అనసూయ భరద్వాజ్ గ్లామర్ కి కేర్ ఆఫ్ అడ్రస్. బుల్లితెరపై ఓ ట్రెండ్ సెట్టర్. జబర్దస్త్ యాంకర్ గా ఆమె చేసిన సంచలనాలు అన్నీ ఇన్నీ కాదు. గ్లామర్ షో చేసిన ఫస్ట్ తెలుగు యాంకర్ అని చెప్పొచ్చు. Photo: Instagram
ఈ క్రమంలో ఆమె అనేక విమర్శలు ఎదుర్కొన్నారు. ఇంటిల్లపాది కలిసి చూసే టెలివిజన్ షోలో అలాంటి బట్టలు వేసుకోవడం ఏమిటంటూ అనసూయపై విమర్శలు గుప్పించారు. ఈ విమర్శలు అనసూయ ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీయలేకపోయాయి. నా బట్టలు నా ఇష్టం అని ఘాటుగా సమాధానం చెప్పింది. Photo: Instagram
అనసూయకు సోషల్ మీడియా ట్రోల్స్ కూడా ఎక్కువే. ఆమె ఫోటోలు, వీడియోలను తరచుగా ట్రోల్ చేస్తుంటారు. తన హేటర్స్ మరింత కుళ్ళుకునేలా అనసూయ పోస్ట్స్ ఉంటాయి. నా లైఫ్ నా ఇష్టం ఎవడేమనుకున్నా పట్టించుకోను అంటుంది. Photo: Instagram
తాజాగా అనసూయ గ్లామరస్ ఫోటో షూట్ చేసింది. షార్ట్ స్కర్ట్ ధరించి స్కిన్ షోకి తెరలేపింది. అనసూయ సూపర్ హాట్ ఫోటోలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. ఆమె గ్లామర్ కి ఫిదా అయిన నెటిజెన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. Photo: Instagram
మరోవైపు అనసూయ బుల్లితెరకు గుడ్ బై చెప్పింది. దాదాపు ఓ దశాబ్దం ఆమె బుల్లితెర ప్రేక్షకులను అలరించింది. 2022లో తనకు లైఫ్ ఇచ్చిన జబర్దస్త్ కి గుడ్ బై చెప్పింది. నటిగా బిజీ కావడంతోనే బుల్లితెరకు దూరం అయ్యాయని అనసూయ అన్నారు. Photo: Instagram
ఇక నటిగా ఆమె కెరీర్ ఫుల్ స్వింగ్ లో ఉంది. ఏడాదికి అరడజనుకు పైగా చిత్రాలు చేస్తుంది. గత ఏడాది అనసూయ నటించిన రంగమార్తాండ , విమానం, పెదకాపు 1, ప్రేమ విమానం చిత్రాలు విడుదలయ్యాయి. ఆమె విలక్షణ పాత్రలు చేసింది. Photo: Instagram
ఇటీవల రజాకార్ మూవీలో ఓ కీలక రోల్ చేసింది. నెక్స్ట్ ఆమె పుష్ప 2లో సందడి చేయనుంది. పుష్ప సీక్వెల్ గా తెరకెక్కిన పుష్ప 2లో అనసూయ లేడీ విలన్ రోల్ చేస్తున్న సంగతి తెలిసిందే. అల్లు అర్జున్-సుకుమార్ కాంబోలో తెరకెక్కుతున్న ఈ పాన్ ఇండియా మూవీ ఆగస్టు 15న విడుదల కానుంది. Photo: Instagram
Web Title: Crazy anasuya bharadwaj latest pictures are going viral on social media 2