింది లేదు. పెళ్లి తర్వాత కూడా ఆమె నటన కొనసాగిస్తోంది. ప్రస్తుతం ఓ హిందీ, ఓ కన్నడ చిత్రాల్లో ఆమె నటిస్తుంది.
View this post on Instagram