Pawan Kalyanan
Pawan Kalyanan: తెలుగు సినిమా ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవికి ఉన్న క్రేజ్ గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆయన చేసిన ప్రతి సినిమాలో కూడా ఏదో ఒక వైవిధ్యమైన కథాంశాన్ని ఎంచుకోవడమే కాకుండా తన ఫ్యాన్స్ ని దృష్టిలో పెట్టుకొని సినిమాలు చేస్తు ఉంటాడు. తన అభిమానులు ఎలాగైతే తనని చూడాలనుకుంటున్నారో అలాంటి పాత్రలో నటించడానికి ఆయన ఎక్కువ ఆసక్తి చూపిస్తూ ఉంటాడు.
అందుకోసమే ప్రేక్షకులు ఆయన సినిమాలని చాలా ఇష్టంతో చూస్తూ ఉంటారు. ఇక ఇదిలా ఉంటే ఆయన చేసిన ప్రతి సినిమాలో కూడా తన మాస్ ఎలివేషన్స్ ని మాత్రం ఎక్కడ మిస్ అవ్వకుండా చూసుకుంటాడు. చిరంజీవి అభిమానులకు కూడా కావాల్సినవి అవే.. ఇక ఇదిలా ఉంటే చిరంజీవి తమ్ముడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన పవన్ కళ్యాణ్ తన ధైన రీతిలో సినిమాలు చేసుకుంటూ ముందుకు దూసుకెళ్తున్నాడు.
ఇక ఇలాంటి క్రమంలోనే ప్రస్తుతం ఆయన జనసేన పార్టీని స్థాపించి ఆంధ్రప్రదేశ్ లో భారీ విక్టరీని సాధించడమే కాకుండా గేమ్ చేంజర్ గా కూడా మారాడు. ఇక అక్కడ ఎన్డీఏ కూటమి అధికారంలోకి రావడానికి కూడా తను చాలా తీవ్రమైన ప్రయత్నం అయితే చేశారనే చెప్పాలి. ఇక ఇలాంటి సందర్భంలో ప్రస్తుతం పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం గా తన పదవి బాధ్యతలను కొనసాగిస్తున్నాడు. ఇక ఇదిలా ఉంటే పవన్ కళ్యాణ్ ఖుషి లాంటి ఒక బ్లాక్ బాస్టర్ సక్సెస్ తర్వాత ఆయన స్వీయ డైరెక్షన్ లోనే జానీ అనే సినిమా చేసుకున్నాడు. అయితే ఈ సినిమా స్టార్ట్ చేసేటప్పుడు పవన్ కళ్యాణ్ చిరంజీవికి కథ వినిపించాడట. అది విన్న చిరంజీవి స్టోరీ బాగుంది.వేరే దర్శకుడి డైరెక్షన్ లో నువ్వు హీరోగా చేయి బావుంటుంది. నువ్వే డైరెక్షన్, నువ్వే యాక్టింగ్ అంటే సెట్ అవ్వదు అని చెప్పాడట. అయినప్పటికీ పవన్ కళ్యాణ్ మాత్రం వినిపించుకోకుండా తను డైరెక్షన్ చేయాలనే ఉద్దేశ్యంతోనే తను ఆ కథ రాసుకున్నట్టుగా చిరంజీవికి తెలియజేశారట.
ఇక మొత్తానికైతే ఆయన అనుకున్నట్టుగానే ఆ సినిమాని తనే డైరెక్షన్ చేసుకున్నాడు. కానీ ఫలితం మాత్రం తేడాగా వచ్చింది. దాంతో చిరంజీవి గారు చెప్పిన మాట నిజమే కానీ తనకు డైరెక్షన్ చేయాలని ఇంట్రెస్ట్ ఉంది కాబట్టే తను అలాంటి సాహసం చేశానని కూడా పవన్ కళ్యాణ్ పలు సందర్భల్లో తెలియజేశాడు.ఇక మొత్తానికైతే పవన్ కళ్యాణ్ లాంటి ఒక స్టార్ హీరో తనే డైరెక్టర్ గా తనే హీరోగా చేసి భారీగా నష్టపోవడం అనేది కొంతవరకు అభిమానులను నిరాశపరిచింది. అయినప్పటికీ పవన్ కళ్యాణ్ క్రేజ్ మాత్రం కొంచెం కూడా తగ్గలేదు. ఇక ఇప్పటికి కూడా జానీ సినిమాకి చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు…
అయితే ఇప్పుడు ప్రస్తుతం పవన్ కళ్యాణ్ పొలిటికల్ గా రాణిస్తున్నాడు. అలాగే వీలు దొరికినప్పుడు సినిమాలను కూడా చేసే ఆలోచనలో ఉన్నాడు. ఇక ఇప్పటికే ఆయన సెట్స్ మీద ఉంచిన సినిమాలను కంప్లీట్ చేసి ఆ తర్వాత కొత్త సినిమాలకు కమిట్ అవ్వాలనే ఆలోచనలో పవన్ కళ్యాణ్ ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి ఉన్న స్టార్ డమ్ మరే హీరోకి లేదని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. ఆయన సినిమాలు ఫ్లాప్ అయిన కూడా ఆయనకు అభిమానులు పెరుగుతూనే ఉంటారు తప్ప తగ్గిపోరు అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు…
Velpula Gopi is a Senior Reporter Contributes Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.
View Author's Full InfoWeb Title: Interesting facts about pawan kalyanan movie johnny