Prabhas: ప్రస్తుతం ప్రభాస్ కల్కి సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నాడు. అయితే ఈ సినిమా షూటింగ్ పూర్తయినప్పటికీ చిన్న చిన్న ప్యాచ్ వర్క్ లు గానీ డబ్బింగ్ పనులు గానీ చూసుకుంటూ ప్రభాస్ ఈ సినిమా కి మరి కొన్ని డేట్స్ అయితే ఇచ్చాడట. ఇక దానికి తగ్గట్టుగానే ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులను కూడా ప్రభాస్ దగ్గరుండి మరీ చూసుకుంటున్నాడట.
ఇక ఈ సినిమా వర్క్ మొత్తం పూర్తి చేసి తన తదుపరి సినిమా ఆయన రాజా సాబ్ సినిమాను కూడా తొందరగా ఫినిష్ చేసి ఈ సినిమాని కూడా ఈ సంవత్సరమే రిలీజ్ చేయాలనే ఆలోచనలో అయితే ప్రభాస్ ఉన్నాడట. ఇక ఇదిలా ఉంటే ప్రభాస్ రాజమౌళితో ఎప్పుడైతే బాహుబలి సినిమా చేశాడో అప్పటినుంచి నార్త్ ఆడియన్స్ లో తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను అయితే క్రియేట్ చేసుకున్నాడు. ఇక దానికి తగ్గట్టుగానే అక్కడున్న ప్రతి ప్రేక్షకుడు కూడా అక్కడ లోకల్ గా ఉన్న హీరోలను పక్కన పెట్టేసి మరి ప్రభాస్ కి వీరాభిమానులుగా మారిపోయారు.
ఇక దీంతో బాలీవుడ్ హీరోలందరికీ ఏం చేయాలో అర్థం కావడం లేదు. అందుకే వాళ్ళు ఎలాంటి సినిమాలు చేసిన అక్కడి జనాలను మెప్పించలేకపోతున్నారు. ఇక ఒక్కసారి తెలుగు సినిమా స్టైల్ కి అలవాటు పడిపోయిన అక్కడి ప్రేక్షకులు మనవాళ్లు చేసే సినిమాలను మాత్రమే ఎక్కువగా ఆదరిస్తున్నారు. ఇక ఇప్పుడు బాలీవుడ్ హీరోలకి ఎలాంటి సినిమాలు చేయాలో అర్థం కావడం లేదు. అందువల్లే ఇప్పుడున్న ప్రతి ఒక్క బాలీవుడ్ హీరో ప్రభాస్ ని అనుకరిస్తూ సినిమాలను తెరపైకి తెచ్చే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఇక అందులో భాగంగానే వాళ్లు భారీ సక్సెస్ లు కొట్టాలంటే యాక్షన్ సినిమాలే బెస్ట్ అని నమ్ముతున్నారు.
ఇక కొందరు హీరోలైతే ప్రభాస్ చేసే జానర్ సినిమాలను ఎంచుకోవడమే కాకుండా కొన్ని సీన్లలో ప్రభాస్ ని ఇమిటేట్ కూడా చేస్తూ నటిస్తున్నారనే విమర్శలను కూడా ఎదుర్కొంటున్నారు. ఇక మొత్తానికైతే తెలుగు సినిమా హీరో ని బాలీవుడ్ హీరోలు ఇమిటేట్ చేస్తూ సినిమాలు చేస్తున్నారనే చెప్పాలి…