India Legends VS Pakistan Legends : క్రికెట్ లో ఈ ఫార్మాటైనా సరే.. ప్రత్యర్థి జట్టుగా పాకిస్తాన్ ఉంటే చాలు టీమిండియా రెచ్చిపోతుంది. ఆకాశమే హద్దుగా చెలరేగిపోతుంది. చివరికి స్వల్ప స్కోర్ చేసిన సరే మ్యాచ్ ను కాపాడుకుంటుంది. జాతీయ జట్టు మాత్రమే కాదు.. వెటరన్ జట్టు కూడా పాకిస్తాన్ పై అదే ట్రెండ్ కొనసాగించింది.
యువరాజ్ సింగ్ ఆధ్వర్యంలో..
యువరాజ్ సింగ్ నాయకత్వంలో ఇండియా చాంపియన్స్ జట్టు వరల్డ్ ఛాంపియన్ షిప్ ఆఫ్ లెజెండ్స్ 2024 కప్ కైవసం చేసుకుంది. చిరకాల ప్రతీది పాకిస్తాన్ జట్టుతో జరిగిన ఫైనల్ మ్యాచ్లో భారత లెజెండరీ క్రికెటర్లు సూపర్బ్ ఆట తీరు ప్రదర్శించారు. పాకిస్తాన్ జట్టును దారుణంగా ఓడించారు.. ఈ గ్రాండ్ విక్టరీ సాధించిన తర్వాత యువరాజ్ సింగ్, హర్భజన్ సింగ్, సురేష్ రైనా.. విభిన్నంగా విజయాన్ని ఆస్వాదించారు. వేడుకలను వెరైటీగా జరుపుకున్నారు. వాటికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ సందడి చేస్తోంది. వాస్తవానికి ఆ వేడుకలకు అర్థం ఏమిటో తెలియక పోయినప్పటికీ.. పాకిస్తాన్ జట్టు పైన విజయం సాధించిన నేపథ్యంలో టీమిండియా ఆటగాళ్లు అలా సెటైరికల్ గా సెలబ్రేషన్ చేసుకున్నారని సోషల్ మీడియాలో వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.
పాకిస్తాన్ పై గెలిచిన తర్వాత..
హోరాహోరీగా సాగిన ఫైనల్ మ్యాచ్లో పాకిస్తాన్ పై గెలిచిన తర్వాత టీమిండియా మైదానంలో ఘనంగా వేడుకలు జరుపుకుంది. ఆ తర్వాత డ్రెస్సింగ్ రూమ్ లోకి వచ్చిన తర్వాత భారత క్రికెటర్లు సురేష్ రైనా, హర్భజన్ సింగ్, యువరాజ్ సింగ్ సరి కొత్తగా హావ భావాలను ప్రదర్శించడం మొదలుపెట్టారు. దెబ్బలు తగిలినప్పుడు నడిచే వారిలా, వృద్ధుల మాదిరి డోర్ తీసుకొని డ్రెస్సింగ్ రూమ్ లోకి ప్రవేశించారు. ఒక్కొకరు ఒక్కో తీరుగా నడుచుకుంటూ రావడంతో సోషల్ మీడియాలో నవ్వుల పువ్వులు పూస్తున్నాయి. లెజెండరీ క్రికెటర్ల ఎక్స్ ప్రెషన్స్ చూసి అభిమానులు నవ్వుకుంటున్నారు.
వారికి కౌంటర్ గానేనా..
టీమిండియా ఆటగాళ్ల సెలబ్రేషన్స్ పాకిస్తాన్ జట్టు ఆటగాళ్లను ఉద్దేశించేనని సోషల్ మీడియాలో అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. ఎందుకంటే పాకిస్తాన్ జట్టులో ఆటగాళ్లు తరచు గాయపడుతూ మ్యాచ్ లకు దూరంగా ఉంటారు. సరైన ఫిట్ నెస్ కూడా వారికి ఉండదు. పైగా లావుగా ఉన్న ఆటగాళ్లను ఆ జట్టు మేనేజ్మెంట్ వివిధ పోటీలకు ఎంపిక చేస్తుంది. అందువల్లే టీమిండియా ఆటగాళ్లు వారిపై సెటైరికల్ గా నడిచినట్టు తెలుస్తోంది. టి20 వరల్డ్ కప్ గెలిచినప్పుడు టీం ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ కూడా ఇలా వెరైటీగా నడిచి వచ్చి అందుకున్నాడు. దాన్ని అనుకరించేందుకు టీమిండియా లెజెండరీ ఆటగాళ్లు ఇలా హాస్యాన్ని పండించి ఉంటారని అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ యువి, భజ్జీ, రైనా పలికించిన హావభావాలు నవ్వు తెప్పిస్తున్నాయి.
ఫైనల్ మ్యాచ్లో..
శనివారం జరిగిన ఫైనల్ మ్యాచ్ లో పాకిస్థాన్ పై భారత్ ఘనవిజయం సాధించింది.. ముందుగా బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ జట్టు 20 ఓవర్లను పూర్తిస్థాయిలో ఆడి 156 రన్స్ చేసింది. షోయబ్ మాలిక్ 41, కమ్రాన్ అక్మల్ 24, సోహైల్ తన్వీర్ 19 పరుగులు చేసి ఆకట్టుకున్నారు. భారత బౌలర్లలో అనురీత్ సింగ్ 3 వికెట్లు దక్కించుకున్నాడు. నేగి, ఇర్ఫాన్ పఠాన్ తలా ఒక వికెట్ సాధించారు. 157 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా 19.1 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 159 పరుగులు చేసి విజేతగా నిలిచింది. మొత్తానికి ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించింది. అంబటి రాయుడు 50, గురుక్రీత్ 34, యూసఫ్ పఠాన్ 30 పరుగులు చేసి సత్తా చాటారు. డేరింగ్ డాషింగ్ బ్యాటింగ్ కు పేరుపొందిన యువరాజ్ సింగ్ ఫైనల్ మ్యాచ్ లో నిదానంగా ఆడడం విశేషం.
Winning celebrations from Yuvraj Singh, Harbhajan and Raina. pic.twitter.com/mgrcnd8GpH
— Mufaddal Vohra (@mufaddal_vohra) July 14, 2024
Bhaskar Katiki is the main admin of the website
View Author's Full InfoWeb Title: India legends vs pakistan legendsindian players raggining the pakistan players in legends champions trophy