కరోనా దెబ్బకు వాయిదాపడిన అర్జున మూవీ

డాక్టర్‌ రాజశేఖర్‌ ద్విపాత్రాభినయం చేసిన తాజా చిత్రం ‘అర్జున’. అందాల భామ మరియం జకారియా కథానాయికగా నటించిన ఈ చిత్రానికి కన్మణి దర్శకత్వం వహించారు. ముందుగా ఈ నెల 6న  రిలీజ్ చెయ్యాలని చిత్రబృందం నిర్ణయించారు. అయితే కరోనా ప్రభావం వల్ల చిత్రం విడుదలను ఈ నెల 13కి వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకున్నామని నిర్మాతలు నట్టి కరుణ, నట్టి క్రాంతి తెలిపారు. నట్టి కరుణ, నట్టి క్రాంతి మాట్లాడుతూ – ఇందులో తండ్రీ కొడుకులుగా రాజశేఖర్  […]

  • Written By: Neelambaram
  • Published On:
కరోనా దెబ్బకు వాయిదాపడిన అర్జున మూవీ

డాక్టర్‌ రాజశేఖర్‌ ద్విపాత్రాభినయం చేసిన తాజా చిత్రం ‘అర్జున’. అందాల భామ మరియం జకారియా కథానాయికగా నటించిన ఈ చిత్రానికి కన్మణి దర్శకత్వం వహించారు. ముందుగా ఈ నెల 6న  రిలీజ్ చెయ్యాలని చిత్రబృందం నిర్ణయించారు. అయితే కరోనా ప్రభావం వల్ల చిత్రం విడుదలను ఈ నెల 13కి వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకున్నామని నిర్మాతలు నట్టి కరుణ, నట్టి క్రాంతి తెలిపారు.

నట్టి కరుణ, నట్టి క్రాంతి మాట్లాడుతూ – ఇందులో తండ్రీ కొడుకులుగా రాజశేఖర్  అద్భుతమైన నటనను కనబరిచారని అన్నారు. సమకాలీన  రాజకీయ నేపధ్య పరిస్థితులకు అద్దంపట్టే చిత్రమిదని, యదార్థ సంఘటనలను ప్రేరణగా తీసుకుని సహజత్వానికి దగ్గరగా దీనిని మలచడం జరిగిందని చెప్పారు. కాస్త వయసు మళ్ళిన సూర్యనారాయణ అనే రైతు పాత్రలోనూ…  అలాగే ఆయన తనయుడిగా అర్జున పాత్రలోనూ రాజశేఖర్ ఒదిగిపోయారు. తండ్రీకొడుకుల మధ్య వచ్చే భావోద్వేగ సన్నివేశాలు ఓ హైలైట్‌. దాదాపు 800 థియేటర్లలో ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నాం’’ అన్నారు.

సంబంధిత వార్తలు