West Godavari : ఇటీవల నంద్యాలలో ఓ మైనర్ ను ముగ్గురు బాలురు గ్యాంగ్ రేప్ చేశారు. ఆ తర్వాత ఆ బాలిక మృతదేహాన్ని ఓ నదిలో పడేశారు. ఈ సంఘటన ఏపీలోనే కాదు, దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ ఘటన మరొక ముందే మరో ప్రాంతంలో ఏడు నెలల పసికందుపై.. ఓ వృద్ధుడు అత్యాచారం చేయడం కలకలం రేపింది. ఈ రెండు ఘటనల్లో నిందితులపై పోలీసులు ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి.. రిమాండ్ నిమిత్తం కోర్టుకు తరలించారు. నంద్యాల జిల్లాలో జరిగిన ఘటనలో నిందితులను జువైనల్ హోమ్ కు తరలించారు. ఏపీలో రోజుల వ్యవధిలో జరిగిన ఈ సంఘటనలు సంచలనం సృష్టించాయి. మనుషుల్లో రోజురోజుకు పెడుతున్న రాక్షస ప్రవృత్తిని బయటపెట్టాయి. ఈ ఘటనలు మరవకముందే.. ఏపీలో మరో దారుణం చోటుచేసుకుంది.
ఇంతకీ ఏం జరిగిందంటే..
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పశ్చిమగోదావరి జిల్లా వీరవాసరం మండలం తోకలపూడి గ్రామానికి చెందిన సీతారామయ్యకు కొన్ని గేదెలున్నాయి. అతడికి కొంత పొలం కూడా ఉంది.. ఆ పొలాన్ని సాగు చేసుకుంటూ, గేదెలను సాకుతూ అతడు జీవన సాగిస్తున్నాడు. మంగళవారం తన గేదెలను దొడ్లో కట్టేశాడు. అందులో ఒక గేదె యదకు వచ్చింది. అయితే ఆ గ్రామానికి చెందిన కొంతమంది వ్యక్తులు మద్యం తాగి వచ్చి.. తాగిన మైకంలో.. ఆ గేదె కాళ్లను కట్టేశారు. మద్యం తాగిన వ్యక్తులు రేప్ చేశారు. దీంతో ఆ గేదె మర్మాంగం నుంచి తీవ్రంగా రక్తస్రావం కావడంతో.. సీతారామయ్య పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని.. తీవ్రంగా గాయపడిన గేదెను పరిశీలించారు.. అనంతరం ఆ గేదె మర్మాంగం నుంచి వీర్య నమూనాలు సేకరించారు. ప్రయోగశాలకు పంపారు.
చర్చనీయాంశం
ఈ విషయం దావానం లాగా వ్యాపించడంతో చర్చనీయాంశంగా మారింది. అయితే ఆ వ్యక్తులను గుర్తించేందుకు పోలీసులు సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారు. అయితే తోకలపూడిలో ఎక్కువగా సీసీ కెమెరాలు లేకపోవడంతో కేసు దర్యాప్తు లో పురోగతి లభించడం లేదు. అయితే ఈ ఘాతుకానికి పాల్పడింది స్థానికులా? ఇతర ప్రాంతాలకు చెందిన వ్యక్తులా? అనేది తెలియ రావడం లేదు.. దీనిపై మరింత స్పష్టత కోసం పోలీసులు విస్తృతంగా దర్యాప్తు చేస్తున్నారు. అనుమానితులను పిలిపించి వివరాలు తెలుసుకుంటున్నారు.
గతంలోనూ..
గతంలోనూ ఈ ప్రాంతంలో ఇదే తరహా సంఘటన జరిగింది. అప్పుడు పోలీసులు వేగంగా దర్యాప్తు చేయడంతో స్థానికంగా ఉన్న ఓ వ్యక్తి ఆ దారుణానికి పాల్పడ్డాడని తేలింది. దీంతో పోలీసులు అతడి పై కేసు నమోదు చేసి కోర్టుకు రిమాండ్ కు తరలించారు. ప్రస్తుతం అతడు శిక్ష అనుభవిస్తున్నాడు. అయితే ఈ ఘటనకు సంబంధించి పోలీసులు ముమ్మరంగా విచారణ సాగిస్తున్నారు. నిందితులను త్వరలో పట్టుకుంటామని చెబుతున్నారు.. అయితే పోలీసుల విచారణలో తోకలపూడి కి పక్క గ్రామానికి చెందిన కొంతమంది వ్యక్తులు ఈ ఘాతుకానికి పాల్పడినట్టు తెలిసింది. ఆ విషయాన్ని పోలీసులు అత్యంత గోప్యంగా ఉంచుతున్నారు. అయితే ఆ వ్యక్తులు గతంలో పలు కేసుల్లో పోలీస్ స్టేషన్ కు వెళ్లి వచ్చినట్టు తెలుస్తోంది. దొంగతనాలు, హింసాత్మక ఘటనలకు పాల్పడిన నేపథ్యంలో.. వారిపై కేసులు నమోదైనట్టు తెలుస్తోంది. అయితే వారే ఈ దారుణానికి పాల్పడ్డారని చుట్టుపక్కల వారు కూడా చెబుతున్నారు. అందువల్లే పోలీసులు వారి కదలికలపై ప్రత్యేకంగా దృష్టి సారించినట్టు తెలుస్తోంది. త్వరలోనే వారిని అరెస్టు చేసి.. వారిదైన శైలిలో విచారించి పూర్తి నిజాలను రాబట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది.
Bhaskar Katiki is the main admin of the website
Read MoreWeb Title: Violence against some people on buffalo in west godavari district
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com