T20 World Cup 2024: ఉత్కంఠకు తెరపడింది. సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారానికి ఎట్టకేలకు బిసిసిఐ ఫుల్ స్టాప్ పెట్టింది. జూన్ 2 నుంచి మొదలయ్యే టి20 వరల్డ్ కప్ నకు భారత క్రికెట్ బోర్డు జట్టును ప్రకటించింది.. అజిత్ అగార్కర్ నేతృత్వంలో చీఫ్ సెలక్షన్ కమిటీ జట్టు సభ్యులను ఎంపిక చేసింది. జూన్ రెండు నుంచి ప్రారంభమయ్యే టి20 వరల్డ్ కప్ కు అమెరికా, వెస్టిండీస్ దేశాలు సంయుక్తంగా ఆతిథ్యం ఇస్తున్నాయి. భారత్ తన తొలి మ్యాచ్ జూన్ 5న ఐర్లాండ్ తో తలపడనుంది. తొలి మ్యాచ్లో ఆతిధ్య అమెరికా కెనడా ఆడనున్నాయి. ఇక సుదీర్ఘ ప్రత్యర్థులైన భారత్, పాకిస్తాన్ న్యూయార్క్ వేదికగా జూన్ 9న తలపడతాయి. టి20 వరల్డ్ కప్ లో మొత్తం 20 జట్లు పాల్గొంటున్నాయి. అమెరికాలో 3, వెస్టిండీస్ లో ఆరు వేదికల్లో మొత్తం 55 మ్యాచ్ లను ఐసీసీ నిర్వహించనుంది. లీగ్, సెమీఫైనల్ అనంతరం ఫైనల్ మ్యాచ్ జూన్ 29న నిర్వహించనుంది.
అవకాశం దక్కింది వీరికే
ఇక టి20 వరల్డ్ కప్ ఆడే భారత జట్టులో ఈసారి కాస్త వైవిధ్యాన్ని ప్రదర్శించినట్టు కనిపిస్తోంది. గత ఇంగ్లాండ్ సిరీస్లో అద్భుతంగా ఆడిన యశస్వి జైస్వాల్ కు టీమిండియా సెలక్షన్ కమిటీ చోటు కల్పించింది. ఐపీఎల్ లో అద్భుతంగా ఆడుతున్న విరాట్ కోహ్లీకి అవకాశం ఇచ్చింది. గత కొద్దిరోజులుగా క్రికెట్ కు దూరంగా ఉన్నప్పటికీ.. ఇటీవల ఐపీఎల్ లో ముంబై జట్టుకు ఆడుతున్న సూర్య కుమార్ యాదవ్ కూడా అవకాశం దక్కింది. రోడ్డు ప్రమాదానికి గురై దాదాపు సంవత్సరంన్నర వరకు ఆసుపత్రికి పరిమితమైన రిషబ్ పంత్ కు చోటు లభించింది. రాజస్థాన్ కెప్టెన్ గా ఈ ఐపీఎల్ లో అద్భుతాలు చేస్తున్న సంజు సాంసన్ కు కూడా ఆపర్చునిటీ లభించింది. ఆకాశమేహద్దుగా చెలరేగుతున్న శివం దుబేకు, బంతితో మాయాజాలం చేసే సత్తా ఉన్న రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్ కు స్థానం లభించింది. ముంబై జట్టు కెప్టెన్ గా పెద్దగా ఆడకపోయినప్పటికీ హార్థిక్ పాండ్యాకు జట్టులో చోటు దక్కింది. స్పిన్ బౌలింగ్ కు సరికొత్త అర్థం చెబుతున్న కులదీప్ యాదవ్, యజువేంద్ర చాహల్, వేగవంతమైన బంతులతో ప్రత్యర్థులను ముప్పు తిప్పలు పెట్టగల అర్ష్ దీప్ సింగ్, జస్ ప్రీత్ బుమ్రా, మహమ్మద్ సిరాజ్ కు అవకాశం లభించింది. ఇక ట్రావెల్ రిజర్వ్ ఆటగాళ్లుగా శుభ్ మన్ గిల్, రింకూ సింగ్, ఖలీల్ అహ్మద్, ఆవేశ్ ఖాన్ కు అవకాశం కల్పించింది.
ఐపీఎల్ లో లక్నో జట్టు కెప్టెన్ గా అదరగొడుతున్న కె.ఎల్ రాహుల్ కు ఈ ఐపీఎల్లో చోటు దక్కలేదు. అద్భుతంగా ఆడుతున్న రియాన్ పరాగ్ ను సెలక్టర్లు పట్టించుకోలేదు. రింకూ సింగ్, గిల్ కేవలం రిజర్వు ఆటగాళ్లు మాత్రమే. హైదరాబాద్ జట్టు తరఫున పరుగుల వరద పారిస్తున్న అభిషేక్ శర్మకు అవకాశం ఇవ్వలేదు. మీరు మాత్రమే కాదు ఐపీఎల్ లో సంచలనాలు సృష్టిస్తున్న శశాంక్ సింగ్, తిలక్ వర్మ, రుతు రాజ్ గైక్వాడ్ ను బీసీసీఐ సెలెక్టర్లు పట్టించుకోకపోవడం విశేషం.
India’s squad for ICC Men’s T20 World Cup 2024 announced
Let’s get ready to cheer for #TeamIndia #T20WorldCup pic.twitter.com/jIxsYeJkYW
— BCCI (@BCCI) April 30, 2024