Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్నారు. ఏపీలో మే 13న సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. టీడీపీ+జనసేన+బీజేపీ కూటమిగా బరిలో దిగుతున్నాయి. ఇక ఎన్డీయే కూటమి ఎమ్మెల్యే అభ్యర్థిగా పిఠాపురం నుండి పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ కోసం మెగా ఫ్యామిలీతో పాటు పలువురు చిత్ర ప్రముఖులు ప్రచారంలో పాల్గొంటున్నారు. పవన్ కళ్యాణ్ కారణంగా పిఠాపురం పేరు మారుమ్రోగుతుంది. ఆ నియోజకవర్గంలో తారల సందడి నెలకొంది.
పవన్ కళ్యాణ్ ప్రజాక్షేత్రంలో ఉండగా ఆయన వ్యక్తిగత విషయాలు కొన్ని వెలుగులోకి వస్తున్నాయి. పవన్ కళ్యాణ్ భార్య అన్నా లెజినోవా గురించి ఆసక్తికర వార్త సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. పవన్ కళ్యాణ్-అన్నా లెజినోవా మధ్య ఏజ్ గ్యాప్ చాలానే ఉంది. 2013లో పవన్ కళ్యాణ్ రష్యన్ యువతి అన్నా లెజినోవాను వివాహం చేసుకున్నారు. వీరికి ఒక అమ్మాయి, అబ్బాయి సంతానం.
రష్యన్ యువతి అయినప్పటికీ వివాహం అనంతరం పక్కా తెలుగు గృహిణిగా మారిపోయింది. సాంప్రదాయ చీరకట్టులో ఆమె కనిపిస్తూ ఉంటారు. కాగా పవన్ కళ్యాణ్ కంటే అన్నా లెజినోవా దాదాపు ఓ పదేళ్లు చిన్నవారని తెలుస్తుంది. 1968 సెప్టెంబర్ 2న పవన్ కళ్యాణ్ జన్మించారు. ఇక అన్నా లెజినోవా 1980లో జన్మించారు. పవన్ కళ్యాణ్ ప్రస్తుత వయసు 55 కాగా , అన్నా లెజినోవా వయసు 44 ఏళ్ళు. కాబట్టి పవన్ కళ్యాణ్ కంటే అన్నా లెజినోవా 11 ఏళ్ళు చిన్నది.
ఇక పవన్ కళ్యాణ్ అప్ కమింగ్ చిత్రాల విషయానికి వస్తే… పీరియాడిక్ యాక్షన్ డ్రామా హరి హర వీరమల్లు చేస్తున్నారు. ఇది రెండు భాగాలుగా విడుదల కానుంది. ఇటీవల విడుదలైన టీజర్ ఆకట్టుకుంది. దర్శకుడు హరీష్ శంకర్ తెరకెక్కిస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రంలో పవన్ కళ్యాణ్ నటిస్తున్నారు. సాహో ఫేమ్ సుజీత్ ఓజీ టైటిల్ తో గ్యాంగ్ స్టర్ డ్రామా తెరకెక్కిస్తున్నాడు. ఈ ఏడాది ఈ మూడు చిత్రాలు విడుదలయ్యే ఆస్కారం కలదు.