KCR : అసెంబ్లీ ఎన్నికల్లో చిత్తుగా ఓడిపోయిన బీఆర్‌ఎస్ ప్రస్తుతం గడ్డు పరిస్థితి ఎదుర్కొంటోంది. వరుసగా నేతలు పార్టీని వీడుతున్నారు. ఈ క్రమంలో లోక్‌సభ ఎన్నికలు రావడంతో ఈ ఎన్నికల్లో ఓడిపోతే పరిస్థితి మరింద దారుణంగా మారే ప్రమాదం ఉంది. ఈ ముప్పును తప్పించేందుకు బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ రంగంలోకి దిగారు. క్యాడర్‌లో జోష్ నింపడంతోపాటు, కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టేందుకు బస్సు యాత్ర చేయాలని నిర్ణయించుకున్నారు.
24 నుంచి యాత్ర షురూ..
ఏప్రిల్ 24వ తేదీ నుంచి బస్సు యాత్ర మొదలు పెట్టనున్నారు. మే 10వ తేదీ వరకు ఈ యాత్ర సాగనుంది. యాత్రలో భాగంగా ముఖ్యమైన పట్టణాల్లో రోడ్‌షోలు నిర్వహించనున్నారు. మొత్తం 17 రోజులపాటు యాత్ర సాగుతుంది. ఇందులో 21 రోడ్ షోలు ఉండేలా షెడ్యూల్ రూపొందించారు. నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో రోడ్ షోతో కేసీఆర్ ఎన్నికల ప్రచారం ప్రారంభిస్తారు. మే 10వ తేదీన సిద్దిపేటలో జరిగే సభతో యాత్ర ముగుస్తుంది. వేసవి నేపథ్యంలో రోడ్‌షో సాయంత్రం 5 గంటల తర్వాత నిర్వహించేలా ప్లాన్ చేశారు.
ప్రణాళిక ఇలా..
కేసీఆర్ బస్సు యాత్ర సాగే రూట్లలో ఉదయం స్థానిక పరిస్థితులకు అనుగుణంగా రైతుల పొలాలు, కల్లాలు, ధాన్యం కొనుగోలు కేంద్రాలు సందర్శించేలా ప్రణాళిక రూపొందిస్తున్నారు. సాయంత్రం రోడ్‌షో తర్వాత బస చేసే ప్రాంతాల్లో విద్యార్థులు, యువత, మహిళలు, మైనారిటీలు, వివిధ సామాజిక వర్గాలతో కేసీఆర్ భేటీ అయ్యే అవకాశం ఉంది.
ఐదు నియోజవర్గాల్లో సభలు..
ఇక కేసీఆర్ యాత్రలో ఆదిలాబాద్, చేవెళ్ల, మల్కాజ్‌గిరి, సికింద్రాబాద్, హైదరాబాద్ నియోజకవర్గాలు లేవు. నేపథ్యంలో ఆయా నియోజకవర్గాలు కవర్ అయ్యేలా ఉమ్మడి వరంగల్, ఖమ్మం, మహబూబ్‌నగర్, ఆదిలాబాద్ జిల్లాల పరిధిలో బహిరంగ సభలు నిర్వహించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇక హైదరాబాద్ లోక్‌సభ పరిధిలో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్‌రావుల రోడ్‌షోలు ఉంటాయని సమాచారం.
షెడ్యూల్ ఇదీ..
ఏప్రిల్ 24 నుంచి మే 10 వ తేదీ వరకు కేసీఆర్ బస్సుయాత్ర సాగుతుంది. ఆయా రోజుల్లో సాయంత్రం 5.30 నుంచి ఏడు గంటల మధ్య రోడ్ షోలు.. మిగతా సమయాల్లో రైతులను, వివిధ వర్గాల వారిని కలుస్తారు. ఏప్రిల్ 24న మిర్యాలగూడ, సూర్యాపేటలలో, 25న భువనగిరిలో, 26న మహబూబ్‌నగర్‌లో, 27న నాగర్‌కర్నూల్‌లో, 28న వరంగల్‌లో, 29న ఖమ్మంలో, 30న తల్లాడ, కొత్తగూడెంలలో రోడ్‌షోలు ఉంటాయి. మే 1న మహబూబాబాద్‌లో, 2న జమ్మికుంటలో, 3న రామగుండంలో, 4న మంచిర్యాలలో, 5న జగిత్యాలలలో, 6న నిజామాబాద్‌లో, 7న కామారెడ్డి, మెదక్‌లలో, 8న నర్సాపూర్, పటా¯Œ చెరులలో, 9న కరీంనగర్‌లో, 10న సిరిసిల్లలో రోడ్ షోలు నిర్వహించనున్నారు. చివరిగా 10వ తేదీన సిద్దిపేటలో బహిరంగ సభ నిర్వహిస్తారు.
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News. He has more than 17 years experience in Journalism.
Read MoreWeb Title: Kcr bus yatra route map finalized
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com