Prasanna Vadanam Review: సినిమా ఇండస్ట్రీ లో ఉన్న స్టార్ హీరోలు వరుసగా పెద్ద సినిమాలను చేస్తూ ముందుకు దూసుకెళ్తుంటే, కొంతమంది చిన్న హీరోలు మాత్రం చిన్న చిన్న కాన్సెప్ట్ లతో సినిమాలు చేసి మంచి విజయాలను అందుకుంటున్నారు. ఇక అందులో సుహాస్ ఒకరు..షార్ట్ ఫిలిమ్స్ చేస్తూ సినిమా ఇండస్ట్రీకి పరిచయమైన సుహాస్ ‘కలర్ ఫోటో ‘ సినిమాతో హీరోగా మారాడు. అయితే ఈ సినిమా మంచి సక్సెస్ సాధించడంతో ఆ తర్వాత ఆయన వెను తిరిగి చూడకుండా హీరోగా ముందుకు సాగుతున్నాడు. ఇక ఈ సినిమా తర్వాత ‘రైటర్ పద్మభూషణ్’, ‘అంబాజీ పేట మ్యారేజీ బ్యాండ్’ లాంటి సినిమాలతో హ్యాట్రిక్ విజయాలను తన ఖాతాలో వేసుకున్న సుహాస్ ఇప్పుడు ‘ప్రసన్న వదనం’ అనే సినిమాతో మరోసారి ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మరి ఈ సినిమా ఎలా ఉంది.?సుహాస్ ఖాతా లో మరో సక్సెస్ పడిందా.? లేదా అనే విషయాన్ని మనం ఒకసారి బ్రీఫ్ అనాలసిస్ ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం…
కథ
ఇక ఈ సినిమా కథ విషయానికి వస్తే సూర్య (సుహస్) అనే వ్యక్తి యొక్క అమ్మా నాన్న లు చిన్నప్పుడే కార్ యాక్సిడెంట్ లో చనిపోతారు. ఇక ఆయన అప్పటినుంచి ఒంటరిగా బతుకుతూ ఉంటాడు. ఇక ఈ యాక్సిడెంట్ జరగడం వల్లే ఆయనకి “ఫేస్ బ్లైండ్ నెస్ “(ప్రోసోపాగ్నోసియా)అనే వ్యాధి వస్తుంది. ఇక దీనివల్ల మనుషుల ఫేసులను గుర్తుపట్టలేడు. అలాగే మనుషుల మాటలని కూడా ఐడెంటిఫై చేయలేడు. ఇలా తను ఈ వ్యాధితో చాలా వరకు ఇబ్బంది పడుతూ ఉంటాడు. ఇక ఇలాంటి క్రమంలోనే తను ఆర్జేగా కూడా పనిచేస్తూ ముందుకు సాగుతూ ఉంటాడు. తనకు ఉన్న ఈ వ్యాది గురించి ఎవరికి తెలియకుండా మ్యానేజ్ చేస్తాడు.
ఇక తనకు తోడుగా తన ఫ్రెండు అయిన విఘ్నేష్ (వైవా హర్ష)ఉంటాడు. ఇక అలాగే తన లైఫ్ లోకి ఆధ్య (పాయల్) కూడా వస్తుంది. ఇక ఇదిలా ఉంటే సూర్య ఒకరోజు తెల్లవారుజామున ఒక అబ్బాయి అమ్మాయిని చంపేస్తుంటే చూస్తాడు. ఇక తనకున్న ఫేస్ బ్లైండ్నెస్ వల్ల తను ఆ ఫేస్ ను సరిగా ఐడెంటిఫై చేయడు. కానీ అక్కడే ఉన్నా కాయిన్ బాక్స్ నుంచి పోలీసులకి ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాడు. ఇక దాంతో అసలు మర్డర్ చేసింది ఎవరో తెలియనప్పటికీ ఆ కేసు మొత్తం సూర్య మీదకు వస్తుంది. ఇక తను ఆ కేసు నుంచి ఎలా బయటపడ్డాడు.? ఆ అబ్బాయి ఆ అమ్మాయిని చంపడానికి గల కారణం ఏంటి.? సూర్యకి చివర్లో ఫేస్ బ్లైండ్నెస్ వ్యాధి నయమైందా లేదా అనే విషయాలను తెలుసుకోవాలంటే మీరు ఈ సినిమా చూడాల్సిందే…
విశ్లేషణ
ఇక ఈ సినిమా విశ్లేషణ విషయానికి వస్తే ఈ సినిమా డైరెక్టర్ అయిన అర్జున్ వై కే ఈ సినిమాని మొదటి నుంచి కూడా చాలా గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే తో ప్రతి సీన్ ను ఎంగెజింగ్ గా తెరకెక్కించే ప్రయత్నం అయితే చేశాడు. ఇక అందుకు తగ్గట్టుగానే ఆయన కూడా ఒక వైవిధ్యాన్ని కనబరుస్తూ సస్టైనెడ్ స్క్రీన్ ప్లే తో ఒక పవర్ ప్యాక్ ఇంపాక్ట్ ఇచ్చే సినిమానైతే తీసి ప్రేక్షకుల ముందు ఉంచాడు. నిజానికి ఈ సినిమాలో దర్శకుడి యొక్క ప్రతిభ చాలా స్పష్టంగా కనిపించింది. మొదటి సినిమా కోసం ఇలాంటి ఒక ఛాలెంజింగ్ సినిమాని ఎంచుకొని చేయడం అనేది నిజంగా గొప్ప విషయం అనే చెప్పాలి. ఇక ఈ సినిమా డైరెక్టర్ కి మొదటి సినిమా అయినప్పటికీ తను ఎక్కడ తడబడకుండా సినిమాని చాలా రిచ్ గా తీసే ప్రయత్నం అయితే చేశాడు.
