Rising Raju : జబర్దస్త్ సీనియర్ కమెడియన్స్ లో రైజింగ్ రాజు ఒకరు. హైపర్ ఆది- రైజింగ్ రాజు ఒక టీమ్ కి లీడర్స్ గా ఉండేవారు. అద్భుతమైన కామెడీ స్కిట్స్ తో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. తనదైన కామెడీతో కడుపుబ్బా నవ్వించాడు. రాజు పై ఆది చేసే కామెడీ బాగా వర్కౌట్ అయ్యేది. వీరిద్దరి కాంబినేషన్ లో నెక్స్ట్ లెవెల్ లో కామెడీ పండేది. రాజు వయసుపై ఆది జోక్స్ గట్టిగా పేలేవి. అయితే ప్రస్తుతం రైజింగ్ రాజు జబర్దస్త్ షో చేయడం లేదు.
హైపర్ ఆది జబర్దస్త్ మానేయడంతో రాజు కూడా ఆ తర్వాత షో లో కనిపించలేదు. తాజాగా ఇమ్మాన్యుయేల్ – వర్ష కలిసి చేస్తున్న ‘ప్రేమ కావాలి ‘ షోలో పాల్గొన్నాడు. మరో కమెడియన్ అప్పారావు తో కలిసి షో కి హాజరయ్యారు. ఈ క్రమంలో తన భార్య, పిల్లల గురించి పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. రాజు మాట్లాడుతూ .. నాకు పెళ్లి చూపులు కాకినాడలో జరిగాయి.
డ్రింకులు, కారంబూందీ, స్వీట్స్ పెడతారని .. చుట్టూ ఆడవాళ్లు ఉంటారని పెళ్లి చూపులకి వెళ్ళాను. అప్పుడు నా భార్య గ్రీన్ కలర్ చీరలో ఉంది. అప్పుడే గదిలో నుంచి వచ్చింది. చూడగానే మైండ్ బ్లాక్ అయిపోయింది. పిల్ల ఏంటిరా అమలాపురం కొబ్బరిముక్కలా ఉంది. దేవుడా ఈ పిల్లని ఎలాగైనా సెట్ చెయ్, అంటూ భగవంతుడిని కోరుకున్నాను. తనని ని పెళ్లి చేసుకోవడానికి నానా తిప్పలు పడ్డాను.
చివరికి ఎలాగో పెళ్లి చేసుకున్నాను. ఆ క్షణం నా ఆనందానికి హద్దులు లేవు. అంత పిచ్చి ప్రేమ తనంటే. నా భార్య కోసం పదేళ్లు ఇండస్ట్రీకి కూడా దూరంగా ఉన్నానంటూ రైజింగ్ రాజు చెప్పుకొచ్చాడు. అలాగే హైపర్ ఆది దేవుడని, అతని మనసు చాలా గొప్పదని రాజు అన్నారు. కోవిడ్ టైములో తనకు మనవరాలు పుట్టడంతో జబర్దస్త్ కి కూడా వెళ్లలేదు. స్కిట్స్ చేయకపోయినా కూడా సమయానికి పేమెంట్ పంపేవాడు .. చిన్నవాడు అయిపోయాడు లేదంటే పాదాభివందనం చేసేవాడిని అంటూ ఆది పై ప్రశంసలు కురిపించారు.