Rohith Sharma : టి20 వరల్డ్ కప్ లో టీమిండియా విజేతగా నిలిచింది. 17 సంవత్సరాల తర్వాత మరోసారి ట్రోఫీని దక్కించుకుంది. కీలకమైన సూపర్ -8 లో ఆస్ట్రేలియా, సెమీ ఫైనల్ లో ఇంగ్లాండ్ పై కెప్టెన్ రోహిత్ శర్మ కీలక ఇన్నింగ్స్ లు ఆడాడు. ఫైనల్ మ్యాచ్లో దక్షిణాఫ్రికా తో త్వరగానే అవుట్ అయినప్పటికీ.. జట్టు ఆటగాళ్లలో స్ఫూర్తినింపడంలో రోహిత్ విజయవంతమయ్యాడు. ఫలితంగా టీమిండియా టి20 వరల్డ్ కప్ సాధించింది. ఈ నేపథ్యంలో రోహిత్ పొట్టి ఫార్మాట్ కు గుడ్ బై చెప్పాడు. దీంతో అభిమానులు మొత్తం నిర్వేదంలో మునిగిపోయారు.
రోహిత్ ప్రకటన చేసిన నాటి నుంచి..
రోహిత్ శర్మ ఆ ప్రకటన చేసిన నాటి నుంచి అభిమానులు ఒకింత నిరాశలో మునిగిపోయారు. వారికి రోహిత్ ఒక శుభవార్త చెప్పాడు.. ఆదివారం ఓ ప్రైవేట్ పార్టీలో రోహిత్ పాల్గొన్నాడు. ఈ సందర్భంగా అతను మాట్లాడుతూ.. మరింతకాలం క్రికెట్ ఆడతానంటూ ప్రకటించాడు. దీంతో అభిమానులు పండగ చేసుకుంటున్నారు. వాస్తవానికి రోహిత్ టి20 ఫార్మాట్ కు వీడ్కోలు పలికినప్పుడు చాలామంది.. మిగతా ఫార్మాట్లకు కూడా గుడ్ బై చెబుతాడనుకున్నారు. అతడి రిటైర్మెంట్ పై క్రికెట్ విశ్లేషకులు రకరకాల వ్యాఖ్యానాలు చేశారు. అయితే రోహిత్ వన్డే, టెస్ట్ ఫార్మాట్లలో కెప్టెన్ గా కొనసాగుతాడని బీసీసీఐ సెక్రటరీ జై షా ప్రకటించడం అభిమానులకు కాస్త వేసలుబాటు కలిగించింది.
రోహిత్ తో పాటు..
రోహిత్ తో పాటు విరాట్ కోహ్లీ కూడా చాలా కాలం పాటు క్రికెట్ ఆడే అవకాశాలు ఉన్నాయి. రోహిత్ కెరియర్ లో వన్డే వరల్డ్ కప్, వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ లను టీమిండియా దక్కించుకోలేదు. రోహిత్ ఆధ్వర్యంలో గత ఏడాది స్వదేశంలో జరిగిన వన్డే వరల్డ్ కప్ ఫైనల్ లో భారత్ ఓడిపోయింది. ఈ వెలితి రోహిత్ ను వెంటాడుతోంది. టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ లో కూడా భారత్ ఓటమి పాలు కావడం రోహిత్ ను కుంగదీస్తోంది. వచ్చే ఏడాదిలో ఐసీసీ చాంపియన్ ట్రోఫీ, వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్స్ టోర్నీ ఉంది. ఈ రెండిట్లో భారత జట్టును విజేతగా నిలిపి.. 2027లో జరిగే వన్డే వరల్డ్ కప్ లోనూ టీమిండియాను విన్నర్ గా నిలిపి.. అన్ని ఫార్మాట్లకు రోహిత్ గుడ్ బై చెబుతాడని అతని అభిమానులు అంచనా వేస్తున్నారు. మరోవైపు సుదీర్ఘకాలం క్రికెట్ ఆడతానని రోహిత్ చెప్పడంతో అభిమానులు ఖుషి అవుతున్నారు.
టి20 వరల్డ్ కప్ గెలిచిన తర్వాత..
టి20 వరల్డ్ కప్ గెలిచిన తర్వాత రోహిత్ శర్మ బార్బ డోస్ వేదికపై రోహిత్ ఉద్వేగానికి గురయ్యాడు. మైదానంపై ఐదారు నాక్ లు కొట్టాడు. అనంతరం మైదానంపై ఉన్న పచ్చి గడ్డిని తిన్నాడు. ట్రాక్ పై జాతీయ జెండాను పాతాడు. సాధించామంటూ బిగ్గరగా అరిచాడు. అనంతరం 2022 ఖతార్ లో సాకర్ కప్ సాధించిన అనంతరం మెస్సీ స్లో మోషన్ లో వచ్చి కప్ అందుకున్నాడు. అదే స్టైల్ ను టి20 వరల్డ్ కప్ అందుకునేటప్పుడు రోహిత్ అనుకరించాడు. అది అప్పట్లో సోషల్ మీడియాను ఒక ఊపు ఊపింది. ఆ తర్వాత రోహిత్ శర్మ తనకు ఇచ్చిన మ్యాచ్ బోనస్ లో సగం వెనక్కి తిరిగి ఇచ్చాడని వార్తలు వచ్చాయి. అందరితోపాటు తనకు సమానంగా బోనస్ ఇవ్వాలని అతడు బీసీసీఐ వర్గాలను కోరినట్టు జాతీయ మీడియాలో కథనాలు వినిపించాయి.
Bhaskar Katiki is the main admin of the website
Read MoreWeb Title: Good news for rohith sharma fans he said that longtime playing cricket
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com