Yuzvendra Chahal: 2024 జూన్ లో అత్యంత ప్రతిష్టాత్మకంగా జరిగబోతున్న టి20 వరల్డ్ కప్ లో ఆడడానికి ఇండియన్ టీం 15 మంది ఆటగాళ్ళు, అలాగే నలుగురు రిజర్వ్ ప్లేయర్లతో కూడిన జట్టుని బీసీసీఐ రీసెంట్ గా ప్రకటించింది. అందులో భాగంగానే కొంతమందికి ఈ టీమ్ లో ఆడే అవకాశం దక్కితే మరి కొంత మందికి మాత్రం మొండి చేయి ఎదురైంది.
ఇక అందులో ముఖ్యంగా కే ఎల్ రాహుల్ కి వరల్డ్ కప్ లో ఆడే అవకాశం దక్కలేదనే చెప్పాలి. యాక్సిడెంట్ కారణంగా కొద్ది నెలల పాటు టీమ్ కి దూరమైన రిషబ్ పంత్ చాలా తొందరగా రికవరీ అయి ప్రస్తుతం ఐపీఎల్ లో చాలా బాగా ఆడుతూ అందులో సత్తా చాటుతున్నాడు. కాబట్టి అతన్ని టి 20 వరల్డ్ కప్ కు వికెట్ కీపర్ గా సెలెక్ట్ చేశారు. ఇక అందులో భాగంగానే మరొక వికెట్ కీపర్ గా సంజు శాంసన్ ను తీసుకున్నారు. శాంసన్ కూడా ఈ సంవత్సరం అద్భుతమైన రీతిలో బ్యాటింగ్ చేయడమే కాకుండా, రాజస్థాన్ రాయల్స్ టీమ్ కి వరుస విజయాలను అందిస్తూన్నాడు.
ఇక ఈ సీజన్ లో ఇప్పటివరకు రాజస్థాన్ టీమ్ ను నెంబర్ వన్ పొజిషన్ లో నిలిపాడు. అందుకే వికెట్ కీపర్లు గా వీళ్ళిద్దరికీ అవకాశం దక్కింది… ఇక వీళ్ళతో పాటుగా యజ్వేంద్ర చాహల్ కూడా టీం లోకి సెలెక్ట్ అయ్యాడు. ఆయన దాదాపు ఎనిమిది నెలల తర్వాత ఇండియన్ టీం లోకి ఎంట్రీ ఇస్తున్నాడు. 2023లో వెస్టిండీస్ తో ఆగష్టు లో జరిగిన చివరగా సీరీస్ తర్వాత ఆయన అప్పటినుంచి ఇప్పటివరకు మళ్ళీ ఇండియా టీమ్ కి ఆడే అవకాశం అయితే రాలేదు. మరి ఇప్పుడు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని చాలా ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇక మరోసారి మనం కుల్దీప్ యాదవ్, చాహల్ జోడిని టి20 వరల్డ్ కప్ లో చూడొచ్చు… ఇక ఇదిలా ఉంటే యజ్వేంద్ర చాహల్ భార్య ఆయన ధనశ్రీ సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్ గా ఉంటుంది.
కాబట్టి బిసిసిఐ వరల్డ్ కప్ కి ఆడే టీం ని సెలెక్ట్ చేసిన వెంటనే ఆమె టి20 వరల్డ్ కప్ కి సెలెక్ట్ అయిన ప్లేయర్ల ఫోటోలని ఇన్ స్టా లో పోస్ట్ చేసింది. అలాగే యజ్వేంద్ర చాహల్ ఉన్న ఫోటోని షేర్ చేస్తూ ‘హి ఇజ్ బ్యాక్’ అంటూ హార్ట్ ఎమోజి ఉన్న ఫోటోని షేర్ చేసింది. ప్రస్తుతం ఆమె పెట్టిన పోస్ట్ సోషల్ మీడియా లో వైరల్ గా మారింది…