Pawan Kalyan Chiranjeevi Clash : సినిమా ఇండస్ట్రీలో మెగా ఫ్యామిలీ కి ఒక ప్రత్యేక స్థానం ఉందనే చెప్పాలి. ఇక తెలుగు సినిమా ఇండస్ట్రీ మొత్తంలో ఈ ఫ్యామిలీకి ఉన్న క్రేజ్ వేరే ఏ ఫ్యామిలీ కి లేదనే చెప్పాలి. ఎందుకంటే ఈ ఫ్యామిలీలో కీలక మైన హీరోగా మెగాస్టార్ చిరంజీవి ఉన్నాడు. ఈయన చేసిన చాలా సినిమాలో అప్పట్లో మంచి విజయాలను అందుకోవడమే కాకుండా దాదాపు 35 సంవత్సరాల నుంచి ఇండస్ట్రీలో మెగాస్టార్ గా కొనసాగుతున్న ఒకే ఒక్కడు చిరంజీవి తన స్థాయి ని తారాస్థాయిలో నిలిపాడు.
ఇక ఇదిలా ఉంటే చిరంజీవి తమ్ముడు గా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన పవన్ కళ్యాణ్ కూడా మంచి సక్సెస్ లను అందుకొని పవర్ స్టార్ గా గుర్తింపు సంపాదించుకున్నాడు. అయితే పవన్ కళ్యాణ్ కి చిరంజీవికి మధ్య ఒక సినిమా విషయంలో చిన్నగా క్లాషేష్ వచ్చినట్టుగా తెలుస్తుంది. ముఖ్యంగా ఒక డైరెక్టర్ వల్ల గొడవ వచ్చిందని చాలా క్లారిటీగా తెలుస్తుంది. అయితే ఈ డైరెక్టర్ ఎవరంటే తమిళ్ సినిమా ఇండస్ట్రీకి చెందిన ఎస్ జె సూర్య అని తెలుస్తుంది.
ఎస్ జె సూర్య పవన్ కళ్యాణ్ కి ఖుషి లాంటి ఒక బ్లాక్ బాస్టర్ హిట్ సినిమాని అందించాడు. ఇక ఎస్ జే సూర్య అజిత్ ని హీరోగా పెట్టీ తీసిన వాలి సినిమాని కూడా తెలుగులో పవన్ కళ్యాణ్ తో రీమేక్ చేయాలని అనుకున్నాడు కానీ అది కుదరలేదు. ఇక దాంతో వాలీ సినిమాని తెలుగులో డబ్ చేసి మంచి విజయాన్ని అందుకున్నాడు. అజిత్ వాలీ సినిమాలో నటించి మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు. ఇక నిజానికి పవన్ కళ్యాణ్ ఈ సినిమా చేద్దామని ఇంట్రెస్ట్ చూపించినప్పటికీ చిరంజీవి మాత్రం ఒప్పుకోలేదు కారణం ఏంటి అంటే ఈ సినిమాలో హీరో విలన్ క్యారెక్టర్లు రెండు కూడా అజిత్ పోషించాడు.
ఇక ఆ రెండు క్యారెక్టర్ లు పవన్ కళ్యాణ్ చేయడం కరెక్ట్ కాదు అని చిరంజీవి ఈ సినిమాని చేయవద్దని పవన్ కళ్యాణ్ కి సలహాలు ఇచ్చాడు.ఎందుకంటే ఒక స్టార్ హీరో విలన్ గా కనిపించడం కరెక్ట్ కాదు దాని వల్ల పవన్ కళ్యాణ్ కెరియర్ దెబ్బ తినే ప్రమాదం ఉందని చిరంజీవి అలా చెప్పాడు.ఇక దీంతో పవన్ కళ్యాణ్ కి ఆ సినిమా చేయాలని చాలా ఇంట్రెస్ట్ ఉన్నప్పటికీ చిరంజీవి మీద ఉన్న గౌరవంతో ఈ సినిమాని వదిలేసాడు.
నిజానికి ఆ సినిమాని వదిలేయడం పవన్ కళ్యాణ్ కి ఇష్టం లేదు అందుకే ఆ సినిమాని వదిలేయమని చిరంజీవి చెప్పినప్పుడు ఆయనతో కొద్దిసేపు పవన్ కళ్యాణ్ ఆర్గ్యు చేసినట్టుగా కూడా వార్తలైతే వచ్చాయి కానీ చిరంజీవి ఎంత మాత్రం కన్విన్స్ అవ్వకపోవడం తో పవన్ కళ్యాణ్ కొద్దిరోజుల పాటు చిరంజీవి మీద అలిగి కొద్ది రోజులు ఆయనతో మాట్లాడలేదు అంటూ వార్తలైతే వచ్చాయి. అలా ఎస్ జే సూర్య మీరు ఈ సినిమా చేయండి అని చాలా సార్లు వెంట పడటం తో పవన్ కళ్యాణ్ కి చిరంజీవికి మధ్య గొడవ జరిగిందని అప్పట్లో పెద్ద దుమారమైతే రేగింది…