Homeఅంతర్జాతీయంAmerica President : అమెరికా అధ్యక్ష రేసులో ప్రవాస భారతీయురాలు.. హింట్‌ ఇచ్చిన అధ్యక్షుడు బైడెన్‌.

America President : అమెరికా అధ్యక్ష రేసులో ప్రవాస భారతీయురాలు.. హింట్‌ ఇచ్చిన అధ్యక్షుడు బైడెన్‌.

America President : అగ్ర రాజ్యం అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు వేడి పుట్టిస్తున్నాయి. ప్రెసిడెంట్‌ రేసులో చివరకు నిలబడి తలపడేది ఎవరన్న అంశం ఉత్కంఠ రేపుతోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా అమెరికా అధ్యక్ష అభ్యర్థుల కొరతను ఎదుర్కొంటోంది. ప్రస్తుతానికి అధ్యక్ష ఎన్నికల బరిలో డెమోక్రాట్‌ పార్టీ నుంచి ఆ దేశ ప్రస్తుత ప్రెసిడెంట్‌ జో బైడెన్, రిపబ్లికన్‌ పార్టీ అభ్యర్థిగా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ బరిలో నిలుస్తున్నారు. ఇద్దరూ ఎన్నికల క్యాంపేయ్‌ కూడా మొదలు పెట్టారు.

తెరపైకి కమలా హ్యారిస్‌..
అధ్యక్షుడు బైడెన్‌పై సానుకూలత ఉన్నా.. వయోభారం.. కొన్ని రోజులుగా ఆయన వ్యవహరిస్తున్న తీరు డెమోక్రాట్లతోపాటు అనుకూల ఓటర్లను ఆందోళనకు గురిచేస్తోంది. ఇక ట్రంప్‌ పాలనను ఇప్పటికే చూసిన అమెరికన్లున ఆయనను వద్దని అనుకుంటున్నారు. ఇద్దరిపైనా ప్రస్తుతం అమెరికన్లు సారుకూలంగా లేదు. అయితే బైడెక్‌ కన్నా.. ట్రంప్‌ బెటర్‌ అన్న భావన అమెరికన్లలో ఉంది. తాజాగా ఆయనపై జరిగిన దాడితో ట్రంప్‌కు మద్దతు పెరిగింది. ఈ క్రమంలో అధ్యక్ష పదవికి ఒక్కసారిగా భారత వారసత్వ మూలాలున్న కమలా హారిస్‌ పేరు తెరమీదకు వచ్చింది. అధ్యక్ష ఎన్నికల బరిలో జో బైడెన్‌కు బదులు కమలా హారిస్‌ను డెమోక్రాట్‌ పార్టీ చివరి క్షణంలో బరిలో నిలిపే ఛాన్స్‌ ఉందని ప్రచారం జరుగుతోంది

హింట్‌ ఇచ్చిన బైడెన్‌..
ఈ క్రమంలో అధ్యక్షుడు జో బైడెన్‌ చిన్న హింట్‌ ఇచ్చారు. కమలా హ్యారిస్‌ అమెరికా అధ్యక్ష పదవికి అర్హురాలు అని ప్రకటించారు. అధ్యక్షుడి వ్యాఖ్యలు ఇప్పుడు ఆసక్తి రేపుతున్నాయి. తాజాగా బైడెన్‌ నేషనల్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ది అడ్వాన్స్‌మెంట్‌ ఆఫ్‌ కలర్డ్‌ పీపుల్స్‌ అన్వాల్‌ కన్వేషన్‌ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా బైడెన్‌ మాట్లాడుతూ కమలా హ్యారిస్‌ గురించి ప్రస్తావించారు. హ్యారిస్‌ గొప్ప ఉపాధ్యక్షురాలు మాత్రమే కాదని, ఆమె అమెరికా ప్రెసిడెంట్‌ కూడా కావొచ్చని ప్రకటించారు. అధ్యక్షుడి మాటలు విన్న డెమోక్రాట్‌లు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉండగా బైడెన్‌ తాజా వ్యాఖ్యలు అమెరికా వ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి. అంతకు ముందు వైట్‌హౌస్‌ వర్గాలు డెమోక్రాటిక్‌ పార్టీ భవిష్యత్‌ కమలానే అని తెలిపాయి. అయితే కొన్నిసార్లు బైడెన్‌ తాను బరిలో ఉంటానని, ట్రంప్‌ను ఓడిస్తానని ప్రకటిస్తున్నారు. మరోవైపు ఇటీవల ట్రంప్‌తో నిర్వహించిన భేటీలో బైడెన్‌ తేలిపోయారు. ఈ నేపథ్యంలో బైడెన్‌ తప్పుకోవాలని డెమోక్రాట్స్‌ కోరుతున్నారు.

