Saanve Megghana: జనరేషన్ మారింది. తెలుగు అమ్మాయిలు కూడా సినిమాల వైపు వచ్చేస్తున్నారు. ఈ మధ్య కాలంలో హీరోయిన్లుగా ప్రయత్నాలు చేస్తున్న ప్రతి నలుగురిలో ఇద్దరు తెలుగు అమ్మాయిలే. అంతగా తెలుగు లోగిళ్లలో సినిమా వాతావరణం వంట బట్టింది. ఎన్నో కష్టాలు మరెన్నో ఇబ్బందులను దాటుకుని మరో తెలుగు అమ్మాయి తెలుగు వెండితెర పై మొదటిసారి ఓ మెయిన్ లీడ్ క్యారెక్టర్ చేస్తుంది. ఆమె పేరే ‘శాన్వి మేఘన’.
‘శాన్వి మేఘన’ (Saanve Megghana) నిజానికి పదేళ్ల నుంచే ఇండస్ట్రీలో ఉంది. ఆమె గతంలో చాలా సినిమాల్లో నటించింది. “బిలాల్ పూర్ పోలీస్ స్టేషన్”, “పిట్ట కథలు”, “సైరా నరసింహారెడ్డి”, “మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్” ఇలా చెప్పుకోతగ్గ సినిమాల్లో నటించినా.. ఆమెకు చెప్పుకోతగ్గ పాత్రలు మాత్రం దక్కలేదు. దాంతో చాలా చిత్రాలు చేసినా శాన్వి మేఘనకు గుర్తింపు రాలేదు.
అయితే, ఈ వీకెండ్ విడుదలవుతున్న “పుష్పక విమానం”తో ఒక్కసారిగా ఆమె వెలుగులోకి వచ్చింది. ఒక హీరోయిన్ గా తనకంటూ కనీస గుర్తింపు సంపాదించుకుంది. మరి ‘శాన్వి మేఘన’ గురించి కొన్ని విషయాలు ముచ్చటించుకుందాం. ఆమె పక్కా హైదరాబాద్ అమ్మాయి. ఆమెకు మొదటి అవకాశం ఎవరు ఇచ్చారో తెలుసా ? సహజ నటి జయసుధ.
టీవీ కార్యక్రమం కోసం జయసుధ గారు ‘శాన్వి మేఘన’కు అవకాశం ఇచ్చారు. జయసుధ ఆ టీవీ ప్రోగ్రాంకి నిర్మాత. ఇక శాన్వి కెరీర్ ను మలుపు తిప్పిన వ్యక్తి మాత్రం తరుణ్ భాస్కరే. తరుణ్ భాస్కర్ నెట్ ఫ్లిక్స్ కోసం పిట్ట కథలు అనే ఒక వెబ్ సిరీస్ చేశాడు. ఆ వెబ్ సిరీస్ కోసం ఆడిషన్ ఇచ్చింది ‘శాన్వి మేఘన’. అది నచ్చి తరుణ్ భాస్కర్ “పుష్పక విమానం” సినిమాకు ‘శాన్వి మేఘన’ను రిఫర్ చేశాడు. కాదు, దగ్గర ఉండి అవకాశం ఇప్పించాడు.
“పుష్పక విమానం” సినిమాతో ఆమెకు మంచి గుర్తింపు వచ్చింది. అన్నట్టు ఈ సినిమాలో ఆమె షార్ట్ ఫిల్మ్ హీరోయిన్ క్యారెక్టర్ లో నటించింది. ఆమె క్యారెక్టర్ రెగ్యులర్ హీరోయిన్ క్యారెక్టర్ లా ఉండదు అట. ఆమె పాత్ర కథలో సహజంగా ప్లే అవుతూ సాగుతుందట.