Homeక్రీడలుCarlos Alcaraz : అల్క రాస్.. ఆధునిక టెన్నిస్ చరిత్రలో యువ సంచలనం..

Carlos Alcaraz : అల్క రాస్.. ఆధునిక టెన్నిస్ చరిత్రలో యువ సంచలనం..

Carlos Alcaraz :  అతడి వయసు కేవలం 21 సంవత్సరాలు. నిండా పాతికేళ్లు లేని ఆ యువకుడు ఆధునిక టెన్నిస్ చరిత్ర లో సంచలనం సృష్టిస్తున్నాడు. వరుస గ్రాండ్ స్లామ్ లు సాధిస్తూ ఔరా అనిపిస్తున్నాడు. దిగ్గజ ఆటగాళ్లను మట్టి కరిపిస్తూ సరికొత్త రికార్డులు సాధిస్తున్నాడు..

లండన్ వేదికగా ఆదివారం జరిగిన వింబుల్డన్ ఫైనల్ మ్యాచ్ లో 25వ గ్రాండ్ స్లామ్ సాధించాలనే మూడో సీడ్ జకోవిచ్ కలను భగ్నం చేశాడు. 6-2, 6-2, 7-6, (7-4) తేడాతో ఓడించాడు.. నెట్ దగ్గర అల్క రాస్ 22 కు గానూ 16 పాయింట్లు సాధించి సరికొత్త రికార్డును సృష్టించాడు..

ఫైనల్ మ్యాచ్ లో వరుసగా రెండు సెట్లు గెలిచిన అల్క రాస్.. జకో విచ్ ను ముప్పు తిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్లు తాగించాడు. ఏకంగా ఐదు ఏస్ లు కొట్టాడు. 42 విన్నర్లు సాధించి.. పెను సంచలనం సృష్టించాడు.

వింబుల్డన్ ఫైనల్ మ్యాచ్ లో జకోవిచ్ పై ఘన విజయం సాధించిన అల్క రాస్.. ఫైనల్ చేరిన తొలి నాలుగు గ్రాండ్ స్లామ్ టైటిళ్లు గెలుచుకుని రోజర్ ఫెదరర్ సరసన చేరాడు.


2022 యుఎస్ ఓపెన్ నెగ్గిన అల్క రాస్.. గత ఏడాది వింబుల్డన్ ట్రోఫీ గెలిచాడు. ఏడాది ఫ్రెంచ్ ఓపెన్, వింబుల్డన్ టైటిళ్లు కూడా సొంతం చేసుకుని సరికొత్త చరిత్ర సృష్టించాడు..

ఓకే క్యాలెండర్ ఇయర్ లో ఫ్రెంచ్ ఓపెన్, వింబుల్డన్ ట్రోఫీలను గెలిచి.. సరికొత్త రికార్డు సృష్టించిన అల్క రాస్.. ఈ ఘనత సాధించిన ఆరవ ఆటగాడిగా నిలిచాడు.

21 సంవత్సరాలకు ఇన్ని ఘనతలు సాధించిన అల్క రాస్.. మునుమందు మరిన్ని విజయాలు సాధిస్తాడని అభిమానులు అంచనా వేస్తున్నారు. టెన్నిస్ సామ్రాజ్యాన్ని ఏలేస్తాడని జోస్యం చెబుతున్నారు.

Bhaskar
Bhaskarhttps://oktelugu.com/
Bhaskar Katiki is the main admin of the website
RELATED ARTICLES

Most Popular