Revanth Reddy : మరి కొద్ది రోజుల్లో తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికలు జరగబోతున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన వందరోజుల పరిపాలనకు పార్లమెంట్ ఎన్నికలు రెఫరెండమని ప్రకటించారు. కచ్చితంగా 10 నుంచి 14 పార్లమెంటు స్థానాలు గెలుస్తామని స్పష్టం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే భారతీయ జనతా పార్టీపై తీవ్రంగా విమర్శలు చేస్తున్నారు. నరేంద్ర మోడీని లక్ష్యంగా చేసుకొని ఆరోపణలు చేస్తున్నారు. గత కొద్దిరోజుల నుంచి కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా విభాగం కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా మాట్లాడినట్టుగా కొన్ని వీడియోలను స్పెక్యులేషన్ చేస్తోంది. రాజ్యాంగం ప్రసాదించిన రిజర్వేషన్లను తొలగిస్తామని అమిత్ షా అన్నట్టుగా కొన్ని వీడియోలను విపరీతంగా ప్రచారం చేస్తోంది. ఈ నేపథ్యంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సోమవారం ఢిల్లీ పోలీసులు సమన్లు పంపారు. మే 1న విచారణకు రావాలని కోరారు. ఎలక్ట్రానిక్ ఉపకరణాలను కూడా తీసుకురావాలని పేర్కొన్నారు. హోం మంత్రిత్వ శాఖ, బిజెపి చేసిన ఫిర్యాదు మేరకు ఢిల్లీ పోలీసులు రేవంత్ రెడ్డి పై ఆదివారం కేసు నమోదు చేసిన విషయం విధితమే. పార్లమెంట్ ఎన్నికల ముందు ఢిల్లీ పోలీసులు రేవంత్ రెడ్డికి సమన్లు పంపడం చర్చనీయాంశంగా మారింది. ఢిల్లీ పోలీసుల బృందం ఐటీ చట్టంలోని నిబంధనల ప్రకారం ఎఫ్ఐఆర్ నమోదు చేసింది.
ఇటీవల అమిత్ షా తెలంగాణలో పర్యటించారు. తాము అధికారంలోకి వస్తే రాజ్యాంగపరంగా విరుద్ధంగా ఉన్న ముస్లింల రిజర్వేషన్లను రద్దు చేస్తామని ప్రకటించారు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ కి చెందిన ఫలాలు మొత్తం వారికే వర్తించేలా చేస్తామని స్పష్టం చేశారు.. అయితే, అమిత్ షా చేసిన ప్రసంగాన్ని కొంతమంది వక్రీకరించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు సంబంధించిన రిజర్వేషన్ రద్దు చేస్తామని చెప్పినట్టు ఎడిట్ చేసి, ఆ వీడియోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో ఎన్నికల ముందు భారతీయ జనతా పార్టీ సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీనిపై బీజేపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తే పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేంద్ర హోం శాఖ కూడా దీనిపై స్పందించింది. నకిలీ వీడియోలపై పోలీసులకు ఫిర్యాదు చేసింది.
ఎన్నికల సమయంలో కేంద్ర హోం శాఖ మంత్రి మాట్లాడినట్టుగా కొందరు ఫేక్ వీడియోలు సృష్టించి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. ఇవి కలకలం సృష్టిస్తున్నాయి. ఏకంగా హోం మంత్రిత్వ శాఖ రంగంలోకి దిగిందంటే వారి పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇటీవల తెలంగాణలో పర్యటించినప్పుడు అమిత్ షా మాట్లాడారు. రాజ్యాంగ విరుద్ధంగా ఉన్న ముస్లింల రిజర్వేషన్లను రద్దు చేస్తామని ప్రకటించారు. అయితే దీనిని కొందరు వక్రీకరించారు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ ల రిజర్వేషన్లు రద్దు చేస్తామని అమిత్ షా చెప్పినట్టు ఫేక్ వాయిస్ తో ఎడిట్ చేశారు. సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీనిపై భారతీయ జనతా పార్టీ ఐటీ సెల్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ” తెలంగాణలో అమిత్ షా ఎన్నికల ప్రచారంలో భాగంగా పర్యటించారు. ఆ సమయంలో రాజ్యాంగ విరుద్ధంగా ఉన్న ముస్లింల రిజర్వేషన్లు తొలగిస్తామని స్పష్టం చేశారు. కానీ, కొందరు భారతీయ జనతా పార్టీపై కావాలని విష ప్రచారం చేస్తున్నారు. ఎడిట్ చేసి వీడియోలను వ్యాప్తి చేస్తున్నారు. ఇది సమాజంలో హింసకు దారి తీసే అవకాశం ఉంది. ఇలాంటి ప్రచారం చేసేవారు చట్టపరమైన చర్యలు ఎదుర్కోవాల్సి ఉంటుందని” బిజెపి ఐటి సెల్ వ్యాఖ్యానించింది. ఈ ఫేక్ వీడియోలపై కేంద్ర హోంశాఖ మంత్రిత్వ శాఖ కూడా స్పందించింది. ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేసింది.
.@INCTelangana is spreading an edited video, which is completely fake and has the potential to cause large scale violence.
Home Minister Amit Shah spoke about removing the unconstitutional reservation given to Muslims, on the basis of religion, after reducing share of SCs/STs and… pic.twitter.com/5plMsEHCe3— Amit Malviya (मोदी का परिवार) (@amitmalviya) April 27, 2024
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News. He has more than 17 years experience in Journalism.
Read MoreWeb Title: Delhi police summons revanth reddy over amit shahs fake video
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com