Anti-BJP – Congress : గందరగోళంలో కాంగ్రెస్ బీజేపీ వ్యతిరేక ఐక్యతా రాగం

అయితే ప్రధానమంత్రి ఆధ్వర్యంలో జరిగే సమావేశానికి ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరవుతారా? లేదా? అనేది ఆసక్తికరంగా మారింది.. గందరగోళంలో కాంగ్రెస్ బీజేపీ వ్యతిరేక ఐక్యతా రాగంపై ‘రామ్’గారి సునిశిత విశ్లేషణను పైన వీడియోలో చూడొచ్చు.

  • Written By: Naresh
  • Published On:
Anti-BJP – Congress : గందరగోళంలో కాంగ్రెస్ బీజేపీ వ్యతిరేక ఐక్యతా రాగం

Anti-BJP – Congress : కాంగ్రెస్ చేపట్టిన బీజేపీ వ్యతిరేక ఐక్యతా రాగంలో ఆ స్పష్టత లేదు. అత్యంత గందరగోళంగా ఉంది. సిద్ధరామయ్య ప్రమాణ స్వీకారానికి వచ్చిన వాళ్లలో పట్టుమని పది సీట్లు తెచ్చేవాళ్లు లేరు. ఒక్క సీటు కూడా తెచ్చుకోని వారిని తీసుకొచ్చి ప్రతిపక్షాల ఐక్యత అంటూ చెప్పుకొచ్చారు. తమిళనాడు సీఎం స్టాలిన్ ను పిలిచి కేరళ సీఎం విజయన్ ను మరిచిపోయారు. అఖిలేష్ ను పిలిచి కేజ్రీవాల్, మాన్ ను పిలవలేదు. హేమంత్ సోరన్ ను పిలిచి నవీన్ పట్నాయక్ ను పిలవలేదు. దీంతో కాంగ్రెస్ లో ఐక్యత లేదని అర్తమైంది.

ప్రతిపక్ష పార్టీలకు చెందిన ముఖ్యమంత్రులు దేశ రాజధానిలో భేటీ కానున్నారు. ఎన్నికలకు మరో ఏడాది ఉండగానే భవిష్యత్తు రాజకీయాలపై చర్చించనున్నారు.. అయితే ఈ సమావేశానికి ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరవుతారా? లేదా? అనేది ఆసక్తికరంగా మారింది.

నిజానికి ఈనెల 27న వ్యవసాయం, ఆర్థిక వ్యవస్థ, ఆరోగ్యం వంటి అంశాలపై ప్రధానమంత్రి అధ్యక్షతన ముఖ్యమంత్రుల సమావేశం జరగనుంది. దీనికి హాజరుకానున్న బీజేపీయేతర పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు విడిగా సమావేశం కానున్నారు. వచ్చే ఏడాది జరిగే ఎన్నికలకు సంబంధించి తమ భవిష్యత్తు కార్యాచరణ పై చర్చించనున్నారు..

కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీతో గత నెలలో చర్చలు జరిపిన బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ఈ ముఖ్యమంత్రుల సమావేశానికి సారథ్యం వహించనున్నారు. ఇప్పటికే ఆయన ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్, ఇతర రాష్ట్రాల కిందన ప్రతిపక్ష ముఖ్యమంత్రులను కలుసుకున్నారు.

ఇటీవల ఆదివారం ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ను కూడా కలిశారు. ఢిల్లీ ప్రభుత్వ అధికారాలను కత్తిరిస్తూ కేంద్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ జారీ చేయడం.. దీనిపై అరవింద్ కేజ్రీవాల్ పోరాడుతుండడంతో ఆయనకు నితీష్ కుమార్ సంఘీభావం తెలిపారు. ఇక ఇదే కేజ్రీవాల్ మంగళవారం మమతా బెనర్జీతో కేటీ అయ్యారు.. భవిష్యత్తు రాజకీయాల మీద చర్చించారు. మమతా బెనర్జీ గురువారం ఢిల్లీ చేరుకుంటుంది. మూడు రోజుల పాటు ఆమె అక్కడే మకాం వేస్తుంది. వివిధ ప్రతిపక్ష పార్టీల నేతలతో సంప్రదింపులు జరుగుతుంది.. అయితే ప్రధానమంత్రి ఆధ్వర్యంలో జరిగే సమావేశానికి ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరవుతారా? లేదా? అనేది ఆసక్తికరంగా మారింది..

గందరగోళంలో కాంగ్రెస్ బీజేపీ వ్యతిరేక ఐక్యతా రాగంపై ‘రామ్’గారి సునిశిత విశ్లేషణను పైన వీడియోలో చూడొచ్చు.

సంబంధిత వార్తలు