Homeఆంధ్రప్రదేశ్‌AP Elections 2024: ఆంధ్రాకు మూడు వేల బస్సులు

AP Elections 2024: ఆంధ్రాకు మూడు వేల బస్సులు

AP Elections 2024: దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్నాయి. వాటితో పాటు ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు కూడా నిర్వహిస్తున్నారు. ఏడు విడతల్లో పోలింగ్ జరుగుతోంది. జూన్ 4న ఫలితాలు ప్రకటించనున్నారు. ఏపీకి సంబంధించి మే 13న పోలింగ్ జరగనుంది. దక్షిణాది రాష్ట్రాల్లో అందరి దృష్టి ఏపీ పైనే ఉంది. సాధారణంగా ఎంపీ ఎన్నికల కంటే అసెంబ్లీకి ఎక్కువ మంది ప్రాధాన్యమిస్తారు. ఎక్కడ ఉన్నా ఓటు వేసేందుకు స్వరాష్ట్రానికి వస్తారు.సొంత గ్రామానికి వెళ్లి ఓటు వేసేందుకు ఇష్టపడతారు.అయితే వలస ఓటర్లను రప్పించేందుకు అన్ని పార్టీలు ప్రయత్నాలు చేస్తున్న క్రమంలో… స్వగ్రామాలు చేరుకోవడం చాలా ఈజీ అవుతుంది.

ఏపీ నుంచి ప్రజలు ఎక్కువగా వలస పోతుంటారు.ఉద్యోగ ఉపాధి కోసం హైదరాబాద్,బెంగళూరు, చెన్నై వంటి నగరాలకు వెళుతుంటారు. ముఖ్యంగా ఉత్తరాంధ్ర నుంచి వలస బాట అధికం. అటువంటి వారు ఎన్నికల సమయంలో స్వగ్రామాలకు వెళ్లడం జరుగుతుంటుంది. అయితే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఈ వలస ఓటర్ల తరలింపు అధికంగా జరిగేది. కానీ ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో కూడా వలస ఓటర్లను తెప్పించేందుకు రకరకాల ప్రయత్నాలు ముందుగానే జరుగుతున్నాయి. ఆరోజు దాదాపు 3000 బస్సులు ఏపీకి రానున్నట్లు తెలుస్తోంది. రాను పోను ఖర్చులతో పాటు భోజనం, ఇతరత్రా ఖర్చులు పెట్టేందుకు రాజకీయ పార్టీలు సిద్ధపడుతున్నాయి.

ఒక్క హైదరాబాదు నుంచి దాదాపు 2000 బస్సులు బుక్ అయినట్లు తెలుస్తోంది. అవి హైదరాబాదులో 11వ తేదీన బయలుదేరుతాయి. ఆ మరుసటి రోజున వలస ఓటర్లు స్వగ్రామాలకు చేరుకోనున్నారు. ఓటు వేసిన తర్వాత 13వ తేదీ సాయంత్రం తిరిగి ఆ బస్సులు బయలుదేరనున్నాయి. అయితే ఈ వలస ఓటర్లను తరలించేందుకు అన్ని పార్టీలు ప్రత్యేకంగా కొందరు మనుషులను నియమించుకున్నారు. వారే వలస ఓటర్లవివరాల సేకరణ, ఏయే ప్రాంతాల్లో ఉంటారు. వారిని ఎలా తరలించాలి. వంటి విషయాలన్నీ వారే చూసుకుంటారు.అయితే దాదాపు ప్రైవేటు ట్రాన్స్పోర్ట్ కంపెనీలకు చెందిన బస్సులు ఏపీ ఎన్నికలకు రానున్నట్లు తెలుస్తోంది.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

Related News

Most Popular

Public Movement : ప్రధానుల తల వంచిన ప్రజా ఉద్యమాలు..

Public Movement : ప్రజా ఉద్యమాలు భారత దేశానికి కొత్తకాదు. మన స్వాతంత్య్రమే ప్రజా ఉద్యమాలతో సాధించుకున్నాం. స్వతంత్ర భారతదేశంలో ప్రజా ఉద్యమాలు ప్రభుత్వాలపై గణనీయమైన ప్రభావం చూపాయి. కొన్ని సందర్భాల్లో ప్రధానులు...
Narendra Modi

Narendra Modi : నాడు రైతులు.. నేడు విద్యార్థులు.. మోదీతో వెనకడుగు వేయించిన ఉద్యమాలు!

Narendra Modi : ప్రధాని నరేంద్రమోదీ.. వరుసగా మూడోసారి ప్రధాని అయ్యారు. ఇటీవలే పండిత్‌ జవహర్‌లాల్‌ నెహ్రూ పేరిట ఉన్న రికార్డును కూడా అధిగమించారు. అత్యధిక కాలం పాలించిన ప్రధానిగా చరిత్ర సృష్టించారు....
Cockroach Janata Party youth politics

Cockroach Janata Party రాజకీయ పార్టీగా సిజెపి.. తర్వాతి అడుగు అదే..

Cockroach Janata Party ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు. కొత్త విద్యా శాఖ మంత్రిగా ప్రహ్లాద్ జోషి నియమితులయ్యారు. ఇక్కడితోనే సీజేపీ ఆగిపోతుందా.. తదుపరి ఏం చేస్తుంది.. అసలు బొద్దింకల తదుపరి లక్ష్యం...

Chiranjeevi : బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిన గబ్బర్ సింగ్ నటుడికి మెగాస్టార్ చిరంజీవి భారీ విరాళం..

Chiranjeevi : ఆపదలో ఉన్నవారికి సహాయం చేయడం మెగాస్టార్ చిరంజీవి కి కొత్తేమి కాదు. ప్రతీ నెల ఎవరికో ఒకరికి ఆయన నుండి సహాయం అందుతూనే ఉంటుంది. చిరంజీవి చేసినన్ని సహాయ కార్యక్రమాలు...
CJP Protests

Student Movements in India బొద్దింకలే మొదలు కాదు.. మన దేశంలో ఎన్ని విద్యార్థి ఉద్యమాలు జరిగాయి అంటే..

Student Movements in India ఏ దేశానికైనా సరే అక్కడి యువత ప్రధాన బలం. యువత సానుకూలంగా ఉంటేనే ఆదేశం అభివృద్ధి పథంలో సాగుతూ ఉంటుంది. యువతలో అసంతృప్తి పెరిగిపోతే ఆది కాస్త...
Oktelugu Epaper