మలైకా అరోరాకు 50 ఏళ్ళ వయసు అంటే నమ్మడం కష్టమే. ఆమెలో ఎక్కడా వృద్ధాప్యపు ఛాయలు కనిపించవు. అంతలా గ్లామర్ మైంటైన్ చేస్తుంది మలైకా అరోరా. 1973 అక్టోబర్ 23న ముంబైలో జన్మించిన మలైకా అరోరా మోడల్ గా కెరీర్ మొదలుపెట్టింది. ఆపై నటిగా మారింది. Photo: Instagram
కెరీర్ బిగినింగ్ లో M టీవీలో వీడియో జాకీగా పని చేసింది. ' క్లబ్ M టీవీ' షోకి హోస్ట్ గా వ్యవహరించింది. కెరీర్ మొత్తంలో మలైకా అనేక టెలివిజన్ టెలివిజన్ షోలకు ప్రాతినిధ్యం వహించింది. జడ్జిగా, హోస్ట్ గా పలు సక్సెస్ఫుల్ షోస్ ని మలైకా లీడ్ చేసింది. Photo: Instagram
ప్రొఫెషనల్ డాన్సర్ అయిన మలైకా అరోరా స్పెషల్ సాంగ్స్ కి పెట్టింది పేరు. ఆమె నటించిన ప్రత్యేక గీతాలు బాలీవుడ్ ని ఊపేశాయి. దేశవ్యాప్తంగా ఆదరణ పొందాయి. 1997లో ఆమె సిల్వర్ స్క్రీన్ పై మొదటిసారి కనిపించింది. దర్శకుడు మణిరత్నం తెరకెక్కించిన దిల్ సే చిత్రంలో మలైకా అరోరా చేసిన స్పెషల్ సాంగ్ విశేష ఆదరణ పొందింది. Photo: Instagram
షారుక్ ఖాన్-మనీషా కొయిరాలా జంటగా నటించిన దిల్ సే మూవీలో 'చెయ్య చెయ్య' అత్యంత పాపులర్. ఏ ఆర్ రెహమాన్ కంపోజ్ చేసిన ఈ సాంగ్ ని సుఖ్విందర్ సింగ్, స్వప్న అవస్థి పాడారు. ఈ సాంగ్ బ్లాక్ బస్టర్ సక్సెస్ కావడంతో మలైకా అరోరా దశ తిరిగింది. Photo: Instagram
దాదాపు 30 సినిమాల్లో మలైకా అరోరా స్పెషల్ సాంగ్స్ చేసింది. తెలుగులో అతిథి, గబ్బర్ సింగ్ చిత్రాల్లో ఆమె ఐటెం సాంగ్స్ చేయడం విశేషం. గబ్బర్ సింగ్ మూవీలోని 'కెవ్వు కేక' గొప్ప ఆదరణ దక్కించుకుంది. గబ్బర్ సింగ్ హిందీ దబంగ్ రీమేక్. ఒరిజినల్ మూవీలో 'మున్నీ బద్నామ్' సాంగ్ కి సల్మాన్ తో స్టెప్స్ వేసింది. Photo: Instagram
1998 మలైకా అరోరా సల్మాన్ ఖాన్ తమ్ముడు అర్బాజ్ ఖాన్ ని ప్రేమ వివాహం చేసుకుంది. వీరికి ఒక అబ్బాయి సంతానం. చాలా కాలం పాటు విడివిడిగా ఉన్న మలైకా అరోరా-అర్బాజ్ ఖాన్ 2016లో అధికారికంగా విడాకుల ప్రకటన చేశారు. కాగా మలైకా అరోరా నటుడు అర్జున్ కపూర్ తో రిలేషన్ నడిపింది. Photo: Instagram
విడాకులకు ముందే అర్జున్ కపూర్ తో మలైకా అరోరా ఎఫైర్ పెట్టుకుందనే వాదన ఉంది. అది తెలిసిన అర్బాజ్ ఖాన్ ఆమెకు విడాకులు ఇచ్చాడట. యంగ్ హీరోతో మలైకా ఎఫైర్ టాక్ ఆఫ్ ది నేషన్ అయ్యింది. అర్జున్ కపూర్ తో కూడా మలైకా విడిపోయారంటూ కథనాలు వెలువడుతున్నాయి. Photo: Instagram
కాగా మలైకా అరోరా ఇంస్టాగ్రామ్ లో తరచుగా గ్లామర్ షో చేస్తుంది. తాజాగా ఆమె బికినీ ధరించిన ఫోటోలు షేర్ చేసింది. మలైకా అరోరా హాట్ లుక్ వైరల్ కాగా... సోషల్ మీడియా జనాలు షాక్ అవుతున్నారు. కామెంట్స్ రూపంలో ఆమెపై అభిమానం చాటుకుంటున్నారు. Photo: Instagram
Web Title: Malaika arora latest pictures goes viral
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com