Homeఎంటర్టైన్మెంట్Pawan Kalyan- Ali: పవన్ మూవీలో ఆలీ... మిత్రులు మరలా ఒక్కటయ్యారా?

Pawan Kalyan- Ali: పవన్ మూవీలో ఆలీ… మిత్రులు మరలా ఒక్కటయ్యారా?

Pawan Kalyan- Ali: పవన్ కళ్యాణ్-ఆలీ బెస్ట్ ఫ్రెండ్స్. ఏళ్ల తరబడి వీరి స్నేహం సాగింది. పవన్ కళ్యాణ్ ప్రతి సినిమాలో ఆలీ ఉండాల్సిందే. వీరి మధ్య రాజకీయాలు చిచ్చు పెట్టాయి. పవన్ కళ్యాణ్ జనసేన అధినేతగా ఉన్నారు. జనసేన ప్రత్యర్థి పార్టీ వైసీపీలో ఆలీ చేరారు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో ఆలీ వైసీపీ పార్టీ తరపున ప్రచారం చేశారు. ఈ క్రమంలో ఆలీ-పవన్ కి మాటల యుద్ధం కూడా జరిగింది. అప్పటి నుండి గ్యాప్ వచ్చింది. మాట్లాడుకోవడం లేదనే వాదన ఉంది.

ఆ వాదనలు బలపరుస్తూ ఈ మధ్య విడుదలైన పవన్ సినిమాల్లో ఆలీ నటించలేదు. అలాగే ఆలీ కూతురు పెళ్ళికి పవన్ కళ్యాణ్ హాజరు కాలేదు. అయితే పవన్ తో విబేధాలని వస్తున్న వార్తలను ఆలీ పలుమార్లు ఖండించారు. పవన్ కళ్యాణ్ నాకు ఎప్పటికీ మిత్రుడే. మా అమ్మాయి పెళ్ళికి ఆహ్వానించేందుకు వెళితే చక్కగా మాట్లాడారు. పెళ్ళికి ఆయన రావాల్సి ఉంది. ఫ్లైట్ మిస్ కావడంతో రాలేకపోయారని చెప్పారు.

పవన్ కావాలనే ఆలీ కూతురు వివాహానికి హాజరుకాలేదని వార్తలు వచ్చాయి. కాగా పవన్ కళ్యాణ్-ఆలీ వివాదాల పరంపరకు ఫుల్ స్టాప్ పెట్టనున్నారట. పవన్ నెక్స్ట్ మూవీలో ఆలీ నటించడం ద్వారా పుకార్లకు చెక్ పెట్టాలని అనుకుంటున్నారట. సుజీత్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ నటిస్తున్న ఓజీలో ఆలీ నటిస్తున్నారు టాలీవుడ్ టాక్. దీనిపై అధికారిక సమాచారం లేకున్నప్పటికీ ప్రముఖంగా ప్రచారం అవుతుంది.

అజ్ఞాతవాసి చిత్రం నుండి ఆలీ పవన్ కళ్యాణ్ చిత్రాల్లో నటించింది లేదు. చాలా గ్యాప్ తర్వాత ఓజీలో కలిసి నటించనున్నారట. డివివి దానయ్య ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. చిత్రీకరణ దశలో ఉన్న ఈ మూవీ వచ్చే ఏడాది విడుదలయ్యే సూచనలు కలవు. పవన్ ఓజీలో గ్యాంగ్ స్టర్ రోల్ చేస్తున్నారు. అలాగే హరి హర వీరమల్లు, ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రాల్లో పవన్ కళ్యాణ్ నటిస్తున్నారు. బ్రో విడుదలకు సిద్ధం అవుతుంది.

Shiva
Shivahttps://oktelugu.com/
Shiva Shankar is a Senior Cinema Reporter Exclusively writes on Telugu cinema news. He has very good experience in writing cinema news insights and celebrity updates, Cinema trade news and Nostalgic articles and Cine celebrities and Popular Movies. Contributes Exclusive South Indian cinema News.

Related News

Most Popular

Bank Loans

loan charges : లోన్ తీసుకుంటున్నారా.. వడ్డీ రేటు మాత్రమే కాదు.. ముందుగా ఈ ఛార్జీల గురించి తెలుసుకోండి!

loan charges G అత్యవసర అవసరాలు, ఇల్లు కొనుగోలు ఇతర వ్యక్తిగత అవసరాల కోసం చాలామంది బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల నుంచి రుణాలు తీసుకుంటుంటారు. అయితే లోన్ తీసుకునే సమయంలో చాలామంది...
women stress at home

Infertility : 35 ఏళ్ల వయసు దాటిందా… అయితే ఇలా చేయండి..

Infertility : ప్రస్తుతం చాలా మంది దంపతులు సంతానలేమి సమస్యను ఎదుర్కొంటున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం.. జీవితంలో ఏదో ఒక దశలో సుమారు ప్రతి ఆరుగురిలో ఒకరికి సంతానలేమి సమస్య...

Monsoon Cars : వర్షంతో రోడ్లు చెరువుల్లా ఉన్న పర్వాలేదు.. ఈ కార్లలో ప్రయాణం సురక్షితం.. ఎందుకంటే..

Monsoon Cars : ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో వర్షాలు మొదలయ్యాయి. ఇలాంటి సమయంలో రహదారులు చెరువులను తలపిస్తుంటాయి. మోకాళ్ల లోతు నీటిలో సాధారణ హ్యాచ్‌బ్యాక్ లేదా సెడాన్ కార్లు నడపడం...

Revanth Reddy : మల్లారెడ్డిని మళ్లీ టార్గెట్ చేసిన రేవంత్ రెడ్డి..

ఇటీవల అందెశ్రీ సంస్మరణ సభ జరిగింది. ఆ సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చీఫ్ గెస్ట్ గా వచ్చారు. అందెశ్రీ గురించి మాట్లాడారు. ఆయనకు జరిగిన అన్యాయం గురించి ఏ కరువు పెట్టారు....
Kajal Aggarwal birthday

Kajal Aggarwal : బాలీవుడ్ లోకి వెళ్తే పనికిమాలిన పాత్రలే ఇస్తారు అంటూ కాజల్ అగర్వాల్ హాట్ కామెంట్స్..

Kajal Aggarwal : నేటి తరం యూత్ ఆడియన్స్ లో తిరుగులేని స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న కాజల్ అగర్వాల్ , పెళ్లి తర్వాత తన సెకండ్ ఇన్నింగ్స్ ని చాలా...
Oktelugu Epaper