Mahesh Babu Viral Pic: సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో సెలబ్రిటీలు వేసుకున్న డ్రెస్సులు కానీ, వాళ్ళు వాడుతున్న వస్తువులు గాని చాలా ఖరీదుతో కూడుకున్నవై ఉంటాయి. అందుకే వాళ్ళు వేసుకున్న ప్రతి డ్రెస్ కూడా దాని రేటు ఎంతుంటుంది అనేది తెలుసుకొని సోషల్ మీడియాలో అప్లోడ్ చేయడం వల్ల ఆయా బ్రాండ్ కున్న బ్రాండ్ వాల్యూ కూడా భారీగా పెరిగిపోతుందనే చెప్పాలి. ఇక ప్రస్తుతం మహేష్ బాబు తన ఇంట్లో తన పబ్లిసిస్ట్ విశ్వ, అలాగే తన భార్య అయిన నమ్రతలతో కలిసి ఒక ఫోటోనైతే దిగారు.
ఈ ఫోటోని సోషల్ మీడియాలో అప్లోడ్ చేశారు. అయితే ఈ ఫోటోలో మహేష్ బాబు ధరించిన టీ షర్టు ఖరీదు తెలిస్తే మాత్రం ప్రతి ఒక్కరు షాక్ అవుతారు.అయితే టీ షర్టు ఖరీదు 520 యూరో లు అంటే మన కరెన్సీ ప్రకారం అయితే 46,390.22 రూపాయలని తెలుస్తుంది. ఇక ఈ టి షర్ట్ ను “బెర్లుటీ ” అనే బ్రాండ్ వాళ్ళు రూపొందించారు.ఇది మరైన బ్లూ కలర్ లో ఉంది… అయితే ప్రస్తుతం ఈ టీ షర్టు వాల్యూ అనేది సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది.
ఇక మహేష్ బాబు లాంటి స్టార్ హీరో ఇలాంటి దుస్తులను ధరించడం వల్ల ఆయన అభిమానులు కూడా వాటిని వేసుకోవడానికి ఎక్కువగా ఆసక్తి చూపిస్తూ ఉంటారు. కాబట్టి ఆయన ఏది వేసుకున్నా కూడా అదొక ట్రెండ్ సెట్టర్ గా నిలుస్తుందని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. ఇక ఇది ఇలా ఉంటే ప్రస్తుతం మహేష్ బాబు రాజమౌళితో చేయబోయే సినిమా విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు.
ఇక ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ అల్యూమినియం ఫ్యాక్టరీలో స్టార్ట్ అయినప్పటికీ చాలా గోప్యంగా ఈ సినిమా షూటింగ్ అయితే కంప్లీట్ చేసే ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తుంది… అయితే ఈ సినిమాతో భారీ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాలని అటు రాజమౌళి, ఇటు మహేష్ బాబు ఇద్దరు కూడా భారీ కసరత్తులు చేస్తున్నారు…