Mansa Musa : మొన్న అనంత్ అంబానీ పెళ్లి చేసేందుకు ముకేశ్ అంబానీ వందల కోట్లు ఖర్చు చేశాడు.. నిన్న ట్రంప్ ఎన్నికల కోసం వందల కోట్లు విరాళంగా ఇస్తానని ఎలాన్ మస్క్ ప్రకటించాడు.. వాస్తవంగా మీడియాలో ఉండే ప్రచారం ప్రకారం.. అంబానీ దేశంలోనే శ్రీమంతుడిగా ఉన్నారు.. గౌతమ్ అదానీ కూడా ఇంచుమించు అదే స్థాయిలో సంపదతో ఆలరాడుతున్నాడు. మరోవైపు ఎలాన్ మస్క్ ప్రపంచ కుబేరుడిగా కొనసాగుతున్నాడు. అయితే వీరందరికీ మించి సంపన్నుడు ఒకతను ఉన్నాడు. ఇంతకీ అతను ఎవరంటే..
400 బిలియన్ డాలర్లు..
ఆఫ్రికా దేశానికి చెందిన మన్సా మూసా వద్ద ఉన్న సంపదను లెక్కిస్తే
ప్రస్తుత విలువ ప్రకారం 400 బిలియన్ డాలర్లుగా ఉంటుందట. ఈ సంపద మస్క్ వద్ద ఉన్న డబ్బు కంటే దాదాపు రెండు రెట్లు ఎక్కువ. ఆఫ్రికాలోని మాలి, సెనెగల్, నైగర్, నైజీరియా, గాంబియా, గినియా, మారేటేనియా, చాద్ వంటి దేశాలతో కూడిన విశాల సామ్రాజ్యాన్ని మూసా ఏర్పాటు చేశాడు. దీనికి మాలి విశాల సామ్రాజ్యం అని పేరు పెట్టాడు. మాలి దేశంలో ఉన్న టింబుక్టు ను అతడే నిర్మించాడు. ఆ రోజుల్లో దీని నిర్మాణం కోసం ఆఫ్రికా, పశ్చిమసియా నుంచి వేలాదిమంది నైపుణ్యమైన పని వాళ్ళను మూసా రప్పించాడు. క్రీస్తు శకం 1312 నుంచి 1337 వరకు మాలి సామ్రాజ్యం గొప్పతనాన్ని ప్రపంచానికి తెలియజేసేలా పరిపాలించాడు.
బంగారమే బంగారం
మూసా మాలి సామ్రాజ్యాన్ని ఏలుతున్నప్పుడు ఆ ప్రాంతంలో బంగారం, ఉప్పు గనులు విస్తారంగా ఉండేవి. బంగారం అధికంగా ఉండడం వల్ల ఈయన సామ్రాజ్యంలోని ఖజానాలో సింహభాగం అదే నిండి ఉండేది. దీనిని ఇతర దేశాలకు రవాణా చేయడం ద్వారా మాలి సామ్రాజ్యానికి భారీగా సంపద వచ్చేది.. మూసా హజ్ యాత్రకు బయలుదేరినప్పుడు.. ఈజిప్టులో ఆగాడు. ఆ సమయంలో ఆ దేశ పాలకుడికి లెక్క లేనంత బంగారాన్ని బహుమతిగా ఇచ్చాడు. దీంతో ఈజిప్టు దేశంలో బంగారం విలువ భారీగా పడిపోయింది..మూసా బంగారాన్ని ఆదేశ పరిపాలకుడికి ఇవ్వడం వల్ల విరివిగా అది ప్రజలకు చేరడంతో.. కొనేవారు లేకపోవడంతో.. బంగారం విలువ దారుణంగా పడిపోయింది. హజ్ యాత్ర కోసం మూసా లక్షల మందితో బయలుదేరాడు. ప్రపంచ చరిత్రలో ఇంతటి ఖరీదైన యాత్ర చేసిన వ్యక్తి మరొకరు లేరంటే అతిశయోక్తి కాదు.. యాత్ర అనంతరం టింబక్టు నుంచి పలు ప్రాంతాలను అభివృద్ధి చేశారు. ఆ కాలంలో మాలి ప్రాంతంలో విద్యా కేంద్రాలను ఏర్పాటు చేశారు. వేలాదిమంది విద్యార్థులకు విద్యను ఉచితంగా బోధించారు.
అనేక ప్రజోపయోగ పనులు
మూసా తన పరిపాలన కాలంలో అనేక ప్రజోపయోగ కార్యక్రమాలు చేపట్టారు. విద్యాభివృద్ధికి, సాంకేతిక పరిజ్ఞాన అభివృద్ధికి దోహదం చేశారు. పన్నులు పెంచకుండా.. ప్రజలను తన కన్న బిడ్డల్లాగా చూసుకున్నారు. అలాంటి మూసా 1337లో కన్నుమూశారు. ఆ తర్వాత వచ్చిన పాలకులు మద్యానికి, మగువలకు బానిసలు కావడంతో మూసా నిర్మించిన మాలి సామ్రాజ్యం సర్వనాశనమైంది. చరిత్రలో ఒక జ్ఞాపకం లాగా మిగిలిపోయింది. వాస్తవానికి మాలి సామ్రాజ్యం తర్వాతి వచ్చిన రాజుల ఆధ్వర్యంలో మరింతగా అభివృద్ధి చెందుతుందని ఆ దేశ ప్రజలు భావించారు.. కానీ ఆ రాజులు ప్రజల ఆశలను మమ్ము చేశారు. ఉన్న బంగారాన్ని మొత్తం నువ్వు విలాసాల కోసం ఖర్చు చేశారు. పొరుగు రాజ్యాల రాజులు మాలి సామ్రాజ్యం మీద దండెత్తడంతో.. ఆ ఘనమైన చరిత్ర కాలగర్భంలో కలిసిపోయింది.
Bhaskar Katiki is the main admin of the website
Read MoreWeb Title: Mansa musa is the most richest man in the world from africa country
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com