బైడెన్‌ కాదంటేనే కమలాకు ఛాన్స్‌..
ఇదిలా ఉంటే.. ఇటీవల నిర్వహించిన ప్రెసిడెన్షియల్‌ డిబేట్‌లో అధ్యక్షుడు బైడెన్‌ తడబడగా.. మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ పైచేయి సాధించారు. బైడెన్‌ మతిమరుపు వ్యాధితో బాధపడుతున్నారని.. ఆయన అధ్యక్ష రేసు నుంచి తప్పుకోవాలని రిపబ్లికన్లు సలహా ఇస్తున్నారు. డెమోక్రాటిక్‌ పార్టీ నుంచి బైడెన్‌కు బదులు మరో వ్యక్తికి అవకాశం ఇస్తే మంచిదని సొంత పార్టీ నేతలు కూడా సూచిస్తున్నారు. దీంతో బైడెన్‌కు బదులు కమలాహ్యారిస్‌ చివరి నిమిషంలో అధ్యక్ష రేసులోకి వస్తారని ప్రచారం జరుగుతోంది. ఏక్షణంలోనైనా బైడెన్‌ అధ్యక్ష బరి నుంచి తప్పుకుంటారని తెలుస్తోంది. ఆయన స్వయంగా వైదొలిగితే కమలాకు ఛాన్స్‌ దక్కుతుందని తెలుస్తోంది.

కమలావైపు ప్రపంచం చూపు..
కమలా హారస్‌ అధ్యక్ష ఎన్నికల బరిలో నిలిచే అవకాశముందన్న కథనాలతో.. ఇటు భారత్‌లోనూ అమెరికా ప్రెసిడెంట్‌ ఎన్నికలపై ఆసక్తి ఒక్కసారిగా పెరిగిపోయింది. మరోవైపు ప్రపంచం మొత్తం హ్యారిస్‌వైపు చూస్తోంది. సూపర్‌ పవర్‌ అమెరికాకు భారత సంతతికి చెందిన ఓ మహిళ అధ్యక్ష పీఠానికి చేరువ కావడం 140 కోట్ల మంది భారతీయులకు గర్వకారణమే. మూడున్నరేళ్ల క్రితం ఆమె అమెరికా వైస్‌ ప్రెసిడెంట్‌గా ప్రమాణ స్వీకారం చేసిన కమలా హ్యారిస్‌.. ఇప్పుడు ఇప్పుడు అధ్యక్ష పీఠానికి దగ్గర కావడంతో ఇప్పుడు భారతీయులందరూ ఆమె వైపే చూస్తున్నారు.

తొలి మహిళా అధ్యక్షురాలు?
అమెరికా రాజకీయ చరిత్రలో ఇప్పటి వరకు ఏ మహిళ ప్రెసిడెంట్‌ పీఠాన్ని అధిష్టించలేదు. వైస్‌ ప్రెసిడెండ్‌ పీఠాన్ని అధిష్టించిన తొలి మహిళ కమలాహ్యారీసే. 1984లో డెమొక్రాట్‌ జెరాల్డిన్‌ ఫెరారో, 2008లో రిపబ్లికన్‌ సారా పాలిన్‌ ఉపాధ్యక్ష ఎన్నికల బరిలో నిలిచినా.. పార్టీల ఓటమి కారణంగా విజయాన్ని సొంతం చేసుకోలేకపోయారు. 2020 ఉపాధ్యక్ష ఎన్నికల్లో కమలా హ్యారీస్‌ సాధించిన విజయం అంత ఈజీగా అయ్యింది కాదు. ఎన్ని ఆటంకాలు, విమర్శలు ఎదురైనా.. తన ప్రతిభతో సూపర్‌ పవర్‌ దేశానికి వైస్‌ ప్రెసిడెంట్‌ అయ్యారు.

ట్రంప్‌.. టెన్షన్‌..
డెమోక్రటిక్‌ పార్టీ అభ్యర్థిగా బైడెన్‌కు బదులు కమలా బరిలో నిలుస్తారన్న ప్రచారం నేపథ్యంలో ట్రంప్‌ టెన్షన్‌ పడుతున్నారు. వలస వచ్చిన వారికి జన్మించిన ఆమెకు అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేసే అర్హత లేదంటూ గతంలో ట్రంప్‌ అక్కసు వెళ్లగక్కారు. కమలా అధ్యక్ష అభ్యర్థి అయితే విమర్శల దాడిని ట్రంప్‌ మరింత పెంచే అవకాశం ఉంది.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
RELATED ARTICLES

Most Popular