Jagan: ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ౖÐð ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి. 2019లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 150 పైగా సీట్ల మెజారిటీలో అధికారంలోకి వచ్చిన ఆయన.. స్వయంకృతాపరాధంతో 2024 నాటికి ప్రజల విశ్వాసం కోల్పోయారు. 20219 ఓడిపోయిన టీడీపీ.. ఈసారి జనసేన, బీజేపీతో కలిసి పోటీచేసి మళ్లీ అధికారంలోకి వచ్చింది. దీంతో జగన్ మాజీ సీఎం అయ్యారు. ఏపీలో అధికారంలో ఉన్నప్పుడే అన్నతో విభేదించిన చెల్లి షర్మిల తెలంగాణకు వచ్చి సొంత పార్టీ పెట్టుకున్నారు. మూడేళ్లు కష్టపడ్డారు. కానీ, మైలేజీ రాలేదు. దీంతో ఏపీ ఎన్నికల సమయంలో తిరిగి ఆంధ్రాకు వెళ్లిపోయారు. కాంగ్రెస్ పగ్గాలు చేపట్టారు. తెంగాణాలో ఉన్నంతకాలం షర్మిల లోటస్‌పాండ్‌లో ఉన్నారు.
ఇప్పుడు ఖాళీగా ఆ ప్యాలెస్..
హైదరాబాద్‌లోని లోటస్‌పాండ్ జగన్ రాజకీయాలకు బాగా అచ్చొచ్చిన ప్యాలెస్. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ దివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖరరెడ్డి మరణానంతరం జగన్‌మోహన్‌రెడ్డి ఇక్కడి నుంచి రాజకీయం నెరిపారు. సొంత పార్టీ పెట్టి గెలిపించారు. తమను ఇబ్బంది పెట్టిన కాంగ్రెస్‌నుంచి బయటకు వచ్చిన ఆ పార్టీ అధిష్టానాన్ని ఎదురించి ఏపీలో బలమైన నేతగా ఎదిగింది లోటస్ పాండ్ నుంచే. 2019 వరకు జగన్‌కు కేరాఫ్‌గా ఉన్న ఈ లోటస్‌పాండ్… 2019 ఎన్నికల ముందు గుంటూరు జిల్లా జగన్ తాడేపల్లిలో ఒక ప్యాలెస్ కట్టించుకుని అక్కడికి మకాం మార్చారు.
ఐదేళ్లుగా తాడేపల్లి నుంచే..
ఇక 2019 ఎన్నికల్లో భారీ మెజారిటీతో వైసీపీని అధికారంలోకి తెచ్చిన జగన్.. సీఎం అయ్యాక ఐదేళ్లు అక్కడి నుంచే పాలన సాగించారు. అధికారంలో ఉన్న ఐదేళ్లు ఆయన లోటస్‌పాండ్‌లో అడుగు పెట్టలేదు. ఏపీ సీఎంగా ఉన్నందున రాష్ట్రం దాటి వెళ్లడం లేదని అంతా అనుకున్నారు. ఈ విషయాన్ని పెద్దగా పట్టించుకోలేదు. 2024లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ఓడిపోవడంతో జగన్ మాజీ సీఎం అయ్యారు. ఇక ఆయన హైదరాబాద్‌లోని లోటస్‌పాండ్‌కు మకాం మారుస్తారని అంతా భావించారు. కానీ, ఇప్పటికీ ఆయన లోటస్‌పాండ్‌లో అడుగు పెట్టలేదు. ఎన్నిల తర్వాత ఫలితాలు రాకముందు యూకే వెళ్లిన జగన్.. ఫలితాలు వచ్చాక విశ్రాంతి కోసం పులివెందుల వెళ్లారు. అక్కడ వారం రోజులు ఉన్నారు. తర్వాత అటునుంచి అటే బెంగళూరు వెళ్లి. తర్వాత తాడేపల్లికి వచ్చి పార్టీ నేతలతో కలిశారు. తాజాగా మళ్లీ ఆయన బెంగళూరు వెళ్లారు.
హైదరాబాద్‌లో అడుగు పెట్టని జగన్..
జగన్ ఓటమి తర్వాత కూడా హైదరాబాద్‌లో అడుగు పెట్టడం లేదు. తనకు రాజకీయంగా అచ్చొచ్చిన లోటస్‌పాండ్‌వైపు కన్నెత్తి చూడడం లేదు. ఇందుకు కారణం అది ఉమ్మడి ఆస్తి కావడమే అంటున్నరు పొలిటికల్ ఎనలిస్టులు. అది దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ నిర్మించారు. దీనిపై జగన్‌తోపాటు, షర్మిలకు కూడా హక్కు ఉంది. అందుకే తెలంగాణలో ఉన్నప్పుడు షర్మిల అందులో ఉన్నారు. జగన్ తాడేపల్లి వెళ్లిన తర్వాత లోటస్‌పాండ్‌లోనే మకాం వేశారు. అక్కడ నుంచి అన్న కొత్త పార్టీ పెడితే కలిసి వచ్చిందని భావించిన షర్మిల.. తాను కూడా వైఎస్సార్ తెలంగాణ పార్టీని అక్కడి నుంచే ప్రనకటించారు. రెండేళ్లు పార్టీ కోసం పాదయాత్ర చేశారు. దీక్షలు చేశారు.కానీ, ఆమెకు కలిసిరాలేదు. దీంతో 2024 సార్వత్రిక ఎన్నికల సమయంలో మకాం ఏపీకి మార్చారు. అయినా ఆమె హైదరాబాద్ లోని లోటస్ పాండ్ నుంచే తన రాజకీయాలు నెరుపుతున్నారు. ఒక రకంగా చెప్పాలంటే షర్మిల లోటస్‌పాండ్‌ను తన అధీనంంలోకి తెచ్చుకున్నారు. అందుకే జగన్ కూడా లోటస్‌పాండ్‌వైపు రావడం లేదని తెలుస్తోంది.
బెంగళూర్‌లో 27 ఎకరాల్లో ఇల్లు..
ఇక జగన్ రాజకీయాల్లో రాకముందే బెంగళూరులో 27 ఎకరాలలో యెహలంక ప్యాలెస్ నిర్మించుకన్నారు. అది కట్టుకున్న తర్వాత కనీసం నెల రోజులు కూడా అక్కడ గడపలేదు. జగన్ రాజకీయాల్లోకి రావడం తర్వాత ఎంపీగా గెలవడం, ఆ తర్వాత వైఎస్సార్ మరణించడం తర్వాత రాజకీయంగా బిజీ కావడంతో బెంగళూరుకు చుట్టుపు చూపుగా వెళ్లడం తప్ప అక్కడ ఉన్నది లేదు. ఎట్టకేలకు ఏపీ మాజీ సీఎం అయ్యాక ఆయనకు తీరిక దొరికింది. అందుకే ఆయన బెంగళూరుకు వెళ్తున్నట్లు తెలుస్తోంది. రాజకీయంగా అచ్చి వచ్చిన లోటస్‌పాండ్‌లాగా ఈ యెహలంక ప్యాలెస్ కలసి వస్తుందో లేదో చూడాలి.
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
Read MoreWeb Title: Jagan left from hyderabad lotuspond
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com