HomeతెలంగాణVenkatesh: జాతీయ పార్టీలకు ప్రచారం చేయనున్న విక్టరీ వెంకటేష్

Venkatesh: జాతీయ పార్టీలకు ప్రచారం చేయనున్న విక్టరీ వెంకటేష్

దగ్గుబాటి రామానాయుడు కుటుంబం చాలా రోజులపాటు రాజకీయాల్లో కొనసాగింది. రామానాయుడు టిడిపి తరఫున ఎంపీగా కూడా పదవి చేపట్టారు. అయితే ఉన్నపలంగా ఒకసారి రాజకీయాల నుంచి రామానాయుడు తప్పుకున్నట్లు ప్రకటించారు.

Venkatesh: ఏపీలో రాజకీయాలు శరవేగంగా మారుతున్నాయి. ఇప్పటికే నామినేషన్ల పర్వం పూర్తయింది. అభ్యర్థులు జోరుగా ప్రచారం చేస్తున్నారు. అధికార వైసిపి ఒకవైపు, టిడిపి, జనసేన, బిజెపి కూటమి మరోవైపు ప్రచార హోరును పెంచాయి. షర్మిల నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీ సైతం పెద్ద ఎత్తున ప్రచారం చేస్తోంది. పవన్ కు మద్దతుగా మెగా కాంపౌండ్ వాల్ నుంచి హీరోలు ప్రచారంలోకి వస్తారని ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే నాగబాబు తో పాటు జబర్దస్త్ నటులు పవన్ కోసం పిఠాపురంలో ప్రచారం చేస్తున్నారు. సరిగ్గా ఇటువంటి తరుణంలోనే విక్టరీ వెంకటేష్ ఏపీలో ఎన్నికల ప్రచారానికి రెడీ అవుతున్నట్లు సమాచారం.

దగ్గుబాటి రామానాయుడు కుటుంబం చాలా రోజులపాటు రాజకీయాల్లో కొనసాగింది. రామానాయుడు టిడిపి తరఫున ఎంపీగా కూడా పదవి చేపట్టారు. అయితే ఉన్నపలంగా ఒకసారి రాజకీయాల నుంచి రామానాయుడు తప్పుకున్నట్లు ప్రకటించారు. అప్పటినుంచి ఆయన కానీ.. ఆయన కుటుంబ సభ్యులు కానీ ఎన్నడూ రాజకీయాలు చేయలేదు. అయితే ఈ ఎన్నికల్లో మాత్రం ఏపీతో పాటు తెలంగాణలో విక్టరీ వెంకటేష్ ప్రచారం చేస్తారని తెలుస్తోంది. అయితే ఏపీలో ఒక పార్టీకి, తెలంగాణలో మరో పార్టీకి ప్రచారం చేయనున్నట్లు సమాచారం.

తెలంగాణలోని ఖమ్మం లోక్ సభ నియోజకవర్గం నుంచి రామ సహాయం రఘురామిరెడ్డి కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేస్తున్నారు. ఆయన వెంకటేష్ పెద్ద కుమార్తె ఆశ్రితకు స్వయానా మామ. ఆయన కుమారుడు వినాయక రెడ్డిని ఆశ్రిత పెళ్లి చేసుకున్నారు. వియ్యంకుడి కోసం ఖమ్మం పార్లమెంట్ స్థానం పరిధిలో వెంకటేష్ ఒకరోజు ప్రచారం చేయడానికి రెడీ అయినట్లు తెలుస్తోంది. అటు ఏపీలో సైతం ఒక రోజు పాటు కూటమికి మద్దతుగా ప్రచారం చేయాలని వెంకటేష్ స్ట్రాంగ్ గా డిసైడ్ అయినట్లు తెలుస్తోంది.

కూటమి అభ్యర్థిగా కామినేని శ్రీనివాస్అసెంబ్లీ స్థానానికి పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే.ఈయన మాజీ మంత్రి. వెంకటేష్ భార్య నీరజకు స్వయానా మేనమామ. కృష్ణాజిల్లా కైకలూరు నుంచి పోటీ చేస్తున్నారు. ఆయన అభ్యర్థన మేరకు ఒకరోజు వెంకటేష్ కైకలూరులో ఎన్నికల ప్రచారం చేయనున్నారు. మొత్తానికైతే చాలా రోజుల తర్వాత వెంకటేష్ రాజకీయ వేదికలపై కనిపించనున్నారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి, ఏపీలో కూటమి అభ్యర్థులకు ఓటు వేయాలని అభిమానులకు స్పష్టమైన సంకేతాలను పంపించనున్నారు.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

Related News

Most Popular

Oktelugu Epaper