HomeతెలంగాణT Square In Hyderabad: హైదరాబాద్ సిగలో మరో అద్భుతం.. న్యూయార్క్ టైం స్క్వేర్ తరహాలో...

హైదరాబాద్ సిగలో మరో అద్భుతం.. న్యూయార్క్ టైం స్క్వేర్ తరహాలో హైదరాబాదులో టి స్క్వేర్.. దాని విశేషాలు ఇవి

T Square In Hyderabad: తెలంగాణ రాజధాని, విశ్వనగరంగా గుర్తింపు పొందిన హైదరాబాద్‌ అంటే అందరికీ గుర్తుకు వచ్చేది చార్మినార్, గోల్కొండ కోట, హైటెక్‌సిటీ.. తదితర కట్టడాలు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత అధికారంలోకి వచ్చిన బీఆర్‌ఎస్‌ అలియాస్‌ టీఆర్‌ఎస్‌ పలు ఐకానిక్‌ కట్టడాలు నిర్మించింది. పదేళ్లు అధికారంలో ఉన్న బీఆర్‌ఎస్‌ కొత్త సెక్రటేరియట్‌ భవనం, అమరవీరుల స్థూపం, భారీ అంబేద్కర్‌ విగ్రహం, దుర్గం చెరువుపైన కేబుల్‌ బ్రిడ్జ్, పోలీసుల కమాండ్‌ కంట్రోల్‌ టవర్, టీ–హబ్‌ ఇలా పలు ల్యాండ్‌ మార్క్‌ కట్టడాలను నిర్మించి.. హైదరాబాద్‌కు కొత్త అందాలు తెచ్చింది.

కాంగ్రెస్‌ మార్క్‌ చూపించేలా..
తెలంగాణ రాష్ట్రంలో తొలిసారి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ పార్టీ కూడా తమ మార్కు ఉండాలని భావిస్తోంది. తెలంగాణ ఇచ్చిన పార్టీగా, తమ పాలనకు గుర్తుగా మిగిలేలా మరో ఐకానిక్‌ కట్టడం నిర్మించాలని యోచిస్తోంది. అగ్రరాజ్యం అమెరికాలోని న్యూయార్క్‌లో ఉన్న టైమ్స్‌ స్క్వేర్‌ తరహాలో.. హైదరాబాద్‌లో ‘టీ–స్క్వేర్‌‘ నిర్మించాలని నిర్ణయించింది. ‘టీ– స్క్వేర్‌‘ నిర్మించి హైదరాబాద్‌ సిగలో మరో ఐకానిక్‌ ల్యాండ్‌ మార్క్‌ను చేర్చాలని రేవంత్‌రెడ్డి సర్కార్‌ భావిస్తోంది.

ఇవి కూడా చదవండి: కేంద్రంలో బీజేపీతో.. తెలంగాణలో కాంగ్రెస్‌ తో.. చంద్రబాబు చీటింగ్‌ పాలి‘ట్రిక్స్‌’

టెండర్లకు ఆహ్వానం..
కాంగ్రెస్‌ సర్కార్‌ నిర్మించ తలపెట్టిన టీ–స్క్వేర్‌ నిర్మాణం కోసం ప్రభ్వుం టెండర్లు కూడా పిలిచింది. ఆకాశాన్నంటే బిల్డింగులు, అంతర్జాతీయ సాఫ్ట్‌వేర్‌ కంపెనీలకు ల్యాండ్‌ మార్క్‌గా ఉన్న రాయదుర్గం, బయోడైవర్సిటీ ప్రాంతాల్లో టీ – స్వేర్‌ నిర్మించాలని నిర్ణయించింది. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌ కోసం తెలంగాణ ఇండస్ట్రియల్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ కార్పొరేషన్‌ టెండర్లు ఆహ్వానిస్తూ ప్రకటన విడుదల చేసింది. వేగంగా అభివృద్ధి చెందుతున్న రాయద్గుం ప్రాంతంలో.. ఈ టీ–స్క్వేర్‌ నిర్మించటం వల్ల ఆ ప్రాతానికి మరింత ఆకర్షణ తీసుకురావాలని సీఎం రేవంత్‌రెడ్డి యోచిస్తున్నారు. ఈ ప్రాంతానికి టీజీఎస్‌ఆర్టీసీ, హైదరాబాద్‌ మెట్రో రైల్‌ సర్వీస్‌లు నడుస్తున్నాయి. మరింత ప్రజాదరణ పొందాల్సి అవసరం ఉన్న నేపథ్యంలో రాయదుర్గంలో వినోద కేంద్రాలు, కొలాబరేషన్‌ జోన్స్, వాణిజ్య కూడళ్లతో కూడిన ప్రధాన పర్యాటక గమ్యస్థానంగా మారాలని ప్రభుత్వం భావిస్తోంది.

న్యూయార్క్‌ టైమ్స్‌ తరహాలో టీ–స్వేర్‌..
న్యూయార్క్‌లో టైమ్స్‌ స్వేర్‌ నిర్మాణంతో అక్కడ వాణిజ్య కూడలి అభివృద్ధి చెందింది. ఈ నేపథ్యంలో టీ–స్వేర్‌ నిర్మాణంతో తెలంగాణలోని రాయదుర్గం కూడా వాణిజ్య పరంగా అభివృద్ధి చెందుతుందని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. న్యూయార్క్‌లో ఉన్న టైమ్స్‌ స్క్వేర్‌.. వాణిజ్య కూడలిగానే కాకుండా.. పర్యాటక ప్రదేశంగా, వినోద కేంద్రంగా ఉంది. వ్యాపార ప్రకటనలు చేయడానికి డిజిటల్‌ బిల్‌బోర్డ్‌ల ద్వారా ఈ ప్రాంతం వెలిగిపోతుంది. ఈ క్రమంలోనే.. రాయదుర్గంలోనూ టీ– స్క్వేర్‌ ద్వారా అలాంటి వాతావరణాన్ని అభివృద్ధి చేయాలని ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తోంది. ఈ క్రమంలోనే.. ప్రాజెక్ట్‌ కోసం పేరున్న ప్రైవేట్‌ డెవలపర్‌లను గుర్తించి, ఎంపిక చేసేందుకు బిడ్‌ ప్రక్రియను నిర్వహించనున్నారు. ఈ మేరకు టెండర్లను ఆహ్వానించారు.

రాజధాని వాసుల్లో ఉత్సాహం..
టీ–స్క్వేర్‌ ప్రకటనతో రాజధాని హైదరాబాద్‌ వాసుల్లో ప్రత్యేక ఉత్సాహం కనబడుతోంది. ఈ ప్రాజెక్ట్‌ హైదరాబాద్‌ ఖ్యాతిని మరింతగా మెరుగుపరచడమే కాకుండా ప్రధాన పర్యాటక, వాణిజ్య కేంద్రంగా కూడా మారనుందని నగరవాసులు భావిస్తున్నారు. విశ్వనగరంగా అభివృద్ధి చెందుతున్న హైదరాబాద్‌లో ఇలాంటి ఐకానిక్‌ టవర్లు రావాల్సిన అవసరం కూడా ఉందని అభిప్రాయపడుతున్నారు.

ఇవి కూడా చదవండి: కమలంతో కారు దోస్తీ.. ప్రయత్నాలు మొదలు పెట్టిన కేసీఆర్‌.. ఫలిస్తాయా మరి?

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
RELATED ARTICLES

Most Popular