స్టార్ కిడ్ వరలక్ష్మీ శరత్ కుమార్ పెళ్లి పీటలు ఎక్కిన విషయం తెలిసిందే. జులై 3న చెన్నై వేదికగా వరలక్ష్మీ శరత్ కుమార్ వివాహం ఘనంగా జరిగింది. వరలక్ష్మి భర్త పేరు నికోలాయ్ సచ్ దేవ్. ముంబైకి చెందిన బిజినెస్ మెన్. ఆర్ట్ గ్యాలరీ ఓనర్. వరలక్ష్మి వివాహానికి టాలీవుడ్, కోలీవుడ్ పరిశ్రమలకు చెందిన పలువురు చిత్ర ప్రముఖులు హాజరయ్యారు. నందమూరి బాలకృష్ణ ప్రత్యేకంగా పెళ్ళికి వెళ్లి నవ దంపతులను ఆశీర్వదించాడు. Photo: Aaron Obed
ఇక నికొలాయ్ నికర ఆస్తుల విలువ రూ. 100 కోట్ల వరకు ఉంటుందని సమాచారం. కాగా వరలక్ష్మీ శరత్ కుమార్ తో నికొలాయ్ కి 14 ఏళ్ల క్రితమే పరిచయం ఉందట. చాలా కాలంగా వారి మధ్య స్నేహం కొనసాగుతుందట. స్నేహం ప్రేమగా మారిన తరుణంలో పెళ్లి చేసుకుని ఒక్కటయ్యారు. 2024 మార్చి నెలలో ఎంగేజ్మెంట్ జరుపుకున్న ఈ జంట జులై నెలలో వివాహం చేసుకున్నారు. Photo: Aaron Obed
ఇక వరలక్ష్మి గురించి అందరికీ తెలిసిందే. నటుడు శరత్ కుమార్ మొదటి భార్య సంతానమే వరలక్ష్మి. 1984లో శరత్ కుమార్ ఛాయ అనే మహిళను వివాహం చేసుకున్నారు. వీరి కూతురే వరలక్ష్మి. 2000 సంవత్సరంలో ఛాయతో విడాకులు అయ్యాయి. 2001లో శరత్ కుమార్ రెండో వివాహం చేసుకున్నారు. 2012లో వరలక్ష్మి హీరోయిన్ గా సిల్వర్ స్క్రీన్ కి పరిచయం అయ్యింది. శింబు ఆ చిత్రంలో హీరోగా నటించారు. Photo: Aaron Obed
హీరోయిన్ గా వరలక్ష్మి పెద్దగా సక్సెస్ కాలేదు. తెలుగులో ఆమె లేడీ విలన్ గా ఫేమస్ అయ్యారు. తెనాలి రామకృష్ణ బిఏ బిఎల్ తెలుగులో ఆమె మొదటి చిత్రం. ఇందులో ఆమె నెగిటివ్ రోల్ చేసింది. ఆ నెక్స్ట్ తెలుగు మూవీ క్రాక్ ఆమెకు విపరీతమైన ఫాలోయింగ్ తెచ్చింది. విలన్ కీప్ జయమ్మ పాత్రలో వరలక్ష్మి విలనిజం పీక్స్ లో ఉంటుంది. రవితేజ హీరోగా నటించిన క్రాక్ సూపర్ హిట్. Photo: Aaron Obed
జాంబీ రెడ్డి, నాంది, పక్కా కమర్షియల్, యశోద చిత్రాల్లో వరలక్ష్మి నటించింది. ఆమె టాలీవుడ్ బిజీ యాక్ట్రెస్ అయ్యారు. 2023 సంక్రాంతి రిలీజ్ వీరసింహారెడ్డిలో దర్శకుడు గోపీచంద్ మలినేని మరో పవర్ఫుల్ రోల్ ఇచ్చాడు ఆమెకు. అన్న చావు కోరుకునే చెల్లి పాత్రలో వరలక్ష్మి ప్రేక్షకులను మెప్పించింది. 2024 సంక్రాంతికి కూడా ఆమె మరో బ్లాక్ బస్టర్ ఖాతాలో వేసుకుంది. Photo: Aaron Obed
హనుమాన్ మూవీలో తేజ సజ్జా అక్క పాత్ర చేసింది వరలక్ష్మి. దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన ఆ చిత్రం సంక్రాంతి విన్నర్ గా నిలిచింది. ఏకంగా రూ. 350 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. వరలక్ష్మి దర్శకులకు లక్కీ చార్మ్ గా మారిపోయింది. వరలక్ష్మి ఉంటే సినిమా హిట్ అని నమ్మే దర్శక నిర్మాతలు ఎక్కువయ్యారు. ప్రస్తుతం మాక్స్, రాయన్ చిత్రాల్లో వరలక్ష్మి కీలక రోల్స్ చేస్తుంది. ఇక వరలక్ష్మి పెళ్లి ఫోటోలు వైరల్ అవుతున్నాయి. ఫ్యాన్స్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. Photo: Aaron Obed
Web Title: Varalaxmi sarathkumar wedding photos goes viral
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com