ఇక ఈ సినిమాలో కామెడీ తో పాటు ఎమోషనల్ సీన్స్ కూడా చాలా ముఖ్యపాత్రను పోషించాయి. సుహాస్ తనకు వ్యాధి ఉన్న కారణంగా ఎలాంటి ఇబ్బందులను ఎదుర్కొన్నాడు అనేది కూడా కళ్ళకు కట్టినట్టుగా చూపించారు. సుహస్ లాంటి ఒక టాలెంటెడ్ నటుడు తనకి దొరికితే డైరెక్టర్ కూడా ఎక్కడ తగ్గకుండా తన చేత ఒక అద్భుతమైన క్యారెక్టర్ ని చేయించి శభాష్ అనిపించుకున్నాడు… రైటింగ్ పరంగా సినిమా పీక్ లెవెల్ లో ఉన్నప్పటికీ కొన్ని సీన్స్ మాత్రం అక్కడక్కడ డల్ అయ్యాయి. వాటిని కూడా ఎంగేజింగ్ గా మార్చగలిగితే సినిమా సూపర్ డూపర్ సక్సెస్ అయ్యేది… ఇక కొన్ని సీన్లలో విజయ్ బుల్గానిన్ అందించిన బ్యాగ్రౌండ్ స్కోర్ అయితే అద్భుతంగా ఉంది…అయితే సెకండ్ హఫ్ లో కొన్ని సీన్లు రోటీన్ గా అనిపించాయి…
ఆర్టిస్టుల పర్ఫామెన్స్
ఇక ఆర్టిస్టుల పర్ఫామెన్స్ విషయానికొస్తే సుహాస్ ఈ సినిమా మొత్తాన్ని తన భుజాల మీద మోసాడనే చెప్పాలి. ఇంతకు ముందు సినిమాల్లో ఎలాంటి నటన అయితే కనబరిచాడో ఈ సినిమాలో అంతకుమించి నటించి ప్రేక్షకుల చేత శభాష్ అనిపించుకున్నాడు. ఇక హీరోయిన్ గా నటించిన పాయల్ రాధాకృష్ణ కూడా తనదైన పాత్ర మేరకు ఎక్కడ డివియేట్ అవ్వకుండా అద్భుతంగా నటించింది. కొన్ని సీన్లలో తను వైవిధ్యమైన నటనను చూపించి ఆకట్టుకుంటుందనే చెప్పాలి… ఇక వైవాహర్ష అక్కడక్కడ కామెడీ జల్లులు కురిపించాడు. ఇక రిషి సింగ్ తన పాత్ర లో ఎక్కడ తగ్గకుండా చాలా అద్భుతమైన పర్ఫామెన్స్ అయితే ఇచ్చింది. ఇక మిగిలిన ఆర్టిస్టులందరూ తమ పాత్రల పరిధి మేరకు ఓకే అనిపించారు…
టెక్నికల్ అంశాలు
ఇక టెక్నికల్ అంశాల విషయానికి వస్తే ఈ సినిమాలో మ్యూజిక్ అందించిన విజయ్ బుల్గానిన్ సాంగ్స్ విషయంలో కొంతవరకు పర్లేదు అనిపించినప్పటికీ బ్యాగ్రౌండ్ స్కోర్ తో మాత్రం కొన్ని సీన్లకు ప్రాణం పోసాడనే చెప్పాలి… ఇక ఎస్ చంద్రశేఖర్ అందించిన విజువల్స్ కూడా ఈ సినిమాకి చాలా వరకు ప్లస్ అయ్యాయి. ఇక కొన్ని సీన్లలో ఆయన పెట్టిన బ్లాక్స్ అయితే పెద్ద సినిమాలకు ఏమాత్రం తీసిపోని రేంజ్ లో ఉన్నాయనే చెప్పాలి… ఇక ఈ సినిమా అనేది ఇంత బాగా రావడానికి ఈ సినిమా టీం మొత్తం భారీ ఎఫర్ట్ పెట్టారనే విషయం చాలా స్పష్టంగా కనిపిస్తుంది…
ప్లస్ పాయింట్స్
సుహస్ యాక్టింగ్
కథ, స్క్రీన్ ప్లే
మైనస్ పాయింట్స్
కొన్ని సీన్లు లాగ్ అయ్యాయి..
సెకండ్ హాఫ్ లో కొన్ని సీన్లు మనం ఇంతకు ముందు కొన్ని సినిమాల్లో చూసినట్టుగా అనిపిస్తాయి..
రేటింగ్
ఇక ఈ సినిమాకు మేము ఇచ్చే రేటింగ్ 2.75/5
చివరి లైన్
ఫ్యామిలీ తో కలిసి ఈ వీకెండ్ లో ఈ సినిమా చూసి ఎంజాయ్ చేయవచ్చు…