Ram Charan : గేమ్ ఛేంజర్ మూవీని లీకుల బెడద వెంటాడుతుంది. ఇప్పటికే పలు వీడియోలు, ఫోటోలు గేమ్ ఛేంజర్ మూవీ సెట్స్ నుండి బయటకు వచ్చాయి. గేమ్ ఛేంజర్ లో రామ్ చరణ్ డ్యూయల్ రోల్ చేస్తున్నాడు. ఓ పాత్ర పీరియాడిక్ గా సాగుతుంది. తెల్ల చొక్కా, పంచె కట్టుకుని సైకిల్ పై వెళుతున్న రామ్ చరణ్ లుక్ లీకైంది. ఈ పీరియాడిక్ రోల్ లో రామ్ చరణ్ రాజకీయ నాయకుడిగా కనిపిస్తాడు. ఆయన భార్యగా చేస్తున్న అంజలి లుక్ సైతం అనధికారికంగా రిలీజ్ అయ్యింది.
అలాగే గేమ్ ఛేంజర్ మూవీలో రామ్ చరణ్ పొలిటికల్ మీటింగ్ సన్నివేశాల వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. వైజాగ్ షెడ్యూల్ లో జరిగిన సన్నివేశాల వీడియోలు సైతం చక్కర్లు కొట్టాయి. దర్శకుడు శంకర్ దీనిపై ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవడం లేదని తెలుస్తుంది. తాజాగా మరో సంచలన మేకింగ్ వీడియో బయటకు వచ్చింది. ఇది చూసిన ఫ్యాన్స్ ఒకింత సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
ఎయిర్ పోర్ట్ లో ఓ కీలక సన్నివేశం చిత్రీకరించగా ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. రామ్ చరణ్ సూట్ లో స్టైలిష్ గా ఉన్నారు. ఇక ఆయన కొందరు పొలిటికల్ లీడర్స్ కి స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తున్నాడు. ఈ లీక్డ్ వీడియో తో గేమ్ ఛేంజర్ మూవీలో రామ్ చరణ్ పాత్రపై మరింత క్లారిటీ వచ్చింది. రామ్ చరణ్ ఐఏఎస్ అధికారికగా నటిస్తున్నాడని సమాచారం. అవినీతిపరులైన పొలిటికల్ లీడర్స్ మీద కొరడా ఝుళిపించే హానెస్ట్ అధికారిగా ఆయన పాత్ర ఉండనుంది.
తన చర్యలతో బ్యాడ్ పొలిటీషియన్స్ కి రామ్ చరణ్ చుక్కలు చూపించడం ఖాయంగా కనిపిస్తుంది. దర్శకుడు శంకర్ తెరకెక్కించిన ఒకే ఒక్కడు పొలిటికల్ థ్రిల్లర్స్ లో ట్రెండ్ సెట్టర్. అనేక రికార్డులు బ్రేక్ చేసిన చిత్రం అది. చాలా గ్యాప్ తర్వాత శంకర్ తెరకెక్కిస్తున్న అవుట్ అండ్ అవుట్ పొలిటికల్ థ్రిల్లర్ గేమ్ ఛేంజర్. దీంతో అంచనాలు భారీగా ఉన్నాయి.
కెరీర్లో ఫస్ట్ టైం రామ్ చరణ్ పొలిటికల్ థ్రిల్లర్ చేస్తున్నాడు. అలాగే మరోసారి ఆయన డ్యూయల్ రోల్ లో అలరించనున్నాడు. రామ్ చరణ్ కి జంటగా కియారా అద్వానీ నటిస్తుంది. వీరి కాంబోలో వస్తున్నారు రెండో చిత్రం గేమ్ ఛేంజర్. గతంలో రామ్ చరణ్-కియారా వినయ విధేయ రామ చిత్రంలో జతకట్టారు. సునీల్, శ్రీకాంత్, అంజలి కీలక రోల్స్ చేస్తున్నారు.
దిల్ రాజు బ్యానర్ లో తెరకెక్కుతున్న 50వ చిత్రం గేమ్ ఛేంజర్ కావడం విశేషం. ఈ చిత్ర బడ్జెట్ దాదాపు రూ. 250 నుండి 300 కోట్లు. గేమ్ ఛేంజర్ చిత్రీకరణ ఆలస్యం అయ్యింది. మధ్యలో ఆగిపోయిన భారతీయుడు 2 చిత్రాన్ని శంకర్ తిరిగి పట్టాలెక్కించాడు. భారతీయుడు 2 పూర్తి అయ్యే వరకు గేమ్ ఛేంజర్ షూటింగ్ పై ఆయన పెద్దగా శ్రద్ధ పెట్టలేదు. జూన్ 12న భారతీయుడు 2 విడుదలైన సంగతి తెలిసిందే.
ఇక గేమ్ ఛేంజర్ మూవీతో ఇండియా వైడ్ బాక్సాఫీస్ కొల్లగొట్టాలని రామ్ చరణ్ ప్లాన్ చేస్తున్నాడు. ఆర్ ఆర్ ఆర్ తో ఆయనకు పాన్ ఇండియా ఇమేజ్ వచ్చింది. అయితే అది రాజమౌళి క్రెడిట్ అనే అపవాదు ఉంది. నాన్ రాజమౌళి చిత్రంతో పాన్ ఇండియా హిట్ కొట్టినప్పుడే సదరు హీరో సత్తా తెలుస్తుంది. అందుకే గేమ్ ఛేంజర్ చిత్రాన్ని రామ్ చరణ్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాడు. ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తున్నాడు.
#Gamechanger Leaked scene here it’s…
An Airport sequence
Shankar cooking something against #government #Ramcharan #Shankar #Kollywood #Tollywood #Raayantrailer #Indian2Disaster #MaxTeaser #Encounter #leak pic.twitter.com/nrua55J8mx
— Vikki (@stupid_guy_07) July 16, 2024
Web Title: Ram charan and director shankar combination game changer movie videos photos come out from the sets this video shake in the social media
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com