Rahul Gandhi And Nara Lokesh
Rahul Gandhi And Nara Lokesh: పప్పు… రాజకీయాల్లో కొన్ని రోజులుగా వినిపించిన పదం ఇది.. జాతీయ రాజకీయాల్లో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని అధికార బీజేపీ నాయకులు పప్పు అని సంబోధిస్తూ గేలి చేశారు. వారసత్వ రాజకీయాలు చేస్తున్నారని, రాజకీయ పరిణతి లేదని, పార్టీని గెలిపించే లక్షణాలు లేవని విమర్శించారు. ప్రధాని నరేమంద్రమోదీ సైతం రాహుల్‌ను పప్పు అని సంబోధించారు. ఇక ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబు నాయకుడు తనయుడు మంత్రి నారా లోకేష్‌ను కూడా వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఆ పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలు పప్పు అని ఎగతాళి చేశారు. తెలుగు పదాలు పలకడం కూడా రాదని గేళి చేశారు. రాజకీయాలకు పనికిరాడని ఎద్దేవా చేశారు. ఇద్దరు నేతలు ఐదేళ్లు ఈ అవమానాలను భరించారు. ఎవరు ఎన్ని విమర్శలు చేసినా పట్టించుకోలేదు. కానీ, అధికారంలో ఉన్నామన్న అహంకారంతో అటు బీజేపీ, ఇటు వైసీపీ నాయకులు రాహుల్‌గాంధీని, లోకేశ్‌ను ఉద్దేశించి నేసిన ఎగతాళిని ప్రజలు పట్టించుకున్నారు.
ఇష్టానుసారం మాటలు..
2019 నుంచి 2024 వరుకు రాహుల్‌గాంధీపై పప్పు అనే విమర్శలు తీవ్రమయ్యాయి. ముఖ్యంగా 2019 ఎన్నికల సమయంలో రాహుల్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉన్నారు. ఆయన సారథ్యంలో పార్టీ ఘోరంగా ఓడిపోయింది. కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కించుకలేదు. ఇక లోక్‌సభ ఎన్నికల్లో రెండు స్థానాల్లో పోటీ చేసిన రాహుల్‌గాంధీ ఒకస్థానంలో ఓడిపోయారు. ఇదే సమయంలో బీజేపీ సింగిల్‌గా 2014 కన్నా ఎక్కువ సీట్లు సాధించింది. ఇదే బీజేపీ నేతలకు అధికారం తలకెక్కేలా చేసింది. దీంతో రాహుల్‌పై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. ఈ
మోదీ సైతం..
ఇక ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో ప్రచారానికి వెళ్లిన ప్రధాని మోదీ సైతం రాహుల్‌పై పప్పు అని ఎగతాళి చేశారు. వివిధ ‘దళ్ (ఫ్రంట్లు)‘ ‘దాల్–దాల్‘ తప్ప మరొకటి కాదన్నారు. ఇక కేంద్ర మంత్రులు, ఇతర నాయకులు అయితే ఇష్టానుసారం రాహుల్ గాంధీ గురించి మాట్లాడారు.
కసిగా పనిచేసిన రాహుల్..
ఇదిలా ఉంటే.. గత అనుభవాలను, విమర్శలను, ఎగతాళిని రాహుల్ ఛాలెంజ్‌గా తీసుకున్నారు. 2024 లోక్‌సభ ఎన్నికల్లో కసిగా పనిచేశారు. ఎలాగైనా అధికారంలోకి రావాలని, బీజేపీని ఓడించాలన్న కసి పెంచింది. దీంతో రాహుల్‌ను పాదయాత్రకు ప్రెరేపించాయి. గతంలో దేశంలో ఏ నాయకుడు చేయనట్లుగా కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు పాదయాత్ర చేశారు. తెలంగాణ, కర్ణాటక, ఉత్తరప్రదేశ్, పంజాబ్ లాంటి రాష్ట్రాలో పార్టీని బలోపేతం చేశారు. నాయకులను ఏకతాటిపైకి తెచ్చారు. ఫలితంగా 2024లో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తేలేకపోయినా ప్రతిపక్ష హోదా తీసుకొచ్చారు. పరిణతి గల నేతగా ఎదిగారు.
లోకేశ్‌పై తీవ్ర విమర్శలు..
ఇక 20219 అసెంబ్లీ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ ఘోరంగా ఓడిపోయింది. ఈ ఎన్నికల్లో చంద్రబాబు కొడుకు నారా లోకేశ్ మంగళగిరి నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఈ ఎన్నికల్లో వైసీపీ 151 సీట్లతో అధికారంలోకి వచ్చింది. జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు. భారీ మెజారిటీతో అధికారంలోకి వచ్చిన వైసీపీ టీడీపీని చిన్నచూపు చూడడం మొదలు పెట్టింది. విపక్ష నేత చంద్రబాబుతోపాటు ఆయన కొడుకు లోకేశ్ టార్గెట్‌గా విమర్శలు చేసింది. లోకేశ్‌ను అయితే నాయకుడిగా కూడా పరిగణించలేదు. ఎమ్మెల్సీగా ఉన్నా.. ఆయనకు గౌరవం ఇవ్వలేదు.
ఓడిన చోటే గెలిచి..
కానీ లోకేశ్ విమర్శలను పెద్దగా పట్టించుకోలేదు. ఆయనలో వైసీపీ విమర్శలు కసిని పెంచాయి. దీంతో ఎన్నికల సమయంలో లోకేశ్ సైతం పాదయాత్ర చేశారు. యువ గళం పేరుతో పాదయాత్ర ప్రారంభించారు. ఆయన పర్యటన సందర్భంగా కూడా వైసీపీ నాయకులు తీవ్రంగా ఎగతాళి చేశారు. మాటల తడబాటును సోషల్ మీడియాలో ట్రోల్ చేశారు. పాదయాత్ర వెంట ఎవరూ లేరని విమర్శించారు. కానీ, అయినా లోకేశ్ పట్టుదలతో ముందుకు సాగారు. పార్టీని బలోపేతం చేశారు. 2024 ఎన్నికల్లో అదే మంగళగిరి నుంచి లోకేశ్ గెలవడమే కాకుండా.. టీడీపీ కూటమి ఏపీలో వైసీపీని మించిన సీట్లు సాధించి అధికారంలోకి వచ్చింది.
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
View Author's Full InfoWeb Title: This is the success secret of rahul gandhi and nara lokesh