Sreemukhi is going to become an item girl
Anchor Sreemukhi: యాంకర్ శ్రీముఖి ఓ క్రేజీ ఆఫర్ కొట్టేసిందట. ఇప్పటివరకు వెండితెరపై నటిగా పలు సినిమాల్లో అలరించింది శ్రీముఖి. అయితే మొదటిసారి సిల్వర్ స్క్రీన్ పై ఐటెం గర్ల్ గా మెరవనుందట. ఓ స్టార్ హీరో పక్కన ఐటెం సాంగ్ లో స్టెప్పులు వేసే ఛాన్స్ కొట్టేసిందట. ఈ మేరకు ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఆ వివరాలు ఏమిటో చూద్దాం. ప్రస్తుతం బుల్లితెరపై శ్రీముఖి దుమ్ములేపుతుంది. పలు ఛానల్స్ లో షోలు చేస్తూ ఫుల్ ఫార్మ్ లో ఉంది.
అటు సినిమాల్లోనూ అవకాశాలు దక్కించుకుంటుంది. అయినప్పటికీ సెలెక్టివ్ గా సినిమాలు చేస్తుంది. కథలో తన పాత్రకు ఉన్న ప్రాధాన్యతను బట్టి సినిమాలు ఎంచుకుంటుంది. ఇప్పటికే పలు సినిమాల్లో కీలక పాత్రల్లో నటించింది. శ్రీముఖి హీరోయిన్ గా కూడా ఒకటి రెండు చిత్రాలు చేయడం విశేషం. శ్రీముఖి గత ఏడాది భోళా శంకర్ చిత్రంలో నటించింది. చిరంజీవితో కొన్ని రొమాంటిక్ సన్నివేశాల్లో నటించి మెప్పించింది.
మరోసారి చిరంజీవితో శ్రీముఖి జత కట్టనుందట. అది కూడా ఐటెం సాంగ్ లో ఆయనతో కలిసి మాస్ స్టెప్స్ వేయనుందట. దర్శకుడు వశిష్ట తెరకెక్కిస్తున్న భారీ చిత్రం విశ్వంభర లో ఓ ఐటెం సాంగ్ ఉందట. ఈ సాంగ్ లో చిరంజీవికి జంటగా శ్రీముఖిని ఎంపిక చేశారట. ఈ మేరకు న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
కానీ దీనిపై ఎటువంటి అధికారిక సమాచారం లేదు. ఒకవేళ ఐటెం భామగా శ్రీముఖి కనుక సక్సెస్ అయితే .. ఆమెకు సిల్వర్ స్క్రీన్ పై ఆఫర్స్ వెల్లువెత్తుతాయి. అనసూయ మాదిరి బుల్లితెరకు గుడ్ బై చెప్పేసి… నటిగా సెటిల్ అయిపోయే అవకాశం లేకపోలేదు. ప్రస్తుతం టాలీవుడ్ టాప్ యాంకర్స్ లో శ్రీముఖి ఒకరు. స్టార్ మా పరివారం, నీతోనే డాన్స్ వంటి టాప్ రేటెడ్ షోల్లో సందడి చేస్తుంది.
Web Title: Sreemukhi is going to become an item girl
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com