Mahesh Babu – NTR : టాలీవుడ్ లో ఉన్న స్టార్ హీరోలందరూ ఒక రకమైన పాత్రలు మాత్రమే పోషిస్తూ ఉంటారు. ఇక అందులో కొంతమంది కొన్ని రకాల డిఫరెంట్ పాత్రను పోషించాలనే ప్రయత్నం చేసినప్పటికీ అవి పెద్దగా వర్కౌట్ అయితే అవ్వవు. ఇక అందులో ముఖ్యంగా మహేష్ బాబు లాంటి సూపర్ స్టారర్ మురుగ దాస్ డైరెక్షన్ లో చేసిన ‘స్పైడర్ ‘ సినిమాలో మహేష్ బాబు రా ఏజెంట్ గా మనకు కనిపిస్తాడు. అయితే అందులో ఆయన నటించిన నటన చాలా అద్భుతంగా ఉన్నప్పటికీ సినిమా కంటెంట్ లో పెద్దగా మ్యాటర్ లేకపోవడంతో సినిమా ఫ్లాప్ అయింది.
ఇక ఇది ఇలా ఉంటే తెలుగు లో మరో స్టార్ హీరో అయిన ఎన్టీయార్ ఇప్పుడు బాలీవుడ్ ఇండస్ట్రీలో హృతిక్ రోషన్ తో కలిసి వార్ 2 సినిమాలో హీరోగా చేస్తున్నాడు. అయితే ఎన్టీయార్ ఈ సినిమాలో రా ఏజెంట్ గా నటించబోతున్నట్టుగా వార్తలైతే వస్తున్నాయి. అయితే ఇప్పటివరకు టాలీవుడ్ ఇండస్ట్రీ లో ఎవరు కూడా ఈ క్యారెక్టర్ లో నటించలేదు. ఒక మహేష్ బాబు నటించినప్పటికి స్పైడర్ సినిమాతో ఆయన భారీగా దెబ్బతిన్నాడు.
మరి ఇప్పుడు మహేష్ బాబు కు కలిసి రాని రా ఏజెంట్ క్యారెక్టర్ ఎన్టీఆర్ కి ఎంతవరకు కలిసి వస్తుంది అంటూ సోషల్ మీడియాలో విపరీతమైన కామెంట్లైతే చేస్తున్నారు. ఇక ఇదిలా ఉంటే వార్ 2 సినిమాలో ఎన్టీఆర్ పాత్ర చాలా గొప్ప గా ఉండబోతుందంటూ ఆ సినిమా యూనిట్ అయితే ఎన్టీఆర్ మీద ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
ఇక రీసెంట్ గా ‘అనుపమ్ ఖేర్’ లాంటి నటుడు కూడా ఎన్టీఆర్ ని తన అభిమాన నటుడుగా కొనియాడడం అనేది నిజంగా ఎన్టీఆర్ ప్రతిభకు కొలమానమనే చెప్పాలి. ఇక ఏది ఏమైనాప్పటికీ వార్ 2 సినిమాతో మరోసారి తను స్టార్ డమ్ ను అందుకోవాలనే ప్రయత్నం చేస్తున్నాడు. ఇక దానికి తగ్గట్టుగానే ఆయన ఈ సినిమా ద్వారా సక్సెస్ ని అందుకొని మహేష్ బాబు కి రా ఏజెంట్ కి దక్కని సక్సెస్ ఎన్టీఆర్ దక్కించుకుంటాడా లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది…