Homeక్రీడలుCSK: ప్లే ఆఫ్ ముందు చెన్నై జట్టుకు ఏంటి ఈ కష్టాలు..

CSK: ప్లే ఆఫ్ ముందు చెన్నై జట్టుకు ఏంటి ఈ కష్టాలు..

CSK: డిపెండింగ్ ఛాంపియన్ హోదాలో 17వ ఐపీఎల్ సీజన్లో అడుగుపెట్టిన చెన్నై జట్టు.. తన స్థాయికి తగ్గట్టే ఆడుతోంది.. ఇప్పటివరకు పది మ్యాచ్లు ఆడిన చెన్నై జట్టు.. 5 ఓటములు, ఐదు గెలుపులతో పాయింట్ల పట్టికలో నాలుగవ స్థానంలో కొనసాగుతోంది. బుధవారం రాత్రి సొంతమైదానంలో పంజాబ్ జట్టుతో జరిగిన మ్యాచ్లో ఓటమిపాలైనప్పటికీ పాయింట్ల పట్టికలో నాలుగవ స్థానంలో కొనసాగుతోంది.. గురువారం హైదరాబాద్, రాజస్థాన్ జట్ల మధ్య జరిగే మ్యాచ్లో.. హైదరాబాద్ గెలిస్తే చెన్నై జట్టు ఐదవ స్థానానికి పడిపోతుంది. అప్పుడు ప్లే ఆఫ్ మరింత రసవత్తరంగా మారుతుంది. తర్వాత వచ్చే మ్యాచ్లలో కచ్చితంగా చెన్నై గెలవాల్సి ఉంటుంది. ఇప్పటివరకు చెన్నై గెలిచిన మ్యాచ్లలో బౌలర్లు అద్భుతమైన ప్రతిభ చూపారు. ముఖ్యంగా ముస్తాఫిజర్, మోయిన్ అలీ, దీపక్ చాహర్, తుషార్ దేశ్ పాండే, మతిష పతీరణ, మహిష తీక్షణ వంటి వారు తమ బంతులతో మాయాజాలం చేసి ప్రత్యర్థి బ్యాటర్లకు చుక్కలు చూపించారు. అయితే, ఇప్పుడు వీరంతా చెన్నై జట్టుకు దూరమయ్యే ప్రమాదం పొంచి ఉంది.

ఈ సీజన్లో చెన్నై జట్టు తరఫున బంగ్లాదేశ్ బౌలర్ ముస్తాఫిజర్ అదరగొడుతున్నాడు. జాతీయ జట్టుకు ఆడేందుకు వెళ్తున్నాడు.. ఇంగ్లాండ్ దేశానికి చెందిన మోయిన్ అలీ పాకిస్తాన్ జట్టుతో జరిగే సిరీస్ కోసం స్వదేశానికి బయలుదేరి వెళ్తున్నాడు. వీరిద్దరూ చెన్నై జట్టుకు అత్యంత కీలకమైన బౌలర్లు. కీలకమైన ప్లే అఫ్ ముందు వీరు స్వదేశానికి వెళ్తుండడం చెన్నై జట్టుకు కోలుకోలేని దెబ్బ అని క్రీడా విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. మరోవైపు కీలక స్పిన్నర్ దీపక్ చాహర్ కూడా జ్వరంతో బాధపడుతున్నాడు.. వికెట్ల మీద వికెట్లు తీస్తూ చెన్నై జట్టు విజయంలో కీలక పాత్ర పోషిస్తున్న తుషార్ దేశ్ పాండే రెస్ట్ తీసుకుంటున్నాడు. వరుస మ్యాచ్ లు ఆడటంతో అతడు నీరసానికి గురయ్యాడు.. ఫలితంగా జట్టు మేనేజ్మెంట్ అతడికి విశ్రాంతి ఇస్తోంది..

ఇక ఈ సీజన్లో చెన్నై జట్టుకు అత్యంత కీలకమైన బౌలర్లుగా అవతరించిన మతీష పతిరణ, మహీష తీక్షణ వంటి వారు వీసా సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. చెన్నై జట్టు యాజమాన్యం రంగంలో దిగినప్పటికీ ఆ సమస్య పరిష్కారం కాలేదు. ఇటీవల చెన్నై జట్టు గెలిచిన మ్యాచ్లలో పతీరణ ముఖ్యపాత్ర పోషించాడు. ప్రత్యర్థి బ్యాటర్ల వికెట్లు వెంట వెంటనే తీసి చెన్నై జట్టుకు తిరుగులేని విజయాలు అందించాడు. అసలే డిపెండింగ్ ఛాంపియన్ హోదాలో దిగిన చెన్నై జట్టు.. ఈసారి కూడా కప్ దక్కించుకోవాలని భావిస్తున్నది. ఇప్పటికే పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో కొనసాగుతోంది. కీలకమైన ప్లే ఆఫ్ దశలో ఉన్న చెన్నై జట్టుకు.. ముఖ్యమైన బౌలర్లు దూరం కావడం తీవ్ర ఇబ్బంది కలిగిస్తోంది.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
RELATED ARTICLES

Most Popular