Brahmanandam- Ali: టీషర్ట్ వేస్తే కుర్రోడు అనుకోవద్దు.. అలీపై నోరుజారిన బ్రహ్మానందం

Brahmanandam- Ali: ఆలీ, బ్రహ్మానందం సమ ఉజ్జీలు. ఈ విషయం బ్రహ్మానందమే స్వయంగా చెప్పారు. వీరిద్దరు కలిసి ఓ సినిమా ఫంక్షన్లో అటెండ్ అయ్యారు. ఈ స్టేజీపై డైరెక్టర్ ఎస్వీ కృష్ణారెడ్డి, నిర్మాత అచ్చిరెడ్డిలు కూడా హాజరయ్యారు. వారు ఆ సినిమా గురించి మాట్లాడిన తరువాత ఆలీ మైక్ అందుకున్నారు. చివరగా బ్రహ్మానందంకు అవకాశం ఇచ్చారు. ఆయనకు మైక్ ఇవ్వగానే సెటైరికల్ డైలాగ్ విసిరాడు. ‘టీషర్ట్ వేసుకుంటే కుర్రోడు అనుకోవచ్చు.. ముసలోడు..’ అంటూ ఆలీపై సెటైర్ వేస్తూ […]

  • Written By: SS
  • Published On:
Brahmanandam- Ali: టీషర్ట్ వేస్తే కుర్రోడు అనుకోవద్దు.. అలీపై నోరుజారిన బ్రహ్మానందం
Brahmanandam- Ali

Brahmanandam- Ali

Brahmanandam- Ali: ఆలీ, బ్రహ్మానందం సమ ఉజ్జీలు. ఈ విషయం బ్రహ్మానందమే స్వయంగా చెప్పారు. వీరిద్దరు కలిసి ఓ సినిమా ఫంక్షన్లో అటెండ్ అయ్యారు. ఈ స్టేజీపై డైరెక్టర్ ఎస్వీ కృష్ణారెడ్డి, నిర్మాత అచ్చిరెడ్డిలు కూడా హాజరయ్యారు. వారు ఆ సినిమా గురించి మాట్లాడిన తరువాత ఆలీ మైక్ అందుకున్నారు. చివరగా బ్రహ్మానందంకు అవకాశం ఇచ్చారు. ఆయనకు మైక్ ఇవ్వగానే సెటైరికల్ డైలాగ్ విసిరాడు. ‘టీషర్ట్ వేసుకుంటే కుర్రోడు అనుకోవచ్చు.. ముసలోడు..’ అంటూ ఆలీపై సెటైర్ వేస్తూ తన స్పీచ్ ను మొదలు పెట్టారు. మీడియా ముఖంగా ఇలా అనేసరికి ఇబ్బంది ఆలీ ఇబ్బంది పడినట్లు తెలుస్తోంది. వివరాల్లోకెళ్తే..

సినిమాల్లో కామెడీ కింగ్ బ్రహ్మానందం అని చెప్పొచ్చు. పేరులో ఉన్నలాగే ఇతరులకు అమితానందాన్ని అందించి ఆకట్టుకుంటారు. మూడు దశాబ్దాల పాటు అన్ని వర్గాల ప్రేక్షకుల అభిమానం పొందిన ఆయన ఇప్పటికీ కొన్ని సినిమాల్లో కనిపిస్తుండడం విశేషం. బ్రహ్మానందం ఒకప్పుడు సినిమాల్లో తప్ప బయట కనిపించేవారు కాదు. కానీ ఇటీవల ప్రత్యేక ప్రోగ్రామ్స్ అలరిస్తున్నాడు. సినిమాల్లో లాగే స్టేజీలపై కుళ్లు జోకులతో నవ్వులు పూయిస్తున్నాడు. ఇలా ఆయన ఓ సినిమా ప్రమోషన్ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా హాట్ కామెంట్స్ చేశారు.

‘పెద్దలందరికీ నమస్కారం.. నాకంటే పెద్దవాళ్లు ఇక్కడ ఎవరూ లేరనుకో.. మీడియా మిత్రులకు కూడా నా నమస్కారం. అప్పటికీ, ఇప్పటికే అవే ముహాలు కాకపోతే జుట్టు మారింది.’ అని అన్నారు. ‘తలకు రంగేశావు గానీ.. మనం కూడా అదే బాపతి’ అంటూ ఆలీని చూస్తూ అనడంతో అంతా నవ్వుకున్నారు. దీంతో ఆలీ గెల్టీగా ఫీలనయినట్లు తెలుస్తోంది. ఆ తరువాత వెంటనే కవర్ చేస్తూ ‘ఆలీది నాది ఒకటే జీవితం అనుకోవచ్చు. ఇద్దరం మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచే వచ్చాం. కష్టం తెలిసిన వాళ్లం.. ఆకలి తెలిసినవాళ్లం.. ఎవరైనా బ్యాలెన్స్ తప్పి మాటలు అనుకున్నా.. సరిచేసుకున్నాం. ఎందుకంటే ఆలీ అంటే ఎంతో అభిమానం. ఆ అభిమానంతోటే ఇలా ఇప్పటికీ కలిసున్నాం’ అని అన్నారు.

Brahmanandam- Ali

Brahmanandam- Ali

బ్రహ్మానందం, ఆలీలు కలిసి మనీ సినిమాలో నటించారు. అంతకుముందే వీరు వేర్వేరు సినిమాల ద్వారా ఫీల్డులోకి ఎంట్రీ ఇచ్చి ప్రత్యేకత చాటుకున్నారు. మనీ సినిమా నుంచి పోటీ పడి కామెడీ పండిస్తున్నారు. ఈ సందర్భంగా బ్రహ్మనందం మాట్లాడుతూ ఇంచుమించి ఒకే స్టేజీ నుంచి వచ్చి ఇంతకాలం కలిసుండడం అంటే మాములు విషయం కాదని అన్నారు. ఇండస్ట్రీలో ఎంతో ఓర్పు, సహనం ఉంటేనే ఈ స్థితిలో ఉంటామని బ్రహ్మానందం చెప్పారు. బ్రహ్మానందం మాట్లాడిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

సంబంధిత వార్తలు