Police complaint against Cricketers : పాకిస్తాన్ ఓడించి గేలి చేశారు.. అడ్డంగా బుక్కయ్యారు.. యువీ భజ్జీ, రైనాపై పోలీసులకు ఫిర్యాదుటీమిండియా వెటరన్ ఆటగాళ్లు యువరాజ్ సింగ్, హర్భజన్ సింగ్, సురేష్ రైనాకు మనదేశంలో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది. గతంలో టీమిండియా సాధించిన విజయాలలో వారి పాత్ర ఉంది. టి20 వరల్డ్ కప్, వన్డే వరల్డ్ కప్, ఛాంపియన్స్ ట్రోఫీ వంటి ఐసీసీ మెగా టోర్నీ లను భారత జట్టు గెలవడంలో వీరు కీలక భూమిక పోషించారు. అందుకే వీరి ఆట తీరును చాలామంది అభిమానులు ఇష్టపడుతుంటారు. సోషల్ మీడియా వినియోగం పెరిగిన తర్వాత ఈ ఆటగాళ్ల పేరుతో ఏకంగా వందలాది గ్రూపులు కూడా ఏర్పాటయ్యాయి.
భారత జట్టుకు అండగా..
యువరాజ్ సింగ్, హర్భజన్ సింగ్, సురేష్ రైనా అన్ని ఫార్మాట్లకు గుడ్ బై చెప్పి చాలా కాలం అయింది. ఐపీఎల్ కూ ఈ ఆటగాళ్లు వీడ్కోలు పలికారు.. అయినప్పటికీ వీరిని అభిమానించే ప్రేక్షకుల సంఖ్య తగ్గలేదు. పైగా సోషల్ మీడియాలో వీరిని అనుసరించే వారి సంఖ్య రోజురోజుకు పెరిగిపోతుంది. యాక్టివ్ క్రికెట్ కు గుడ్ బై చెప్పినప్పటికీ క్రికెట్ కు సంబంధించి ఏదో ఒక వ్యవహారంలో యువరాజ్ సింగ్, హర్భజన్ సింగ్, సురేష్ రైనా కొనసాగుతూనే ఉన్నారు. సురేష్ రైనా కామెంటేటర్ అవతారం ఎత్తాడు. హర్భజన్ సింగ్ కూడా ఎప్పుడో ఒకసారి కనిపిస్తూనే ఉంటాడు. ఇక యువరాజ్ సింగ్ అయితే ఇటీవల టీ20 వరల్డ్ కప్ కు ఐసీసీ బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించాడు. టి20 వరల్డ్ కప్ లో 14 సంవత్సరాల క్రితమే సరికొత్త రికార్డులను సృష్టించిన ఘనత యువరాజ్ సింగ్ ది. టీమిండియా 2007లో తొలిసారి టీ20 వరల్డ్ కప్ గెలుచుకోవడంలో యువరాజ్ ముఖ్య పాత్ర పోషించాడు. ముఖ్యంగా ఇంగ్లాండ్ జట్టుతో జరిగిన మ్యాచ్లో స్టువర్ట్ బ్రాడ్ బౌలింగ్లో ఆరు బంతులకు ఆరు సిక్సర్లు కొట్టి ప్రపంచ రికార్డు సృష్టించాడు.
పాకిస్తాన్ పై గెలిచిన తర్వాత..
యువరాజ్ సింగ్ ఆధ్వర్యంలో టీమిండియా లెజెండరీ ఆటగాళ్లు “వరల్డ్ ఛాంపియన్ షిప్ ఆఫ్ లెజెండ్స్ 2024 ” కప్ సొంతం చేసుకున్నారు. చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ జట్టుతో జరిగిన ఫైనల్ మ్యాచ్లో భారత లెజెండరీ ఆటగాళ్లు అద్భుతమైన ఆట తీరు ప్రదర్శించారు. ఈ విజయం అనంతరం టీమిండియా ఆటగాళ్లు యువరాజ్ సింగ్, హర్భజన్ సింగ్, సురేష్ రైనా వేడుకలు జరుపుకున్నారు. అయితే ఈ వేడుకల్లో కాస్త వైవిధ్యాన్ని ప్రదర్శించారు. దీంతో ఆ వీడియో నెట్టింట విపరీతమైన సందడి చేస్తోంది. పాకిస్తాన్ ఆటగాళ్లు సరైన ఫిట్నెస్ తో ఉండరని.. వెంట వెంటనే గాయాల పాలవుతారని.. వారిని ఉద్దేశిస్తూ యువీ, భజ్జీ, సురేష్ రైనా అలా చేశారని సోషల్ మీడియాలో వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. పాకిస్తాన్ జట్టుతో హోరాహోరీగా సాగిన ఫైనల్ మ్యాచ్లో భారత్ విజయం సాధించిన అనంతరం వారు ఈ వేడుకలు జరుపుకోవడం నెట్టింట చర్చకు కారణమవుతోంది. అయితే వెరైటీగా యువరాజ్ సింగ్, సురేష్ రైనా, హర్భజన్ సింగ్ నడుచుకుంటూ రావడం అభిమానులకు ఆనందం కలిగిస్తున్నప్పటికీ.. వారు వ్యవహరించిన శైలి.. నడిచిన తీరు తమకు ఇబ్బందికరంగా మారిందని దివ్యాంగులు సోషల్ మీడియా వేదిక వాపోతున్నారు..”మీరు నడిచిన తీరు ఇబ్బందికరంగా ఉంది. అది మా మనోభావాలను దెబ్బతీస్తోంది. మీ ఉద్దేశం వేరైనప్పటికీ.. మీరు నడిచిన విధానం మా ఔన్నత్యాన్ని ప్రభావితం చేసేలా ఉంది.. మీరు పూర్తిగా వివిధ రకాల శారీరక లోపాలతో బాధపడుతున్న వారిని హేళన చేసినట్టు కనిపిస్తోంది. ఇది సరైన పద్ధతి కాదని” నేషనల్ సెంటర్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ ఫర్ డిజేబుల్డ్ పీపుల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అర్మాన్ అలీ అన్నారు. యువరాజ్ సింగ్, హర్భజన్ సింగ్, సురేష్ రైనా పై అతడు ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అర్మాన్ అలీ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో యువరాజ్ సింగ్, హర్భజన్ సింగ్, సురేష్ రైనా వీడియో వ్యవహారం మరోసారి హాట్ టాపిక్ గా మారింది.
Bhaskar Katiki is the main admin of the website
Read MoreWeb Title: Police complaint against yuvi bhajji and raina they made fun of pakistan after defeating them
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com